ETV Bharat / sports

'రోహిత్​కు బౌలింగ్ చేయడం సులభమే'

author img

By

Published : May 21, 2021, 2:38 PM IST

పరిమిత ఓవర్ల క్రికెట్లో లెఫ్ట్ ఆర్మ్ పేసర్లను ఎదుర్కోవడంలో టీమ్ ఇండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ ఇబ్బంది పడతాడని అన్నాడు పాక్ మాజీ బౌలర్ మహ్మద్ ఆమిర్. కోహ్లీతో పోలిస్తే హిట్ మ్యాన్కు బౌలింగ్ చేయడం సులభమని వ్యాఖ్యానించాడు.

Bowling to Rohit Sharma comparatively easy
'కోహ్లీతో పోలిస్తే రోహిత్ కు బౌలింగ్ చేయడం సులభం'

టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కన్నా రోహిత్ శర్మకు బౌలింగ్ చేయడం సులభమని అన్నాడు పాకిస్థాన్ మాజీ పేసర్ మహ్మద్ ఆమిర్. అయితే వారిద్దరికీ బౌలింగ్ చేయడం ఎప్పుడూ కఠినంగా అనిపించలేదని తెలిపాడు.

"కోహ్లీ, రోహిత్.. ఇద్దరికీ బౌలింగ్ చేయడం ఎప్పుడూ కఠినంగా అనిపించలేదు. చెప్పాలంటే.. విరాట్తో పోలిస్తే రోహిత్కు బౌలింగ్ చేయడం సులభం. ఎందుకంటే ఆతడు ఎడమ చేతి వాటం ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడతాడు. రోహిత్ను నేను.. రెండు విధాలుగా (ఇన్ స్వింగ్, ఔట్ స్వింగ్) ఔట్ చేయగలను. ఒక రకంగా కోహ్లీకి బౌలింగ్ చేయడం కొంచెం కష్టం. ఎందుకంటే అతడు ఒత్తిడిలో మరింత మెరుగ్గా రాణిస్తాడు."

- మహ్మద్ ఆమిర్, పాకిస్థాన్ మాజీ పేసర్

2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో కోహ్లీ, రోహిత్లతో పాటు శిఖర్ ధావన్ వికెట్లు పడగొట్టాడు ఆమిర్. గతేడాది అనూహ్యంగా అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన అతడు.. ప్రస్తుతం లీగ్ క్రికెట్పై దృష్టి సారించాడు.

ఇదీ చూడండి: 'ఆస్ట్రేలియాతో కానిది.. టీమ్ఇండియా చేస్తోంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.