ETV Bharat / sports

IND VS AUS: రెండేళ్ల తర్వాత రోహిత్ సెంచరీ.. నిరాశపరిచిన కోహ్లీ

తొలి టెస్టు రెండో రోజు ఆటలో రోహిత్ శర్మ సెంచరీతో అదరగొట్టాడు. ఇకపోతే మరో స్టార్ బ్యాటర్​ కోహ్లీ తక్కువ స్కోరుకే వెనుదిరిగి నిరాశపరిచాడు.

Border gavaskar trophy IND VS AUS Rohith century
కోహ్లీ నిరాశ.. రోహిత్ సెంచరీ
author img

By

Published : Feb 10, 2023, 1:02 PM IST

Updated : Feb 10, 2023, 1:59 PM IST

బోర్డర్​ గావస్కర్​ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆటలో భారత కెప్టెన్​ రోహిత్ శర్మ(101*) సెంచరీతో మెరిశాడు. కెరీర్లో అతడికి 9వ శతకం. దాదాపు రెండేళ్ల తర్వాత టెస్టుల్లో సెంచరీ కొట్టడం విశేషం. మర్ఫీ బౌలింగ్లో బౌండరీతో మూడంకెల మార్క్​ను తాకాడు. ప్రస్తుతం 63 ఓవర్లు ముగిసేసరికి టీస్ఇండియా స్కోరు 178/5. దీంతో తొలి ఇన్నింగ్స్లో భారత్ ఒక్క పరుగు ఆధిక్యంలోకి వచ్చింది. క్రీజ్​లో రోహిత్తోపాటు జడేజా (3*) ఉన్నాడు. ఈ సెంచరీ చేసేందుకు 171 బంతులు ఆడిన రోహిత్‌ 14 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో అంతర్జాతీయ కెరీర్‌లో తన 43వ శతకాన్ని పూర్తి చేశాడు.

ఈ సెంచరీ మార్క్​తో హిట్‌మ్యాన్‌ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. కెప్టెన్‌గా మూడు ఫార్మాట్లలో శతకాలు బాదిన తొలి భారత కెప్టెన్‌గా నిలిచాడు. ప్రపంచక్రికెట్​లో కెప్టెన్​గా మూడు ఫార్మాట్లలో ఈ ఘనత సాధించిన నాలుగో కెప్టెన్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఇకపోతే కెప్టెన్‌గా మూడు ఫార్మాట్లలో సెంచరీలు చేసిన రికార్డు ఇప్పటివరకు ముగ్గురి పేరిట ఉండేది. మొదట శ్రీలంక మాజీ కెప్టెన్‌ తిలకరత్నే దిల్షాన్‌ ఈ మార్క్ అందుకోగా.. ఆ తర్వాత సౌతాఫ్రికా మాజీ సారధి ఫాఫ్‌ డుప్లెసిస్‌, ఇటీవలే పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజామ్‌ కెప్టెన్లుగా ఈ ఘనత సాధించారు. తాజాగా రోహిత్‌ ఈ దిగ్గజ కెప్టెన్ల సరసన చేరాడు.

ఇకపోతే లంచ్‌ బ్రేక్​ తర్వాత తొలి బంతికే టీమ్​ఇండియాకు భారీ షాక్‌ తగిలింది. భోజన విరామం సయమం తర్వాత తొలి బంతికే విరాట్‌ (26 బంతుల్లో 12; 2 ఫోర్లు) ఔటయ్యాడు. కోహ్లీ వికెట్​ను కూడా ఆసీస్‌ యువ స్పిన్నర్‌ టాడ్‌ మర్ఫీయే తీశాడు. టీమ్​ఇండియా కోల్పోయిన నాలుగు వికెట్లు ఈ యువ స్పిన్నరే తీయడం విశేషం.

ఇదీ చూడండి: అశ్విన్ @ 450.. టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన స్టార్స్​ ఎవరంటే?

Last Updated : Feb 10, 2023, 1:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.