AUSW vs ENGW: మహిళల వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో ఆసీస్ అదరగొట్టింది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్.. ఎందుకు బౌలింగ్ ఎంచుకున్నామో అని బాధపడేలా విరుచుకుపడింది. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 356 పరుగులు చేసి.. ఇంగ్లాండ్ ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. సెమీఫైనల్లో సెంచరీ చేసిన ఓపెనర్ అలీసా హేలీ.. ఈ మ్యాచ్‌లో మరింత రెచ్చిపోయింది. కేవలం 138 బంతుల్లోనే 170 పరుగులు చేసి ఆఖర్లో వెనుదిరిగింది. ఇందులో ఏకంగా 26 ఫోర్లు ఉండటం విశేషం. మహిళల ప్రపంచకప్ ఫైనల్లో సెంచరీ చేసిన రెండో బ్యాటర్‌గా నిలిచింది హేలీ. అంతకుముందు 2005లో ఆసీస్‌కే చెందిన రోల్టన్ శతకం చేసింది.
-
Simply magnificent 🤩#CWC22 pic.twitter.com/gjQbZlCfii
— ICC Cricket World Cup (@cricketworldcup) April 3, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">Simply magnificent 🤩#CWC22 pic.twitter.com/gjQbZlCfii
— ICC Cricket World Cup (@cricketworldcup) April 3, 2022Simply magnificent 🤩#CWC22 pic.twitter.com/gjQbZlCfii
— ICC Cricket World Cup (@cricketworldcup) April 3, 2022
ప్రపంచ రికార్డు: ఓ ఐసీసీ వరల్డ్‌కప్ ఫైనల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా ప్రపంచ రికార్డు సృష్టించింది హేలీ. పురుషుల క్రికెట్లోనూ ఈ రికార్డు సాధ్యం కాలేదు. ఆసీస్ విధ్వంసకర ఓపెనర్, మాజీ ప్లేయర్ ఆడం గిల్‌క్రిస్ట్ 2007 పురుషుల క్రికెట్ వరల్కప్ ఫైనల్లో చేసిన 149 పరుగులే ఇప్పటివరకు అత్యుత్తమంగా ఉంది. ఇప్పుడు చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడిన హేలీ.. దాన్ని బ్రేక్ చేసింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
- 2003 వరల్డ్‌కప్ ఫైనల్లో పాంటింగ్(ఆసీస్) భారత్‌పై 140 పరుగులు చేశాడు.
- 1979 ఫైనల్లో వివ్ రిచర్డ్స్ ఇంగ్లాండ్‌పై 138 పరుగులు చేశాడు.
మహిళల వరల్డ్‌కప్ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో కూడా హేలీ అగ్రస్థానంలో నిలిచింది. ప్రస్తుత ప్రపంచకప్‌లో 9 ఇన్నింగ్స్‌ల్లో 56.56 సగటుతో 509 పరుగులు చేసింది. ఇందులో రెండు సెంచరీలు ఉన్నాయి.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
- తన భర్త, ఆసీస్ స్టార్‌పేసర్ మిచెల్ స్టార్క్ 2019 పురుషుల వన్డే వరల్డ్‌కప్‌లో 27 వికెట్లు తీశాడు. ఓ ఐసీసీ టోర్నీలో బౌలర్ తీసిన అత్యధిక వికెట్లు ఇవే.
- ఇప్పుడు హేలీ.. ఓ ఉమెన్స్ వరల్డ్‌కప్ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా చరిత్ర సృష్టించింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
మరో ఓపెనర్ రాచెల్ హేన్స్ (68) నెమ్మదిగా ఆడినా.. హేలీకి చక్కటి సహకారం అందించింది. కెప్టెన్ మెగ్ లానింగ్(10), గార్డ్నర్(1) వెంటవెంటనే పెవిలియన్ చేరారు. చివర్లో బెత్ మూనీ (62) దూకుడు పెంచగా.. ఆసీస్ 356 భారీ స్కోరు చేసింది. ఎలిస్ పెర్రీ (10 బంతుల్లో 17), మెక్‌గ్రాత్(5 బంతుల్లో 8) అజేయంగా నిలిచారు. ఇంగ్లాండ్ బౌలర్లలో ష్రబ్సోల్ 3 వికెట్లు తీసింది. సెమీఫైనల్లో సౌతాఫ్రికాపై 6 వికెట్లతో అదరగొట్టిన ఎజిల్స్టోన్.. ఈసారి ఒక్క వికెట్‌కే పరిమితమైంది. బ్రంట్, స్కివర్, కేట్ క్రాస్, డీన్ ధారాళంగా పరుగులు ఇచ్చారు.
ఇప్పటివరకు 11 మహిళల వన్డే వరల్డ్‌కప్‌లు జరగ్గా.. ఆసీస్ 6, ఇంగ్లాండ్ 4 సార్లు టైటిల్ విజేతలుగా నిలిచాయి. న్యూజిలాండ్ ఓసారి టోర్నీ గెలిచింది. 2017లో జరిగిన చివరి ప్రపంచకప్‌లో భారత్‌పై గెలిచి.. ఛాంపియన్‌గా అవతరించింది ఇంగ్లాండ్. ఈ రెండు జట్లూ వరల్డ్‌కప్ ఫైనల్లో చివరిసారిగా 1988లో తలపడ్డాయి. అప్పుడు ఇంగ్లాండ్‌పై 8 వికెట్ల తేడాతో గెలిచింది ఆసీస్. 34 ఏళ్ల తర్వాత మళ్లీ ఫైనల్లో ఈ రెండు జట్లు తలపడుతున్నాయి. ఈ మెగా టోర్నీలో ఆసీస్‌కు మెరుగైన రికార్డు ఉంది. మొత్తం ఏడు సార్లు ఫైనల్‌కు వెళ్లి.. ఆరు సార్లు టైటిల్ గెల్చుకుంది. ఒకే ఒక్కసారి న్యూజిలాండ్ చేతిలో(200లో) అదీ 4 పరుగుల తేడాతో ఓడింది. మరోవైపు.. ఇంగ్లాండ్ 4 సార్లు టైటిల్ గెల్చుకొని.. మరో 3 సార్లు ఫైనల్లో ఓటమిపాలైంది. ఆ మూడు సార్లూ ప్రత్యర్థి ఆసీస్ కావడం ఆ జట్టుకు కలవరపరుస్తోంది. ఫైనల్లో ఇంగ్లాండ్ ఒకే ఒక్కసారి ఆసీస్‌పై గెలిచింది. అదీ 1973లో జరిగిన మొట్టమొదటి ప్రపంచకప్‌లో.
ఇవీ చూడండి: చెన్నై ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఆ స్టార్ వచ్చేస్తున్నాడు!
ప్రపంచకప్ ఫైనల్లో ఆసీస్-ఇంగ్లాండ్ ఢీ.. ఆ జట్టుకు మోదీ విషెస్