ETV Bharat / sports

'అగ్రస్థానానికి కోహ్లీనే కారణం.. ఇక టెస్టులే లక్ష్యం' - kohli is reason behind babar azam no 1

వన్డేల్లో తాను నంబర్ వన్ ర్యాంకు సాధించడానికి పరోక్షంగా విరాట్ కోహ్లీనే కారణమని తెలిపాడు పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్. కోహ్లీ ఇచ్చిన సలహా వల్లే ప్రస్తుత స్థానం చేరుకున్నట్లు పేర్కొన్నాడు. ఇక తన తర్వాతి లక్ష్యం టెస్టుల్లో అగ్రస్థానాన్ని సంపాదించడమే అని తెలిపాడు.

babar azam, virat kohli
బాబర్ అజామ్, విరాట్ కోహ్లీ
author img

By

Published : Apr 16, 2021, 8:43 AM IST

Updated : Apr 16, 2021, 11:38 AM IST

పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్​ ఇటీవల వన్డేల్లో అగ్రస్థానానికి చేరుకున్నాడు. మూడేళ్లుగా టాప్​లో ఉన్న టీమ్​ఇండియా సారథి విరాట్​ కోహ్లీని వెనక్కినెట్టి తొలి స్థానాన్ని దక్కించుకున్నాడు. అయితే బాబర్​ ​ మొదటి ర్యాంకుకు పరోక్షంగా కోహ్లీనే కారణమట! ఆ విషయాన్ని స్వయంగా పాక్​ కెప్టెన్ ఓ క్రీడా ఛానల్​తో​ వెల్లడించాడు.

ఇదీ చదవండి: టేబుల్​ టెన్నిస్​లో భారత కుర్రాడి సత్తా

"గతంలో నెట్స్​లో సాధన చేసేటప్పుడు సాధారణ మనస్తత్వంతో ఆడేవాడిని. కానీ, ఓ సారి విరాట్​తో మాట్లాడినప్పుడు.. మ్యాచ్​లో లాగే నెట్స్​లోనూ సీరియస్​గా దృష్టి సారించమని సలహా ఇచ్చాడు. నెట్స్​లో ఎలా అయితే షాట్ల ఎంపిక ఉంటుందో మ్యాచ్​లోనూ అలాగే ఉంటుంది. అప్పటి నుంచి కోహ్లీ చెప్పినట్లు చేస్తూ వచ్చాను. నెట్స్​లో ఎంత ప్రాక్టీస్ చేసినా సంతృప్తి ఉండట్లేదు. అంతలా సాధన చేస్తున్నా. " అని అజామ్​ పేర్కొన్నాడు.

ఇక టెస్టుల్లో..

"గతంలో టీ20ల్లో తొలి స్థానాన్ని సంపాదించాను. కానీ, టెస్టుల్లో నంబర్​ వన్​గా కొనసాగడమే అసలైన లక్ష్యం. అప్పుడే బ్యాట్స్​మన్​ నైపుణ్యాలు, కీర్తి తెలుస్తాయి. పాకిస్థాన్​ క్రికెట్​లో దిగ్గజాలైన జహీర్ అబ్బాస్, జావెద్ మియాందాద్, మహమ్మద్​ యూసుఫ్​ వంటి వారి సరసన నేను చేరడం గొప్పగా ఉంది."

-బాబర్ అజామ్, పాకిస్థాన్ కెప్టెన్.

వన్డేల్లో నంబర్ వన్​ బ్యాట్స్​మన్​ కావాలన్న తన కల నెరవేరిందని.. ఇక టెస్టుల్లోనూ అగ్రస్థానం సాధించడానికి ప్రయత్నిస్తానని చెప్పాడు బాబర్​. పరిమిత ఓవర్లలో మెరుగవడానికి చాలా కష్టపడ్డాడని పేర్కొన్నాడు. బాధలు, త్యాగాలు చేశానని వెల్లడించాడు. కొత్త కొత్త మెలకువలు నేర్చుకుని వాటిని అమలు చేసేవాడినని చెప్పాడు.

ఇదీ చదవండి: అక్షర్​ స్థానంలో దిల్లీ క్యాపిటల్స్​లోకి ములాని

Last Updated : Apr 16, 2021, 11:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.