ETV Bharat / sports

Ind VS Aus : తొలిరోజు ఆట పూర్తి.. క్రీజులో రోహిత్​, రాహుల్​

దిల్లీ వేదికగా ఇండియా ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌ మొదటి రోజు ఆట ముగిసింది. టీమ్ఇండియా మొదటి ఇన్నింగ్స్​లో 21/0 స్కోరు సాధించి.. 242 పరుగులు వెనుకబడింది.

ind vs aus first day innings
ind vs aus first day innings
author img

By

Published : Feb 17, 2023, 5:07 PM IST

Updated : Feb 17, 2023, 5:27 PM IST

బోర్డర్​ గావస్కర్​ ట్రోఫీలో భాగంగా ఇండియా ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌ మొదటి రోజు ఆట ముగిసింది. టీమ్‌ఇండియా వికెట్లు నష్టపోకుండా 25 పరుగులు చేసింది. బ్యాటింగ్‌లో రోహిత్‌ శర్మ (18), కేఎల్​ రాహుల(12) పరుగులు చేశి క్రీజులో ఉన్నారు. మొదటి టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ 263 పరుగులకే ఆలౌటైంది. భారత బౌరర్లు రాణించినప్పటికీ.. కంగారూ బ్యాటర్లు ఉస్మాన్ ఖవాజా (81), పీటర్​ హ్యాండ్స్​కాంబ్​ (72) పరుగులతో అద్భుత ప్రదర్శన చేశారు. ఆసీస్​ స్కోరు బోర్డును పరుగెత్తించారు. మరో ఆసీస్ బ్యాటర్​ కమిన్స్​ (33) ఫర్వాలేనిపించాడు. భారత బౌలర్లలో షమీ 4 వికెట్లు తీశాడు. జడేజా, అశ్విన్ చెరో మూడు వికెట్లు పడగట్టి ఆసీస్‌ను పెద్ద దెబ్బ తీశారు.

రాహుల్​ అదిరిపోయే క్యాచ్​...
ఈ మ్యాచ్​లో టీమ్ఇండియా వైస్​ కెప్టెన్​ కేఎల్​ రాహుల్ అద్భుత క్యాచ్​ పట్టాడు. మహ్మద్​ షమీ వేసిన లాంగ్ లెంత్​ బాల్​ బ్యాటర్​ ట్రావిస్​ హెడ్ బ్యాటుకు చివరకు తగిలి.. సెకండ్​ స్లిప్​ మీదుగా ఫీల్డర్​ రాహుల్​ వద్దకు వెళ్లింది. దీంతో మొకాళ్లపై పడి రాహుల్​ అద్భుతంగా క్యాచ్​ పట్టాడు. దీంతో ఆసీస్ 108/4 వద్ధ 31.2 ఓవర్​లో ట్రావిస్​ ఔట్​ అయ్యాడు. కాగా, రాహుల్​ కొన్ని రోజులుగా తన రాణించలేకపోతున్నాడు. ఈ మధ్య కాలంలో మంచి స్కోరు కూడా సాధించలేకపోయాడు.​ దీంతో జట్టులో అతడిని తీసుకోవడంపై క్రీడా నిపుణులు, అభిమానుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, సూర్యకుమార్​ యాదవ్​ బదులు శ్రేయస్​ అయ్యర్​ను తుది జట్టులోకి తీసుకున్నారు. దీంతో శ్రేయస్​ అయ్యర్​ను బదులు రాహుల్​ను తప్పిస్తే బాగుండేదని సోషల్​ మీడియా వేదికగా టీమ్​ మేనేజ్​మెంట్​ను ప్రశ్నిస్తున్నారు.

ఇవీ చదవండి : BCCI చీఫ్​ సెలెక్టర్​ చేతన్​ శర్మ రాజీనామా.. ఆమోదించిన జై షా

Last Updated : Feb 17, 2023, 5:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.