Shreyas Iyer in IND vs NZ 2nd Test: కోహ్లి, రోహిత్, రాహుల్ లాంటి సీనియర్లు అందుబాటులో లేకపోవడం వల్ల అనుకోకుండా వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటూ అరంగేట్ర టెస్టులోనే శతకం సాధించి టెస్టు జట్టులో పాగా వేశాడు శ్రేయస్. ఇప్పుడిక పై ముగ్గురూ తిరిగి జట్టులోకి వస్తే శ్రేయస్ పరిస్థితేంటన్నది ఆసక్తికరం. రోహిత్ ఆడేది ఓపెనింగ్‌లో కాబట్టి మయాంక్, శుభ్‌మన్‌ల్లో ఒకరు తమ స్థానాన్ని త్యాగం చేస్తారు. రాహుల్‌కు టెస్టు జట్టులో సుస్థిర స్థానం ఏమీ లేదు కాబట్టి అతడి గురించి ఆలోచించాల్సిన పని లేదు.
Kohli to return IND vs NZ 2nd test: రోహిత్, రాహుల్ ఈ సిరీస్ మొత్తానికి అందుబాటులో లేరు. అయితే రెండో టెస్టుకు కోహ్లి తిరిగి జట్టులోకి వస్తున్నాడు. మామూలుగా అయితే అతడి కోసం శ్రేయస్‌నే పక్కన పెట్టాలి. కానీ అరంగేట్రంలోనే సెంచరీ చేసిన ఆటగాడిని తప్పించే అవకాశమే లేదు. జట్టులో ఫామ్ పరంగా ఇబ్బంది పడుతోంది రహానె, పుజారాలే. రహానె జట్టు వైస్ కెప్టెన్. పైగా తొలి టెస్టులో జట్టుకు నాయకత్వం వహించాడు కూడా. కాబట్టి రెండో ఇన్నింగ్స్‌లో జట్టును గెలిపించే స్థాయి ఇన్నింగ్స్ ఆడితే తప్ప పుజారాపై వేటు పడక తప్పదేమో!
ఇదీ చదవండి:
తొలి టెస్టులో శ్రేయస్ సెంచరీ.. భారత 16వ క్రికెటర్‌గా ఘనత