ETV Bharat / sports

ఆ ఆస్ట్రేలియా ప్లేయర్ల ఖర్చులన్నీ బీసీసీఐవే! - బీసీసీఐ ఖాతాలోనే ఆ ప్లేయర్ల ఖర్చులన్నీ!

ఐపీఎల్​లో పాల్గొన్న ఆసీస్​ క్రికెటర్ల క్వారంటైన్​ ఖర్చును భారత క్రికెట్ నియంత్రణ బోర్డు(బీసీసీఐ) భరించనుంది. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా తాత్కాలిక సీఈఓ నిక్ హాక్లీ ధ్రువీకరించాడు. మొత్తం 38 మంది బిల్లును చెల్లించనుంది బీసీసీఐ.

ipl, bcci
ఐపీఎల్, బీసీసీఐ
author img

By

Published : May 18, 2021, 8:38 PM IST

ఐపీఎల్​లో ఆడి, స్వదేశానికి తిరిగొచ్చిన ఆసీస్​ క్రికెటర్ల క్వారంటైన్​ బిల్లును భారత క్రికెట్ నియంత్రణ బోర్డు(బీసీసీఐ) చెల్లించనుందని క్రికెట్ ఆస్ట్రేలియా వెల్లడించింది. ఆటగాళ్లతో పాటు వ్యాఖ్యాతలు, కోచ్​లు కలిపి మొత్తం 38మంది లీగ్​లో పాల్గొన్నారు. మాల్దీవుల నుంచి ఆస్ట్రేలియా చేరుకున్న వీరంతా.. సిడ్నీలో 14 రోజుల తప్పనిసరి క్వారంటైన్​లో ఉండనున్నారు.

"క్రికెటర్లను సురక్షితంగా స్వదేశానికి చేరవేసింది బీసీసీఐ. తప్పనిసరి నిర్బంధంలో ఉన్న ఆసీస్​ ఆటగాళ్ల క్వారంటైన్​ బిల్లును కూడా చెల్లిస్తుంది. మేము వారితో కలిసి పనిచేస్తున్నాం. భారత క్రికెట్ బోర్డు ఇచ్చిన మాట నిలబెట్టుకుంది."

-నిక్ హక్లీ, క్రికెట్ ఆస్ట్రేలియా తాత్కాలిక సీఈఓ.

ఐపీఎల్​లో కరోనా కేసులు బయటపడటం వల్ల టోర్నీని రద్దు చేస్తున్నట్లు బీసీసీఐ మే 4న ప్రకటించింది. కరోనా విజృంభణ కారణంతో భారత్​ నుంచి విమాన రాకపోకలను నిషేధించింది ఆస్ట్రేలియా. దీంతో ఆసీస్​ ఆటగాళ్లను మాల్దీవులకు పంపింది బీసీసీఐ. అక్కడ 10 రోజుల తప్పనిసరి క్వారంటైన్​లో ఉంచింది. అటు నుంచి ఆటగాళ్లను సోమవారం ఆస్ట్రేలియాకు పంపింది.

ఇదీ చదవండి: బీసీసీఐపై ఆరోపణలు.. తోసిపుచ్చిన హర్మన్, మిథాలీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.