ETV Bharat / sports

BCCI Team India : రోహిత్​ సేనకు విశ్రాంతి.. బీసీసీఐ స్పెషల్​ పర్మిషన్​! - భారత ఆటగాళ్లకు విశ్రాంతి బీసీసీఐ​ పర్మిషన్​

BCCI Team India : ప్రపంచకప్​లో నాలుగు మ్యాచ్​లు ఆడి ఫుల్​ జోష్​లో ఉన్న టీమ్​ఇండియా ఆటగాళ్లకు కాస్త విశ్రాంతి దొరికే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్లేయర్స్​.. తమ కుటుంబ సభ్యులతో గడిపేందుకు బీసీసీఐ స్పేషల్​గా పర్మిషన్​ ఇవ్వనున్నట్లు సమాచారం.

India Players To Get 2 3 Day Break To Spend With Their Families
Team India Rest BCCI Permission
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 20, 2023, 1:29 PM IST

Updated : Oct 20, 2023, 2:48 PM IST

BCCI Team India : భారత్​ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో టీమ్​ఇండియా తన విజయ పరంపరను కొనసాగిస్తోంది. వరుసగా ఆడిన నాలుగు మ్చాచుల్లో గెలిచి ఫుల్​ జోష్​లో ఉంది. అయితే ఆదివారం (అక్టోబర్ 22న) ధర్మశాల వేదికగా న్యూజిలాండ్‌(IND vs NZ)తో జరిగే మరో కీలక మ్యాచ్‌కు రెడీ అవుతోంది​. ఇక కివీస్​తో తలపడిన తర్వాత అక్టోబర్ 29న ఇంగ్లాండ్‌(IND vs ENG)తో ఆడనుంది. అయితే ఈ రెండు మ్యాచ్​ల మధ్య ఆరు రోజుల సమయం ఉంది. ఈ నేపథ్యంలోనే భారత ఆటగాళ్లకు కాస్త విశ్రాంతి ఇచ్చే యోచనలో ఉంది బీసీసీఐ. తమ కుటుంబ సభ్యులతో కలిసి గడిపేందుకు ప్లేయర్లను ఇంటికి పంపించేందుకు ప్రత్యేకంగా అనుమతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

"న్యూజిలాండ్​తో మ్యాచ్‌ తర్వాత టీమ్​ఇండియా ఆడాల్సిన తదుపరి మ్యాచ్‌కు ఆరు రోజుల వ్యవధి ఉంది. దీంతో భారత ఆటగాళ్లను ఓ రెండు లేదా మూడు రోజులపాటు తమ ఇళ్లకు పంపించాలనే ఆలోచన చేస్తున్నాం. ఇలా తమ ఫ్యామిలీస్​తో గడిపి వచ్చాక మళ్లీ ఫుల్‌ జోష్‌తో బరిలోకి దిగేందుకు అవకాశం ఉంటుంది."

- బీసీసీఐ వర్గాలు

బిజీబిజీగా..
మరోవైపు ఇంటికి వెళ్లి వచ్చిన ఆటగాళ్ల కోసం వెంటనే ప్రాక్టీస్ సెషన్స్‌ను కూడా ఏర్పాటు చేసి మళ్లీ వారిని క్రికెట్‌ మూడ్‌లోకి దించేలా చూడలనేది బీసీసీఐ ప్రణాళికలో భాగంగా తెలుస్తోంది. అయితే లీగ్‌ స్టేజ్‌లో తొమ్మిది మ్యాచ్‌లను తొమ్మిది నగరాల్లోని మైదానాల్లో ఆడే ఏకైక జట్టు భారతే కావడం విశేషం. దీంతోపాటు గత ఆసియా కప్‌ నుంచి భారత క్రికెటర్లు తీరికలేకుండా బిజీ బిజీగా గడుపుతున్నారు. దీంతో ఇంగ్లాండ్‌తో జరిగే మ్యాచ్‌కు రెండు రోజుల ముందే ఆటగాళ్లంతా లఖ్‌నవూకు చేరుకొని ప్రాక్టీస్‌ మ్యాచ్​లు ఆడే అవకాశాలు ఉన్నాయి.

ఆ మ్యాచ్​కు హార్దిక్​ దూరం​..
మరోవైపు వన్డే ప్రపంచకప్​లో భాగంగా భారత్​ - బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్​లో టీమ్ఇండియా ఆల్​రౌండర్​ హార్దిక్ పాండ్య గాయపడ్డాడు. అయితే తాజాగా అతడికి వైద్య పరీక్షలు నిర్వహించగా.. కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. దీంతో అక్టోబర్​ 22న ధర్మశాల వేదికగా న్యూజిలాండ్​తో జరగనున్న మ్యాచ్​కు అతడు దూరమయ్యాడు. స్కానింగ్​ అనంతరం ఇప్పుడు హార్దిక్​ విశ్రాంతి కోసం బెంగళూరులోని నేషనల్​ క్రికెట్ అకాడమీకి వెళ్లనున్నాడు. వైద్యుల పర్యవేక్షణలో ఉండనున్న అతడు.. పూర్తిగా కోలుకున్నాక లఖ్​నవూ వేదికగా ఇంగ్లాండ్​తో జరగే మ్యాచ్​ను ఆడనున్నాడు.

Hardik Pandya World Cup 2023 : ప్రపంచకప్​కు హార్దిక్​ దూరం.. రీ ఎంట్రీ ఎప్పుడంటే ?

Virat Kohli World Cup Records : బంగ్లాపై సెంచరీ.. సచిన్‌ రికార్డుకు చేరువ.. కింగ్​ కోహ్లీ ఫినిషింగ్​ స్టైలే వేరయా!

Last Updated : Oct 20, 2023, 2:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.