ETV Bharat / sports

క్రికెటర్ సాహా-జర్నలిస్ట్ వివాదం.. కమిటీ వేసిన బీసీసీఐ

గత కొన్నిరోజుల నుంచి భారత క్రికెట్​లో ఎక్కువ మంది చర్చించుకున్న అంశం. సీనియర్ క్రికెటర్ సాహాను ఓ సీనియర్ జర్నలిస్టు బెదిరించడం. ఇప్పుడు ఈ విషయమై బీసీసీఐ, న్యాయ విచారణ కమిటీ వేసింది.

saha bcci news
సాహా ఇష్యూ
author img

By

Published : Feb 25, 2022, 9:59 PM IST

భారత క్రికెటర్ వృద్ధిమన్ సాహాను ఓ జర్నలిస్ట్ బెదిరించడం ఇటీవల కాలంలో వివాదాస్పదమైంది. గత కొన్నిరోజుల నుంచి ఇదే విషయమై తెగ చర్చ జరుగుతుంది. పలువురు క్రికెటర్లు సాహాకు మద్దతుగా నిలిచారు. ఈ క్రమంలోనే ముగ్గురు సభ్యుల న్యాయ విచారణ కమిటీ వేసింది.

ఈ కమిటీలో బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా, కోశాధికారి అరుణ్ ధుమాల్, అపెక్స్ కౌన్సిల్ మెంబర్ ప్రభ్​తేజ్ సింగ్ ఉన్నారు. వచ్చే వారం.. వీరు ఈ విషయమై తదుపరి విచారణ చేయనున్నారని బీసీసీఐ స్పష్టం చేసింది.

bcci tweet
బీసీసీఐ త్రీ మెంబర్ కమిటీ

అసలేమైందంటే?

టీమ్​ఇండియా టెస్టు వికెట్​ కీపర్ బ్యాటర్ వృద్ధిమన్ సాహా.. ఓ జర్నలిస్టుపై ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆ జర్నలిస్టు ఇంటర్వ్యూ కోసం తనను బలవంతం చేసినట్లు పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించిన వాట్సాప్‌ మెసేజీల స్క్రీన్‌షాట్‌ బహిర్గతం చేశాడు. అయితే, తాను స్పందించకపోయేసరికి తీవ్ర వ్యాఖ్యలు చేశాడని సాహా పేర్కొన్నాడు.

'భారత క్రికెట్‌ జట్టుకు నేను చేసిన సేవలకు గాను ఒక జర్నలిస్టు నుంచి ఎదురైన అనుభవం ఇది. జర్నలిజం ఇంత దిగజారిపోయింది' అని సాహా విచారం వ్యక్తం చేశాడు. శ్రీలంకతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు సాహాకు జట్టులో చోటు దక్కని నేపథ్యంలో ఈ ఘటన జరిగింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.