ETV Bharat / sports

IND VS WI: మూడో టీ20కు అభిమానులకు అనుమతి - ఫ్యాన్స్​కు అనుమతి

IND VS WI third T20: వెస్టిండీస్​తో జరగబోయే మూడో టీ20 మ్యాచ్​కు పరిమిత సంఖ్యలో ప్రేక్షకులను అనుమతించనున్నారు. కరోనా వైరస్ ప్రభావం తగ్గుతున్న నేపథ్యంలో అభిమానులను అనుమతించాలని బంగాల్ క్రికెట్​ సంఘం చేసిన అభ్యర్థనను బీసీసీఐ అంగీకారం తెలిపింది.

BCCI
బీసీసీఐ
author img

By

Published : Feb 17, 2022, 9:13 AM IST

IND VS WI third T20: క్రికెట్​ అభిమానులకు శుభవార్త. ఈడెన్​ గార్డెన్స్​ వేదికగా వెస్టిండీస్​తో జరగబోయే మూడో టీ20కు ప్రేక్షకులను అనుమతించనున్నారు. 20వేల మంది అభిమానులను అనుమతించేలా బీసీసీఐ నిర్ణయం తీసుకుంది.

క్రికెట్​ అసోసియేషన్​ ఆఫ్​ బెంగాల్(సీఏబీ)​ అభ్యర్థన మేరకు బోర్డు సభ్యులతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధ్యక్షుడు గంగూలీ తెలిపాడు.

"మీ ప్రతిపాదన మేరకు ఇతర ఆఫీస్​ బేరర్లతో చర్చించాం. వెస్టిండీస్​తో జరగబోయే చివరి టీ20 మ్యాచ్​కు ప్రేక్షకులను అనుమతించొచ్చు" అని సీఏబీ చీఫ్​ అవిషేక్​ దాల్మియాకు ఈమెయిల్​ ద్వారా దాదా లేఖ పంపారు. ఈ అనుమతి ద్వారా సీఏబీ సభ్యులకు సహా దాని అనుబంధ క్రికెట్​ సంఘాలకు ఉచిత టికెట్లు పంపిణి చేసేందుకు అవకాశం లభించినట్లైంది. తమ ప్రదిపాదనను పరిగణలోకి తీసుకుని ప్రేక్షకులను అనుమతించేలా బోర్డు అనుమతి ఇచ్చినందుకు బోర్డుకు కృతజ్ఞతలు తెలిపింది సీఏబీ. కాగా, బుధవారం విండీస్​తో జరిగిన తొలి టీ20లో 6 వికెట్ల తేడాతో టీమ్​ఇండియా విజయం సాధించింది.

ఇదీ చూడండి: టీమ్ఇండియా గెలుపు.. తొలి టీ20లో విండీస్​పై విక్టరీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.