ETV Bharat / sports

రూట్​ బాటలో స్టోక్స్​.. ఐపీఎల్​ మెగా వేలానికి దూరం! - benstokes

Stokes out of IPL 2022: గతేడాది గాయం కారణంగా ఐపీఎల్ మధ్యలోనే వైదొలిగిన ఇంగ్లాండ్​ ఆల్​రౌండర్​ బెన్​స్టోక్స్​ ఈ సీజన్​కు కూడా అందుబాటులో ఉండట్లేదని తెలిసింది. ఇటీవలే జరిగిన యాషెస్ సిరీస్​లో ఆస్ట్రేలియాపై ఘోరంగా ఓడిపోయింది ఇంగ్లీష్​ జట్టు. ఈ నేపథ్యంలో జట్టుకు అండగా ఉండేందుకు స్టోక్స్​ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

stokes ipl
స్టోక్స్​ ఐపీఎల్​
author img

By

Published : Jan 17, 2022, 9:23 PM IST

Stokes out of IPL 2022: ఇంగ్లాండ్​ ఆల్​రౌండర్​ బెన్ ​స్టోక్స్​ తన జట్టు కెప్టెన్​ జో రూట్​ దారిలోనే నడవాలని నిశ్చయించుకున్నట్లు తెలిసింది. కష్టాల్లో ఉన్న తన జట్టు కోసం ఈ ఏడాది ఐపీఎల్​ మెగా వేలంలో పాల్గొనట్లేదని తెలిపాడు రూట్​. అతడు నిర్ణయం ప్రకటించిన కొద్దిసేపటిలోనే స్టోక్స్​ కూడా ఇదే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గతేడాది కూడా గాయం కారణంగా ఐపీఎల్​​​ మధ్యలోనే వైదొలిగాడు స్టోక్స్​.

ఇటీవల జరిగిన యాషెస్​ సిరీస్​లో ఆస్ట్రేలియా చేతిలో ఘోరంగా ఓడిపోయింది ఇంగ్లాండ్​. 4-0 తేడాతో సిరీస్​ను చేజార్చుకుంది. ఈ నేపథ్యంలోనే తమ జట్టుకు అండగా ఉండాలని స్టోక్స్​, రూట్​ ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఐపీఎల్​లో ఈ ఏడాది 10 జట్లు పాల్గొనబోతున్నాయి. అహ్మదాబాద్​, లఖ్​నవూ ప్రాంఛైజీలకు బీసీసీఐ ఇప్పటికే అధికారిక అనుమతులు ఇచ్చింది. కరోనా కేసులు తగ్గితే టోర్నీని భారత్​లోనే నిర్వహించనున్నారు. లేకపోతే విదేశాలకు వెళ్లేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

ఇదీ చూడండి: ఇంగ్లాండ్ జట్టు కోసం రూట్ త్యాగం.. ఐపీఎల్​కు దూరం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.