ETV Bharat / sports

Ind vs Aus : ఆస్ట్రేలియా ఇన్నింగ్స్​ పూర్తి.. 263 ఆలౌట్​! - ashwin records

బోర్డర్​ గావస్కర్​ ట్రోఫీలో భాగంగా ఇండియా ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో టెస్ట్​ తొలి రోజు ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ ముగిసింది. 263 పరుగులకు ఆసీస్​ ఆలౌట్​ అయింది. టీమ్ఇండియా బౌలర్లు మహమ్మద్​ షమీ 4 వికెట్లు పడగొట్టి అదరగొట్టాడు. అశ్విన్, జడేజా 3 వికెట్ల చొప్పున తీశారు.

border gavaskar trophy 2023 india vs australia second test

author img

By

Published : Feb 17, 2023, 4:19 PM IST

Updated : Feb 17, 2023, 4:46 PM IST

బోర్డర్​ గావస్కర్​ ట్రోఫీలో భాగంగా ఇండియా ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో టెస్ట్​ జరుగుతోంది. తొలి రోజు ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్​లో 263 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌరర్లు రాణించినప్పటికీ.. కంగారూ బ్యాటర్లు ఉస్మాన్ ఖవాజా (81), పీటర్​ హ్యాండ్స్​కాంబ్​ (72) పరుగులతో అద్భుత ప్రదర్శన చేశారు. ఆసీస్​ స్కోరు బోర్డును పరుగెత్తించారు. మరో ఆసీస్ బ్యాటర్​ కమిన్స్​ (33) ఫర్వాలేనిపించాడు. ఇక టీమ్ఇండియా బౌలర్ల విషయానికొస్తే.. మహమ్మద్​ షమీ 4 వికెట్లు పడగొట్టి అదరగొట్టాడు. అశ్విన్, జడేజా 3 వికెట్ల చొప్పున తీశారు.

టీమ్ఇండియా 'స్పిన్​ ద్వయం' రికార్డులు..
ఈ మ్యాచ్​లో భారత జట్టు స్పిన్ ద్వయం రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా రికార్డులు సృష్టించారు. దీంతో పాటు టీమ్ఇండియా టెస్టు స్పెషలిస్టు ఛెతేశ్వర్​ పుజారా కూడా అరుదైన ఘనత సాధించాడు. తన కెరీర్​లో వందో టెస్టు మైలురాయిని అందుకున్నాడు. ఈ మ్యాచ్​లో వికెట్ల వేట కొనసాగించిన అశ్విన్.. టీ బ్రేక్​ టైంకు 3 వికెట్లు తీసి.. ఆసీస్​పై 100 వికెట్లు తీసిన బౌలర్​గా రికార్డు నమోదు చేశాడు. దీంతో పాటు కంగారూ బ్యాటర్​ స్టీవ్​ స్మిత్​ను రెండు సార్లు డకౌట్​ చేసిన బౌలర్​గా అశ్విన్ నిలిచాడు. ఈ మ్యాచ్​లో జడెడా కూడా ఓ రికార్డు నమోదు చేశాడు. ఇప్పటివరకు టెస్టుల్లో 250 వికెట్లు పడగొట్టాడు.

ఇవీ చదవండి : పుజారా@ వందో టెస్ట్​.. సచిన్​, ద్రవిడ్​, కోహ్లీ సరసన చేరనున్న 'నయావాల్​'!

Last Updated : Feb 17, 2023, 4:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.