Nathan Lyon Injury : లండన్‌లోని లార్డ్స్ వేదికగా యాషెస్ సిరీస్ ఎంతో ఉత్కంఠగా సాగుతోంది. ఇందులో భాగంగా జరిగిన రెండో టెస్టులో ఆసీస్ టాప్ స్పిన్నర్ నాథన్ లైయన్ తీవ్ర గాయంతో బాధపడుతూ కనిపించాడు. అయినప్పటికీ నొప్పిని భరిస్తూ జట్టు కోసం నిర్విరామంగా బ్యాటింగ్ చేసి అందరిని ఆకట్టుకున్నాడు. ఈ సందర్భంగా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా ఆటగాళ్లతో స్టేడియంలోని అభిమానులు.. లయన్‌కు స్టాండింగ్ ఒవేషన్ ఇస్తూ.. చప్పట్లతో ప్రశంసించారు. అయితే, ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సెన్ మాత్రం ఈ విషయంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.
ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో నాథన్ లైయన్ బ్యాటింగ్ రావడానికి గల ప్రధాన కారణం 'కంకషన్ సబ్‌స్టిట్యూట్'గా మరొకరిని తీసుకోవడానికే అన్నట్లుగా పీటర్సన్ వ్యాఖ్యానించాడు. దీంతో కెవిన్ వ్యాఖ్యలపై నాథన్ స్పందించాడు. ఈ సందర్భంగా ఆసీస్ బ్యాటర్ ఫిల్ హ్యూస్ ఉదంతాన్ని గుర్తు చేశాడు.
Nathan Lyon Ashes 2023 : "టెస్ట్ క్రికెట్ ఎప్పటి నుంచో ఉంది. గాయాలు కూడా ఆటలో ఓ భాగమే. నేను అలా బ్యాటింగ్‌కు రావడంపై కొన్ని కామెంట్లు విన్నాను. తలకు బంతిని తగలించుకోవడానికే క్రీజ్‌లోకి వెళ్లినట్లుగా కొన్ని వ్యాఖ్యలు వచ్చాయి. వాటిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకంటే ఇలా తలకు బంతి తగిలి నా సహచరుడిని (ఫిల్ హ్యూస్) కోల్పోయాను. ఈ సమయంలో అలాంటి సంభాషణ పేలవమైందిగా భావిస్తున్నాను. కంకషన్ కోసం ప్రయత్నించడమనేది చాలా రిస్క్‌తో కూడుకున్న పని. తలకు గాయమైతేనే అలాంటి అవకాశం మనకు వస్తుంది. దీని వల్ల ప్రాణాలకూ ముప్పు ఉంటుంది. అదృష్టవశాత్తూ నాకు అలాంటి గాయమైతే కాలేదు కాబట్టి నేను సంతోషంగానే ఉన్నాను" అని లైయన్ తెలిపాడు.
తన కెరీర్‌లో 26 టెస్టులు ఆడిన హ్యూస్న.. 2014లో సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన దేశవాళీ మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో సీన్ అబాట్ వేసిన బంతి తలకు తాకడం వల్ల మెదడులో రక్తస్రావం జరిగి ప్రాణాలను విడిచాడు. ఈ సమయంలో లైయన్ ఆ విషయాన్ని మరోసారి గుర్తుచేశాడు.
మరోవైపు తాజాగా యాషెస్ సిరీస్‌లో ఇంగ్లాండ్ జట్టు పేసర్ ఓలీ రాబిన్‌సన్‌ను టార్గెట్ చేసి ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ కామెంట్లు చేస్తున్న నేపథ్యంలోనే కెవిన్ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటాడని కొందరు క్రికెట్ విశ్లేషకుల అభిప్రాయం.
Eng Vs Aus Ashes 2023 : ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఐదో రోజు ఆటలో ఇంగ్లాండ్ విజయానికి 257 పరుగులు అవసరం. ఆసీస్ నిర్దేశించిన 371 పరుగుల టార్గెట్ ఛేదనకు దిగిన ఇంగ్లాండ్ ప్రస్తుతం 114/4 స్కోరుతో కొనసాగుతోంది. క్రీజ్‌లో బెన్ డకెట్ (50*), బెన్ స్టోక్స్ (29*) ఉన్నారు.
-
👏 @NathLyon421.#LoveLords | #Ashes pic.twitter.com/yx5l8w2Vu1
— Lord's Cricket Ground (@HomeOfCricket) July 1, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">👏 @NathLyon421.#LoveLords | #Ashes pic.twitter.com/yx5l8w2Vu1
— Lord's Cricket Ground (@HomeOfCricket) July 1, 2023👏 @NathLyon421.#LoveLords | #Ashes pic.twitter.com/yx5l8w2Vu1
— Lord's Cricket Ground (@HomeOfCricket) July 1, 2023