Cheteshwar Pujara county: టీమ్ఇండియా టెస్టు స్పెషలిస్ట్ ఛెతేశ్వర్ పుజారా ఇంగ్లాండ్ కౌంటీ క్రికెట్లో చెలరేగిపోతున్నాడు. ససెక్స్ టీమ్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న నయావాల్.. సెంచరీకి 'తగ్గేదే లే' అంటున్నాడు. తాజాగా, మిడిల్సెక్స్తో జరుగుతున్న మ్యాచ్‌లో 125 పరుగులు చేశాడు పుజారా. నాటౌట్‌గా నిలిచి రోజును ముగించాడు. ఈ సీజన్లో అతడికిది నాలుగో శతకం. అందులో రెండు ద్విశతకాలు ఉన్నాయి. టోర్నీలో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్లలో మూడో ప్లేస్‌లో దూసుకెళ్తున్నాడు.
కాగా, మిడిల్సెక్స్తో జరుగుతున్న మ్యాచ్‌లో పాక్ బౌలర్ షహీన్ అఫ్రిదీపై ఆధిపత్యం చెలాయించాడు పుజారా. అప్పర్‌కట్‌తో బంతిని స్టాండ్స్‌లోకి పంపించిన షాట్.. ఇన్నింగ్స్‌కే హైలైట్‌గా నిలిచింది.
-
Cheteshwar Pujara hits a Six off Shaheen Shah Afridi.
— Cric Top Class (@crictopclass) May 7, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
🎥 Sussex Cricket YouTube channel#Sussex #Pujara #Shaheen #Middlesex #SUSvMDX pic.twitter.com/Tzrqvm4M76
">Cheteshwar Pujara hits a Six off Shaheen Shah Afridi.
— Cric Top Class (@crictopclass) May 7, 2022
🎥 Sussex Cricket YouTube channel#Sussex #Pujara #Shaheen #Middlesex #SUSvMDX pic.twitter.com/Tzrqvm4M76Cheteshwar Pujara hits a Six off Shaheen Shah Afridi.
— Cric Top Class (@crictopclass) May 7, 2022
🎥 Sussex Cricket YouTube channel#Sussex #Pujara #Shaheen #Middlesex #SUSvMDX pic.twitter.com/Tzrqvm4M76
టీమ్ఇండియాలో చోటు ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో పుజారా దేశవాళీలో చెలరేగుతుండటం హర్షించదగిన పరిణామం. రంజీల్లో మోస్తరు ప్రదర్శన ఇచ్చిన పుజారా.. కౌంటీల్లో మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. అతడి ఫామ్‌ను చూసి ఇంగ్లాండ్‌తో జరగాల్సిన టెస్టు మ్యాచ్‌కు ఎంపిక చేసే అవకాశం ఉంది!
ఇదీ చదవండి: దిల్లీ ప్లేయర్‌కు కరోనా.. టోర్నీ మధ్యలో వెస్టిండీస్‌కు హెట్మెయర్