ఐపీఎల్ రెండో దశ నుంచి ఇద్దరు ఇంగ్లాండ్ క్రికెటర్లు వైదొలిగారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ జానీ బెయిర్‌స్టో, పంజాబ్ కింగ్స్ బ్యాట్స్‌మన్ డేవిడ్ మలన్ వ్యక్తిగత కారణాలతో తప్పుకున్నారు. దీంతో ఆయా జట్లకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లు అయ్యింది. కరోనా కారణంగా అర్ధాంతరంగా ఆగిపోయిన ఐపీఎల్ 14.. సెప్టెంబర్ 19న తిరిగి ప్రారంభంకానుంది.
క్వారంటైనే కారణం!
మాంచెస్టర్ నుంచి యూఏఈకి ఇంగ్లాండ్, టీమ్ఇండియా క్రికెటర్లు కలిసే పయనించాల్సింది. అయితే పర్యాటక జట్టులో కరోనా కలకలం వల్ల వేరుగానే వెళ్తున్నాయి. దుబాయ్‌కి వచ్చే ప్రతి ప్లేయర్ తప్పనిసరిగా 6రోజుల పాటు క్వారంటైన్లో ఉండాలనే నిబంధన కూడా బెయిర్‌స్టో, మలన్ తప్పుకోవడానికి ఓ కారణమై ఉంటుందని సమాచారం.
వోక్స్ కూడా..!
దిల్లీ క్యాపిటల్స్‌కు ఆడే ఇంగ్లాండ్ ఆర్రౌండర్ క్రిస్ వోక్స్ కూడా ఐపీఎల్లో ఆడటంపై అనుమానం నెలకొంది. ఐపీఎల్ వెంటనే టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. దీంతో కుటుంబంతో గడపడానికి తగిన సమయం లభిస్తుందని బెయిర్‌స్టో, మలన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చూడండి: IPL 2021:ఫ్రాంచైజీలకు బీసీసీఐ కీలక ఆదేశాలు..