ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హాగ్.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)పై సంచలనాత్మక వ్యాఖ్యలు చేశాడు. "ఐపీఎల్లో భాగంగా నాకు పదేళ్ల క్రితం నాటి బకాయిలు రావాల్సి ఉంది.. అవి రావడానికి ప్రస్తుతానికి ఏదైనా అవకాశం ఉందా? బీసీసీఐ" అంటూ ట్వీట్ చేశాడు. 2011లో కొచ్చి టస్కర్స్ కేరళకు ప్రాతినిధ్యం వహించాడు హాగ్.
భారత మహిళా క్రికెటర్లకు గతేడాది ప్రపంచకప్‌కు సంబంధించి రన్నరప్ ప్రైజ్‌మనీ రావాల్సి ఉందని ఓ ప్రముఖ ఛానల్ కథనం ప్రచురించింది. చెల్లింపుల విషయంలో మహిళా, పురుష క్రికెటర్ల మధ్య అసమానతలు ఉన్నాయంటూ అందులో వెల్లడించింది. ఈ విషయం వైరల్‌గా మారింది. దీంతో త్వరలోనే వారికి ఆ ప్రైజ్‌మనీని చెల్లిస్తామని బోర్డు అధికారి తెలిపారు. ఈ నేపథ్యంలో ఆసీస్ ఆటగాడు తాజాగా ఈ వ్యాఖ్యలు చేశాడు.
-
Players are still owed 35% of their money earned from ten years ago from the @IPL representing Kochi tuskers. Any chance @BCCI could locate that money?
— Brad Hodge (@bradhodge007) May 24, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Players are still owed 35% of their money earned from ten years ago from the @IPL representing Kochi tuskers. Any chance @BCCI could locate that money?
— Brad Hodge (@bradhodge007) May 24, 2021Players are still owed 35% of their money earned from ten years ago from the @IPL representing Kochi tuskers. Any chance @BCCI could locate that money?
— Brad Hodge (@bradhodge007) May 24, 2021
ఐపీఎల్ ప్రారంభ సీజన్ నుంచి వివిధ ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించాడు హాగ్. 2011లో కొచ్చి టస్కర్స్ కేరళకు ఆడిన అతడు.. అప్పుడు కొచ్చి జట్టుకు ఆడిన ఆటగాళ్లకు చెల్లించాల్సిన మొత్తంలో 35 శాతం రావాల్సి ఉందని ట్విట్టర్ వేదికగా స్పందించాడు. కోల్‌కతాతో పాటు బెంగళూరు, కొచ్చి జట్లకు ఆడిన హడ్జ్.. మొత్తం 66 మ్యాచ్‌లాడాడు. 1400 పరుగులు సాధించడమే కాకుండా 17 వికెట్లు తీశాడు.
ఇదీ చదవండి: ఫస్ట్ క్లాస్ ప్లేయర్లకు 'రంజీ' పరిహారం ఎప్పుడో?