ETV Bharat / sports

'ఐపీఎల్ కంటే బిగ్‌బాష్ బెస్ట్'.. బాబ‌ర్ కామెంట్స్‌పై క్రికెట్ ఫ్యాన్స్ ఫైర్‌! - బాబర్​ అజామ్​ ఐపీఎల్​ 2023

పాకిస్థాన్​ క్రికెట్​ టీమ్​ కెప్టెన్​ బాబర్​ అజామ్​.. మరోసారి ట్రోల్స్ బారిన పడ్డాడు. ఐపీఎల్ కంటే బిగ్‌బాష్ లీగ్ బెట‌ర్ అంటూ బాబ‌ర్ చేసిన కామెంట్స్‌పై క్రికెట్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

babar
babar
author img

By

Published : Mar 17, 2023, 11:36 AM IST

మోస్ట్‌ స‌క్సెస్‌ఫుల్ క్రికెట్ లీగ్స్‌లో ఐపీఎల్ ఒక‌టి. వ‌ర‌ల్డ్‌లోనే రిచెస్ట్ లీగ్‌ల‌లో ఒక‌టిగా ఐపీఎల్ పేరు తెచ్చుకుంది. అయితే క్రికెట్​ అభిమానులు ఎంతగానో ఇష్టపడే ఐపీఎల్ ప‌ట్ల పాకిస్థాన్ క్రికెట‌ర్ల‌లో ఉన్న అసూయ, ద్వేషం మ‌రోసారి బ‌య‌ట‌ప‌డ్డాయి. ఇండియ‌న్ లీగ్‌పై పాకిస్థాన్ కెప్టెన్ బాబ‌ర్ అజామ్​ చేసిన కామెంట్స్‌పై క్రికెట్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

అయితే ఐపీఎల్‌కు పోటీగా ప‌లు దేశాలు క్రికెట్ లీగ్‌ల‌ను మొద‌లుపెట్టాయి. కానీ మ‌న లీగ్‌ స్థాయిలో ఆద‌ర‌ణ‌ను మాత్రం సొంతం చేసుకోలేక‌పోయాయి. అందులో పాకిస్థాన్ సూప‌ర్ లీగ్‌కు కూడా ఒక‌టి. ఐపీఎల్ కాపీ కొట్టి పీఎస్ఎల్‌ను మొద‌లుపెట్ట‌గా దారుణంగా విఫ‌ల‌మైంది. దీంతో ఐపీఎల్ స‌క్సెస్‌పై పాకిస్థాన్ క్రికెట‌ర్ల‌లో చాలా అసూయ ఉంది. అవ‌కాశం దొరికిన‌ప్పుడులా ఐపీఎల్‌పై త‌మ‌కున్న అక్క‌సును వెల్ల‌గ‌క్కుతూనే ఉన్నారు.

తాజాగా పాకిస్థాన్ కెప్టెన్ బాబ‌ర్ అజామ్​ ఐపీఎల్‌పై ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశాడు. పాకిస్థాన్ సూప‌ర్ లీగ్‌లో పెషావ‌ర్ జాల్మీ టీమ్‌కు ప్రాతినిథ్యం వ‌హిస్తున్నాడు బాబ‌ర్‌. ఈ లీగ్‌లో భాగంగా ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో బిగ్‌బాష్‌లీగ్‌, ఐపీఎల్​ల‌లో మీకు న‌చ్చిన‌ది ఏది అని అడిగిన ప్ర‌శ్న‌కు బిగ్‌బాష్ లీగ్ అంటూ స‌మాధానం ఇచ్చాడు బాబ‌ర్‌. "బిగ్‌బాష్ లీగ్ పిచ్ కండీష‌న్స్ బ్యాట్స్‌మెన్‌కు అనుకూలంగా ఉంటాయి. అదే ఆసియా పిచ్ కండీష‌న్స్ అన్ని ఒకేలా అనిపిస్తాయి. పెద్ద‌గా తేడాలు క‌నిపించ‌వు. అందుకే ఐపీఎల్ కంటే బిగ్‌బాష్ లీగ్ ఇంట్రెస్టింగ్​గా ఉంటుంది" అంటూ బాబ‌ర్ పేర్కొన్నాడు. దీంతో అత‌డి స‌మాధానంపై ఇండియ‌న్ క్రికెట్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఐపీఎల్ స‌క్సెస్‌ను ఓర్వ‌లేక బాబ‌ర్ ఇలా కామెంట్ చేశాడ‌ని పేర్కొంటున్నారు. ఐపీఎల్ వ‌స్తున్న ఆద‌ర‌ణ పాకిస్థాన్ క్రికెట‌ర్ల‌కు కంట‌గింపుగా మారింద‌ని మ‌రో నెటిజ‌న్ పేర్కొన్నాడు.

ఇకపోతే మార్చి 31 నుంచి ఐపీఎల్ 16వ సీజన్​ ప్రారంభం కానుంది. ఏప్రిల్​ 2న సన్​రైజర్స్​ తమ తొలి మ్యాచ్​ను ఆడనుంది. ఈ మ్యాచ్​లో రాజస్థాన్ రాయల్స్​తో తలపడనుంది. ఈ పోరు హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరగనుంది. ఆరెంజ్ ఆర్మీ సన్​రైజర్స్​ హైదరాబాద్ ఈ ఐపీఎల్​ సీజన్​లో​ కొత్త జెర్సీతో దర్శనమివ్వనుంది. ఈ ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్ కోసం సన్‌రైజర్స్ గురువారం(మార్చి 16) కొత్త జెర్సీని లాంఛ్​ చేసింది. ఈ విషయాన్ని ఆ ఫ్రాంఛైజీ తన అధికారిక సోషల్​మీడియా అకౌంట్​ ట్విటర్ వేదికగా వెల్లడించింది. ఈ కొత్త జెర్సీల్లో ఆ జట్టు ఆటగాళ్లు ఉమ్రాన్ మాలిక్, మయాంక్ అగర్వాల్, వాషింగ్టన్ సుందర్ కనిపించి ఆకట్టుకున్నారు. ఈ కొత్త జెర్సీల ఫొటోలను పోస్ట్​ చేసిన సన్​రైజర్స్​.. "ఇది ఆరెంజ్ ఫైర్​. త్వరలోనే సన్​రైజర్స్​ ఈ కొత్త జెర్సీలో ఆడే మ్యాచులను చూడటానికి టికెట్లను ఇప్పుడే త్వరగా కొనుగోలు చేయండి" అంటూ వ్యాఖ్య రాసుకొచ్చింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.