ETV Bharat / sports

పాక్​ కెప్టెన్​ అరుదైన ఘనత.. రెండోసారి ఆ గౌరవం.. - బాబర్ అజామ్

Babar Azam: పాకిస్థాన్​ కెప్టెన్ బాబర్​ అజామ్ మరో ఘనత సాధించాడు. మార్చి నెలకు గానూ ఐసీసీ 'ప్లేయర్​ ఆఫ్ ది మంత్​'గా నిలిచాడు బాబర్. దీంతో ఈ గౌరవాన్ని రెండు సార్లు దక్కించుకున్న తొలి క్రికెటర్​గా గుర్తింపు సొంతం చేసుకున్నాడు.

icc player of the month
Babar Azam
author img

By

Published : Apr 11, 2022, 3:48 PM IST

Babar Azam: మార్చి నెలకు గానూ ఐసీసీ 'ప్లేయర్​ ఆఫ్ ది మంత్​'గా ఎంపికయ్యాడు పాకిస్థాన్ సారథి బాబర్ అజామ్. ఆస్ట్రేలియాపై భిన్న ఫార్మాట్ల సిరీస్​లో అద్భుత బ్యాటింగ్​ నైపుణ్యాలను ప్రదర్శించి ఈ గౌరవాన్ని పొందాడు బాబర్. మహిళా క్రికెటర్లలో ఆస్ట్రేలియా ఓపెనర్ రాచెల్ హేన్స్​ ఈ అవార్డును దక్కించుకుంది.

icc player of the month
బాబర్-రాచెల్ హేన్స్

ఆసీస్​పై జరిగిన మూడు మ్యాచ్​ల టెస్ట్ సిరీస్​లో 390 పరుగులు చేశాడు బాబర్. రెండో టెస్టులో తన రికార్డును తిరగరాస్తూ.. 196 పరుగులు చేశాడు. దీంతో ఆ టెస్టును డ్రాగా ముగించింది పాక్. ఈ క్రమంలోనే వెస్టిండీస్​కు చెందిన బ్రాత్​వైట్​, ఆస్ట్రేలియా ప్యాన్​ కమిన్స్​తో పోటీ పడి 'ప్లేయర్​ ఆఫ్ ది మంత్'​గా నిలిచాడు బాబర్​. 2021 ఏప్రిల్​లోనూ ఈ అవార్డు అందుకున్న బాబర్​.. రెండు సార్లు ఈ గౌరవాన్ని దక్కించుకున్న తొలి ప్లేయర్​గా ఘనత సాధించాడు.

ఇదీ చూడండి: సచిన్​​నే వెనక్కినెట్టిన పాక్​ క్రికెటర్​.. కోహ్లీ కంటే వెనకే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.