Bangladesh World Cup 2023 : ఐసీసీ వన్డే ప్రపంచ కప్ - 2023లో పాల్గొనే 10 జట్లలో బంగ్లాదేశ్ ఒకటి. క్రికెట్లోకి పసికూనగా ఎంట్రీ ఇచ్చి కొన్ని కొన్ని మేటి జట్లకు షాక్ లు ఇచ్చి, సంచలన విజయాలు నమోదు చేసింది. ఆయా టోర్నీలు, సిరీస్‌ల్లో పెద్ద జట్లకు ఓటమి రుచి చూపించింది. బంగ్లాదేశ్ 1999 ప్రపంచకప్‌లో పాకిస్థాన్, 2007లో భారత్‌ను ఓడించి తాము తక్కువేం కాదని ప్రపంచానికి తెలియజేసింది. ఈ జట్టులోని ఆటగాళ్లు భారత్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా వంటి దేశాలకు సైతం గట్టి పోటీ ఇవ్వగలరు. అయితే అక్టోబర్ 7న ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్.. అఫ్గానిస్థాన్‌తో తలపడనుంది. మరి ఈ క్రమంలో టోర్నీలో ప్రభావం చూపగలగే సత్తా ఉన్న ఆటగాళ్లెవరో చూద్దాం.
-
Bangladesh Team Practice at SBNCS (25-09-23) 🏏 🇧🇩#BCB | #Cricket | #BANvNZ pic.twitter.com/5968ePu6ZS
— Bangladesh Cricket (@BCBtigers) September 25, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Bangladesh Team Practice at SBNCS (25-09-23) 🏏 🇧🇩#BCB | #Cricket | #BANvNZ pic.twitter.com/5968ePu6ZS
— Bangladesh Cricket (@BCBtigers) September 25, 2023Bangladesh Team Practice at SBNCS (25-09-23) 🏏 🇧🇩#BCB | #Cricket | #BANvNZ pic.twitter.com/5968ePu6ZS
— Bangladesh Cricket (@BCBtigers) September 25, 2023
- షకిబ్ అల్ హసన్
అంతర్జాతీయ క్రికెట్లో టాప్ ఆల్ రౌండర్లలో షకిబ్ ఒకడు. బంగ్లాదేశ్‌లో కీలక ప్లేయరే కాకుండా ప్రస్తుత జట్టుకు కెప్టెన్ కూడా. తన ఆల్ రౌండ్ ప్రదర్శనతో ప్రత్యర్థి జట్లకు చెమటలు పట్టించి బంగ్లాకు అనేక విజయాలందించాడు. తన టెక్నిక్‌తో బంతిని స్టాండ్స్‌లోకి పంపడంలో షకిబ్ దిట్ట. ఇప్పటిదాకా 240 వన్డే మ్యాచ్‌లు ఆడిన షకిబ్.. 7,384 పరుగులు చేశాడు. అటు బౌలింగ్ లో 4.44 ఎకానమీతో 308 వికెట్లు పడగొట్టి.. ఒక దశాబ్దానికిపైగా బంగ్లాదేశ్‌లో కీ ప్లేయర్ రోల్ పోషిస్తున్నాడు. - ముష్ఫికర్ రహీమ్
ముష్ఫికర్ రహీమ్.. బంగ్లా క్రికెట్ జట్టులో అనుభవం కలిగిన కీలక ఆటగాడు. కొంతకాలం ముష్ఫికర్ బంగ్లా జాతీయ జట్టుకు కెప్టెన్గాన వ్యవహరించాడు. క్రీజులో కుదురుకున్నాక బౌండరీలతో ప్రత్యర్థి జట్టు బౌలర్లపై విరుచుకుపడతాడు. నిలకడతో కూడిన ఆటతీరుతో పాటు వికెట్ కీపర్‌గానూ జట్టుకు ఎన్నో సేవలందిచాడు. వికెట్ కీపర్‌గా ముష్ఫికర్.. అనేక క్యాచ్‌లు, స్టంపింగ్స్ చేశాడు. అతడు ఇప్పటి వరకు ఆడిన 256 వన్డేల్లో.. 7406 పరుగులు సాధించాడు. అందులో 9 సెంచరీలు, 46 హాఫ్ సెంచరీలున్నాయి. ఇక తన కెరీర్లో కీపర్‌గా 222 క్యాచులు అందుకోగా 55 స్టంపింగ్‌లు ,10 రనౌట్లు చేశాడు. - ముస్తాఫిజుర్ రహ్మాన్..
కచ్చితత్వంతో కూడిన పేస్‌తో అనుకున్న చోట బంతులు వేయగలడు ముస్తాఫిజుర్ రహ్మాన్. అతడు పేస్‌తో పాటు.. యార్కర్లు కూడా సంధిస్తూ వరల్డ్ క్లాస్ బ్యాటర్లనైనా ఇబ్బంది పెట్టగలడు. ముస్తాఫిజుర్.. క్రికెట్లో అరంగేట్రం చేసిన కొత్తలో టీమ్ఇండియాలో రోహిత్, విరాట్ వికెట్లు పడగొట్టి వెలుగులోకి వచ్చాడు. వికెట్లు పడగొట్టడమే కాకుండా.. డెత్ ఓవర్లలో ప్రత్యర్థి జట్టు స్కోర్‌ను కంట్రోల్ చేయగలడు. ఐపీఎల్ వల్ల ముస్తాఫిజుర్‌కు.. భారత్ పిచ్‌లపైన ఓ అవగాహన కూడా ఉంది. ఇప్పటి వరకు అతడు.. 93 వన్డేల్లో 5.07 ఎకానమీతో 156 వికెట్లు పడగొట్టాడు. - మెహిదీ హసన్ మిరాజ్..
బంగ్లాదేశ్ జట్టులో నాణ్యమైన ఆటగాళ్లలో మెహిదీ హసన్ మిరాజ్ ఒకడు. తనదైన రోజున అటు బంతి, ఇటు బ్యాట్‌తో చెలరేగిపోతాడు. ఇటీవల ముగిసిన 2023 ఆసియాకప్ టోర్నీలోనూ.. హసన్ చెప్పుకోదగ్గ ప్రదర్శనే చేశాడు. భారత్ పిచ్‌లపైనా ఆఫ్ స్పిన్‌తో బంతిని గింగిరాలు తిప్పగలడు. 80 వన్డేలు ఆడిన అతడు.. 1046 పరుగులు చేసి.. 91 వికెట్లు పడగొట్టాడు. బ్యాటింగ్‌లో రెండుసార్లు 100+ స్కోర్లు నమోదు చేశాడు. - లిటన్ దాస్
దూకుడుతో కూడిన ఆటకు లిటన్ దాస్ పెట్టింది పేరు. బంగ్లా డేంజరస్ ఆటగాడిగా పేరున్న దాస్..తన అనేక సార్లు సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. గతేడాది జరిగిన టీ-20 వరల్డ్ కప్‌లో టీమ్ఇండియాపై కీలక ఇన్నింగ్స్ ఆడాడు. తన కెరీర్లో 77 వన్డేలు ఆడిన దాస్.. 2250 పరుగులు సాధించాడు. ఇందులో 5 సెంచరీలు 10 అర్ధ సెంచరీలు ఉన్నాయి. .
2023 వరల్డ్‌కప్‌నకు బంగ్లాదేశ్ జట్టు.. బంగ్లాదేశ్.. షకీబ్ అల్ హసన్ (కెప్టెన్), ముష్ఫికర్ రహీమ్, లిట్టన్ దాస్, మజ్ముల్ హొసన్ శాంటో, మెహెదీ హసన్ మిర్జా, హ్రిదోయ్, తస్కిన్ ఆహ్మద్, ముష్ఫికర్ రహమాన్, షరీఫుల్ ఇస్లామ్, హసన్ మహ్మూద్, నసుమ్ అహ్మద్, మహెదీ హసన్, తన్జీమ్ షకిబ్, తన్జీద్ తమిమ్, మహ్మదుల్లా.
బంగ్లా కెప్టెన్ యూటర్న్.. రిటైర్మెంట్ నిర్ణయం వెనక్కి.. ప్రధాని జోక్యంతో..
స్టార్ క్రికెటర్ షర్ట్ పట్టుకుని లాగేసిన ఫ్యాన్స్.. కొంచెం ఉంటే కింద పడిపోయేవాడే!