ETV Bharat / sports

ఆ నిర్ణయంతో భారత క్రికెట్ బోర్డుకు రూ. 1500 కోట్లు ఆదా!

ఐసీసీ తీసుకున్న నిర్ణయంతో బీసీసీఐకి(BCCI news) భారీ ఉపశమనం లభించనుంది. 2024-31 మధ్య భారత్​ వేదికగా నిర్వహించే టోర్నీల్లో భాగంగా పన్ను భారాన్ని భరించేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి సిద్ధమైంది.

team india
టీమ్​ఇండియా
author img

By

Published : Nov 17, 2021, 9:21 AM IST

అంతర్జాతీయ క్రికెట్ మండలి(ICC News).. రాబోయే పదేళ్లలో జరగనున్న 8 కొత్త టోర్నీల వివరాలను, వేదికలను మంగళవారమే ప్రకటించింది. ఈ నేపథ్యంలో భారత్​ 3 ఐసీసీ టోర్నీలకు ఆతిథ్యం ఇవ్వనుంది. 2026 టీ20 ప్రపంచకప్​ (శ్రీలంకతో సంయుక్తంగా)​, 2029 ఛాంపియన్స్​ ట్రోఫీ, 2031 వన్డే ప్రపంచకప్​నకు(బంగ్లాదేశ్​తో సంయుక్తంగా) మన దేశంలోనే జరగనున్నాయి. ఈ టోర్నీల నిర్వహణలో భాగంగా దాదాపు రూ. 1500 కోట్ల పన్ను భారం నుంచి బయటపడే అవకాశం భారత క్రికెట్ నియంత్రణ మండలికి(BCCI news) లభించింది.

ఐసీసీ భరిస్తుంది..

భారత ప్రభుత్వం నుంచి బీసీసీఐకి 10 శాతం కూడా పన్ను మినహాయింపు లభించదు. ఈ నేపథ్యంలో 2024-31 మధ్య భారత్​లో జరిగే ఐసీసీ టోర్నమెంట్​లకు వచ్చే పన్ను నష్టాన్ని భరించేందుకు అంగీకరించింది అంతర్జాతీయ క్రికెట్ మండలి. దీంతో బీసీసీఐకి ఉపశమనం లభించింది.

అయితే.. 2016 టీ20 ప్రపంచకప్​, 2023 వన్డే ప్రపంచకప్​ నిర్వహణ నేపథ్యంలో బీసీసీఐపై దాదాపు రూ. 750 కోట్ల పన్ను భారం పడుతుందని తెలుస్తోంది. 2021 టీ20 ప్రపంచకప్​ కూడా భారత్​ వేదికగా జరిగి ఉంటే.. ఈ భారం రూ. 1000 కోట్లకు పైగానే ఉండేది.

ఈ మేరకు బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ, సెక్రటరీ జై షా ఐసీసీతో ఈ పన్ను భారం అంశాన్ని లేవనెత్తినట్లు సమాచారం. దీంతో.. అంత మొత్తాన్ని బీసీసీఐ వ్యక్తిగతంగా భరించడం ఇబ్బంది అని ఐసీసీ బోర్డు అభిప్రాయపడినట్లు తెలిసింది. "ఇతర క్రికెట్​ బోర్డులన్నిటికీ తమ దేశ ప్రభుత్వాల నుంచి పన్ను మినహాయింపు ఉంటుంది. కానీ, కేంద్ర ప్రభుత్వం తమ కోసం చట్టాలను మార్చాలని బీసీసీఐ ఆశించదు. అందుకే.. పన్ను భారాన్ని మొత్తం ఐసీసీ భరించాలి. భారత్​లో జరిగే ఈవెంట్లతో బీసీసీఐ అధిక ఆదాయాన్ని అర్జిస్తోంది. అందుకే ఐసీసీకి వచ్చే ఆదాయం నుంచి బీసీసీఐ కోత విధించాల్సి అవసరం కూడా లేదు" అని ఓ అధికారి తెలిపారు.

ఇదీ చదవండి:

భారత్​లో 3 ఐసీసీ టోర్నమెంట్​లు- పాక్​లో ఛాంపియన్స్​ ట్రోఫీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.