టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ గారాల పట్టి వామిక జన్మించి ఆరు నెలలైన సందర్భంగా సామాజిక మాధ్యమాల్లో కొన్ని ఫొటోలను పంచుకుందీ జంట. ఇంగ్లాండ్‌లోని ఓ పార్కుకు పిక్నిక్కు వెళ్లిన ఈ జోడీ.. తమ చిన్నారితో ఉన్న చిత్రాలను ఇన్‌స్టాలో పోస్టు చేశారు. ఇప్పటివరకు కూతురు ముఖాన్ని జనాలకు చూపని ఈ జోడీ మరోసారి వారికి నిరాశనే మిగిల్చింది. ఈ ఫొటోల్లోనూ వామిక పూర్తి ముఖాన్ని తెలియజేయలేదు. అయినా కూడా ఈ చిత్రాలు నెట్టింట వైరల్‌గా మారాయి.
ఓ చిత్రంలో అనుష్క పడుకొని తన ఛాతీపై వామికను పడుకోబెట్టుకుని ఆకాశం వైపు చూపిస్తుండగా.. మరో చిత్రంలో కోహ్లీ తన చిన్నారిని ముద్దు చేస్తున్నాడు. ఇప్పుడీ ఫొటోలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
ఇదీ చదవండి: రొనాల్డో ఇన్‌స్టా పోస్టుకు రూ.11 కోట్లు.. కోహ్లీకి ఎంత?