Ball Stuck In Wicket Keeper Pad : క్రికెట్‌లో సీరియస్‌గా సాగుతున్న మ్యాచ్‌లో అప్పుడప్పుడు వింత సంఘటనలు కాసేపు నవ్వులు పూయిస్తాయి. అయితే తాజాగా యూరోపియన్ టీ10 క్రికెట్ లీగ్‌లో అలాంటి సంఘటనే జరిగింది. ఈ టోర్నీలో భాగంగా మ్యాజిక్ సీసీ - రాయల్ బార్సిలోనా జట్లు తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన మ్యాజిక్ సీసీ 9.5 ఓవర్లకు 155-4 వద్ద నిలిచింది.
ఇన్నింగ్స్ ఆఖరి బంతిని షాట్‌గా మలచడంలో బ్యాటర్ విఫలమయ్యాడు. దీంతో క్రీజులో ఉన్న బ్యాటర్లు పరుగులు తీస్తున్నారు. అయితే ఫీల్డర్ బంతిని వికెట్ కీపర్‌కు విసరగా, అది అతడి ప్యాడ్‌లో చిక్కుకుంది. దీంతో బ్యాటర్లు అదనంగా మరో పరుగు తీశారు. వాళ్లను ఔట్ చేసే ఈ క్రమంలో, కీపర్ బంతిని బౌలర్ ఎండ్‌కు విసరగా అతడు బంతిని అందుకోలేదు. దీంత క్రీజులో ఉన్న బ్యాటర్లు నాలుగో పరుగుకు కూడా ప్రయత్నించారు. కానీ, ఈసారి అదృష్టం వారిని వరించలేదు. నాలుగో పరుగు పూర్తికాక ముందే రనౌటయ్యాడు. ఇక ఇన్నింగ్స్‌ను 158-5తో ముగించారు. అనంతరం ఛేజింగ్‌లో రాయల్ బార్సిలోనా జట్టు 9.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకొని విజయం నమోదు చేసింది.
-
Ball stuck in keeper's pads allows a third run😅#EuropeanCricket #EuropeanCricketSeries #StrongerTogether pic.twitter.com/N5ZtLHBVR1
— European Cricket (@EuropeanCricket) December 10, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Ball stuck in keeper's pads allows a third run😅#EuropeanCricket #EuropeanCricketSeries #StrongerTogether pic.twitter.com/N5ZtLHBVR1
— European Cricket (@EuropeanCricket) December 10, 2023Ball stuck in keeper's pads allows a third run😅#EuropeanCricket #EuropeanCricketSeries #StrongerTogether pic.twitter.com/N5ZtLHBVR1
— European Cricket (@EuropeanCricket) December 10, 2023
విచిత్రమైన కారణంతో మ్యాచ్ రద్దు
ఆస్ట్రేలియా బిగ్‌బాష్ లీగ్ 2023లో విచిత్ర పరిణామం జరిగింది. టోర్నీలో భాగంగా ఆదివారం మెల్బోర్న్ రెనెగేడ్స్ - పెర్త్ స్కార్చర్స్ మధ్య, గీలాంగ్ సైమండ్స్ స్టేడియంలో జరగాల్సిన మ్యాచ్ అనూహ్యంగా రద్దైంది. టాస్ నెగ్గిన మెల్బోర్న్, పెర్త్‌ను బ్యాటింగ్‌కు అహ్వానించింది. ఈ క్రమంలో పెర్త్ 18 పరుగులకే ఓపెనర్లు స్టీఫెన్ (0), కూపర్ (6) వికెట్లు కోల్పోయింది. అయితే ఇన్నింగ్స్ ప్రారంభం నుంచే బంతి ఎక్కువగా బౌన్స్ అవుతోంది.
ఈ క్రమంలో మెల్బోర్న్ బౌలర్ సదర్లాండ్ వేసిన 6 ఓవర్లో తొలి మూడు బంతులు అనూహ్యంగా బౌన్స్ అయ్యాయి. దీంతో బ్యాటర్లు సహా, వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో పరిస్థితిని గమణించిన ఫీల్డ్ అంపైర్లు, ఇరుజట్ల కెప్టెన్లతో ముచ్చటించి మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఇరుజట్లు చెరోపాయింట్ పంచుకున్నాయి.
అయితే మ్యాచ్‌కు ముందురోజు రాత్రి స్టేడియం ప్రాంతంలో భారీ వర్షం కురిసిందట. ఈ క్రమంలో గ్రౌండ్‌ను కప్పి ఉంచిన కవర్స్ లీకై నీళ్లు పిచ్‌పై చేరినట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే పిచ్ ప్రమాదకరంగా మారి, బంతి ఎక్కువగా బౌన్స్ అయిందని క్రీడా విశ్లేషకులు అంటున్నారు.
-
Big bash match between Melbourne Renegades & Perth Scorcher was suspended due to an “unsafe pitch”
— Cricket Shouts 🏏 (@crickshouts) December 10, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Lots of village games where “unsafe pitches” would have been an issue 😂
📸 7Cricket
pic.twitter.com/k9WgjG3SkI
">Big bash match between Melbourne Renegades & Perth Scorcher was suspended due to an “unsafe pitch”
— Cricket Shouts 🏏 (@crickshouts) December 10, 2023
Lots of village games where “unsafe pitches” would have been an issue 😂
📸 7Cricket
pic.twitter.com/k9WgjG3SkIBig bash match between Melbourne Renegades & Perth Scorcher was suspended due to an “unsafe pitch”
— Cricket Shouts 🏏 (@crickshouts) December 10, 2023
Lots of village games where “unsafe pitches” would have been an issue 😂
📸 7Cricket
pic.twitter.com/k9WgjG3SkI
-
Hear from Aaron Finch on the @FoxCricket mic as the umpires have a chat about the pitch in Geelong...#BBL13 pic.twitter.com/PsHbPQZZaL
— KFC Big Bash League (@BBL) December 10, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Hear from Aaron Finch on the @FoxCricket mic as the umpires have a chat about the pitch in Geelong...#BBL13 pic.twitter.com/PsHbPQZZaL
— KFC Big Bash League (@BBL) December 10, 2023Hear from Aaron Finch on the @FoxCricket mic as the umpires have a chat about the pitch in Geelong...#BBL13 pic.twitter.com/PsHbPQZZaL
— KFC Big Bash League (@BBL) December 10, 2023