ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 15వ సీజన్.. భారత్‌లోనే (IPL 2022) జరుగుతుందని ఆశిస్తున్నట్లు బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ చెప్పాడు. కరోనా కారణంగా టోర్నీ(IPL 2021) రెండో దశ యూఏఈలో జరిగింది. వచ్చే ఐపీఎల్ మాత్రం అఖండ ప్రేక్షకుల మధ్య మనదేశంలోనే నిర్వహిస్తామని దాదా (Sourav Ganguly Latest News) ఆశాభావం వ్యక్తం చేశాడు.
"దుబాయ్‌లో అదిరిపోయే వాతావరణం ఉంది. అయితే భారత్‌లో పరిస్థితి వేరుగా ఉంటుంది. స్టేడియం నిండిపోయి.. అభిమానులు ఉర్రుతలూగిపోతారు. అశేష ప్రేక్షకుల మధ్య భారత్‌లోనే వచ్చే ఏడాది ఐపీఎల్ నిర్వహిస్తామని అశిస్తున్నా. వచ్చే 8 నెలల్లో కరోనా పరిస్థితి కూడా పూర్తి భిన్నంగా ఉంటుంది."
- గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు
కరోనా కారణంగానే భారత్‌లో జరగాల్సిన టీ20 ప్రపంచకప్ (T20 World Cup 2021) యూఏఈ, ఒమన్ వేదికలుగా జరుగుతోంది. ఇప్పటివరకు 8 జట్లతో జరిగిన ఐపీఎల్లో వచ్చే ఏడాది కోసం కొత్తగా మరో 2 జట్లు (IPL 2022 New Teams) చేరనున్నాయి. ఐపీఎల్ 14 ఫైనల్లో కోల్‌కతాపై ఘనవిజయం సాధించి నాలుగోసారి టైటిల్ ఎగరేసుకుపోయింది చెన్నై సూపర్ కింగ్స్.
ఇదీ చూడండి: T20 World Cup 2021: నేటి నుంచే టీ20 ప్రపంచకప్