టీమ్ఇండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రాను ప్రశంసించాడు వెస్టిండీస్ మాజీ పేసర్ కర్ట్ లీ ఆంబ్రోస్. భవిష్యత్‌లో అతడు టెస్టుల్లో కచ్చితంగా 400 వికెట్ల మార్క్‌ను అందుకుంటాడని ధీమా వ్యక్తం చేశాడు.
"నేను బుమ్రాకు పెద్ద అభిమానిని. భారత్‌లో ఉత్తమమైన ఫాస్ట్ బౌలర్లు కొంతమంది ఉన్నారు. నేను చూసిన బౌలర్లలో అతడు ఎంతో ప్రత్యేకం, ప్రతిభావంతుడు. భవిష్యత్‌లో మరింత బాగా, ఎక్కువ కాలం రాణిస్తాడని ఆశిస్తున్నాను. సీమ్, స్వింగ్, యార్కర్లు.. ఇలా అన్ని విధాలుగా బౌలింగ్ చేయగలడు. కాబట్టి ఎక్కువ కాలం ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండి ఆడగలిగితే కచ్చితంగా 400 వికెట్లను అందుకోవడం ఖాయం" అని ఆంబ్రోస్ అన్నాడు.
ఇప్పటివరకు బుమ్రా 19 టెస్టుల్లో 83 వికెట్లు తీశాడు. 63 వన్డేల్లో 108 వికెట్లు, 50 టీ20ల్లో 59 వికెట్లు పడగొట్టాడు. త్వరలో జరగబోయే ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్, ఇంగ్లాండ్ సిరీస్‌లోనూ ఇతడు ఆడనున్నాడు.
ఇద చూడండి: బుమ్రా.. డెత్ ఓవర్స్ రక్షకుడు!