BBL Pushpa: అల్లు అర్జున్ 'పుష్ప' చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఇటీవల అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన ఈ సినిమా అక్కడా విశేషాదారణ దక్కించుకుంది. ఇందులో బన్నీ నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. టాలీవుడ్లోనే కాక దేశంలోని ప్రతి ఒక్కరూ ఈ చిత్రాన్ని మెచ్చుకుంటూ సామాజిక మాధ్యమాల్లో కామెంట్లు చేస్తున్నారు. టీమ్ఇండియా క్రికెటర్ రవీంద్ర జడేజా కూడా పలుమార్లు బన్నీ హావాభావాల్ని అనుకరిస్తూ వీడియోలు పోస్ట్ చేశాడు. తాజాగా ఈ సినిమా క్రేజ్ బంగ్లాదేశ్‌లోనూ కనిపించింది. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో ఆ దేశ బౌలర్ బన్నీ 'తగ్గేదే లే' సన్నివేశాన్ని కాపీ కొట్టి అందర్నీ ఆకట్టుకున్నాడు.
ఇదీ జరిగింది
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఈ సన్నివేశం చోటు చేసుకుంది. ఓ బంగ్లా బౌలర్ వేసిన బంతిని బ్యాటర్ షాట్ బాదగా.. అది బౌండరీ లైన్ వద్ద ఫీల్డర్ చేతిలో పడింది. దీంతో తన వికెట్ సెలబ్రేషన్‌ను 'పుష్ప'లోని బన్నీ 'తగ్గేదే లే' స్టైల్లో చేసుకున్నాడు ఆ బౌలర్. ఈ వీడియో కాస్తా ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. మరి ఆ వీడియోనూ మీరూ చూసేయండి.
-
Hype is Real.....@alluarjun 🙏🔥
— Censor Buzz (@CensorBuz) January 22, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
Craze beyond boundaries means this only .....
Bangladesh Premier league
Celebration of a Player by taking a wicket....#ThaggedheLe #PushpaRaj #PushpaTheRise pic.twitter.com/nWLOk8XWfI
">Hype is Real.....@alluarjun 🙏🔥
— Censor Buzz (@CensorBuz) January 22, 2022
Craze beyond boundaries means this only .....
Bangladesh Premier league
Celebration of a Player by taking a wicket....#ThaggedheLe #PushpaRaj #PushpaTheRise pic.twitter.com/nWLOk8XWfIHype is Real.....@alluarjun 🙏🔥
— Censor Buzz (@CensorBuz) January 22, 2022
Craze beyond boundaries means this only .....
Bangladesh Premier league
Celebration of a Player by taking a wicket....#ThaggedheLe #PushpaRaj #PushpaTheRise pic.twitter.com/nWLOk8XWfI
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!