ETV Bharat / sports

BCCI AGM 2021: 'సెప్టెంబర్​ తర్వాతే బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశం'

author img

By

Published : Aug 28, 2021, 11:49 AM IST

ఈ ఏడాది నిర్వహించాల్సిన బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశం (BCCI AGM 2021) సెప్టెంబర్​ 30లోపు ఉండదని కార్యదర్శి జై షా (BCCI Secretary Jay Shah) స్పష్టం చేశారు. కొవిడ్ నిబంధనల వల్ల ఆ కార్యక్రమం వాయిదా పడిందని వెల్లడించారు. తదుపరి కొత్త తేదీని నిర్ణయించాక అనుబంధ సంస్థలకు తెలియజేస్తామని పేర్కొన్నారు.

BCCI AGM
బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశం

భారత నియంత్రణ క్రికెట్​ సంస్థ (బీసీసీఐ) వార్షిక సర్వసభ్య సమావేశంపై (BCCI AGM 2021) కార్యదర్శి జై షా (BCCI Secretary Jay Shah) స్పందించారు. కరోనా కారణంగా ఈ ఏడాది జరగాల్సిన మీటింగ్​ను సెప్టెంబర్​ 30కి ముందు నిర్వహించట్లేదని స్పష్టం చేశారు. తదుపరి తేదీని నిర్ణయించాక బీసీసీఐ అనుబంధ సంస్థలకు వెల్లడిస్తామని పేర్కొన్నారు.

తమిళనాడు ప్రభుత్వానికి సంబంధించిన ఓ ఉత్తర్వును కూడా జై షా లేఖలో పేర్కొన్నారు. కొవిడ్ మహమ్మారి ప్రబలంగా ఉన్న కారణంగా 2020-21కి సంబంధించి వార్షిక సర్వసభ్య సమావేశాలు సెప్టెంబర్​ నుంచి డిసెంబర్​కు మూడు నెలలు వాయిదా వేయాలని జారీ చేసిన జీవోను ఆయన ఉదహరించారు. జూన్​ 30, 2021న జీవో నంబర్​ 96 పేరుతో ఈ జీవోను తమిళనాడు ప్రభుత్వం జారీ చేసింది. ఈ ఉత్తర్వును దృష్టిలో ఉంచుకుని తాజా నిర్ణయం తీసుకున్నట్లు షా స్పష్టం చేశారు.

బీసీసీఐ 89వ వార్షిక సర్వసభ్య సమావేశాన్ని గతేడాది డిసెంబర్ 24న నిర్వహించింది. తాజా కొవిడ్ నేపథ్యంలో ఏజీఎం మీటింగ్ జరగదని తెలిసే.. లార్డ్స్​ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్​ సందర్భంగా బీసీసీఐ అధికారులు, సిబ్బంది, కోచింగ్ సిబ్బంది కలుసుకున్నట్లు తెలుస్తోంది. టీ20 ప్రపంచకప్​, ఐపీఎల్​ గురించి చర్చలు అక్కడే జరిగినట్లు సమాచారం.

ఇదీ చదవండి: 'గతంలో ఇలా ఆడలేదు.. కొత్త పుజారాను చూస్తున్నాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.