ప్రముఖ కూల్‌డ్రింక్ సంస్థ కోకాకోలాకు బ్రాండ్ అంబాసిడర్‌గా(Coca Cola India Brand Ambassador) టీమ్ఇండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ(Ganguly News) వ్యవహరిస్తున్నారు. త్వరలోనే ఈ కాంట్రాక్ట్ ముగియనున్న నేపథ్యంలో దాన్ని మరో మూడేళ్లు పొడిగిస్తున్నట్లు సదరు సంస్థ ఓ ప్రకటనలో తెలియజేసింది. ఈ విషయాన్ని కోకాకోలా సౌత్‌వెస్ట్ ఆసియా ఉపాధ్యక్షుడు, మార్కెటింగ్ హెడ్ అర్నాబ్ రాయ్ వెల్లడించారు. 2017లో కోకాకోలాకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికైన దాదా.. ఆ తర్వాత బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
"ఈ బ్రాండ్‌ను మరింత విస్తరించడం సహా దాన్ని ప్రోత్సహించేందుకు నేను ఎదురుచూస్తున్నా. గతంలో కంటే ఈసారి ఎక్కువగా భారత క్రీడల్లో తమదైన ముద్ర ఉండాలనే విధంగా కోకాకోలా ప్రణాళికలను సిద్ధం చేస్తుంది. భారత క్రీడలకు ఇదో గొప్ప వార్త".
- సౌరవ్ గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు
అమెరికాకు చెందిన ఈ శీతల పానీయ సంస్థ ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఎన్నో క్రీడా ఈవెంట్లకు ప్రచారకర్తగా ఉంది. కోకాకోలా, డైట్ కోక్,థమ్సప్, ఫాంటా వంటి కూల్‌డ్రింక్స్‌ను ఈ సంస్థే తయారు చేస్తుంది. ఇటీవలే జరిగిన టోక్యో ఒలింపిక్(Tokyo Olympics 2021) గేమ్స్‌కు థమ్సప్ కూల్‌డ్రింక్ ప్రపంచవ్యాప్త భాగస్వామిగా వ్యవహరించింది.
ఇదీ చూడండి.. IPL 2021: ఫైనల్ బెర్త్ లక్ష్యంగా కోల్‌కతా-దిల్లీ ఢీ.. ఇవి తెలుసుకోండి!