ETV Bharat / sports

Australia Vs South Africa : ఆసిస్​ జట్టు శుభారంభం.. కంకషన్ సబ్‌స్టిట్యూట్‌ దుమ్మురేపాడుగా..

Australia Vs South Africa : సౌతాఫ్రికాతో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్‌లో ఆస్ట్రేలియా జట్టు గెలుపొందింది. ప్రోటీస్‌తో జరిగిన తొలి వన్డేలో 3 వికెట్ల తేడాతో ఆసీస్‌ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఆసీస్‌ బౌలర్లలో హేజిల్​ వుడ్ మూడు వికెట్లు పడగొట్టగా..స్టోయినిస్‌ రెండు, అబాట్‌, అగర్‌, జంపా, గ్రీన్‌ తలో వికెట్​ను సాధించారు. ఈ మ్యూచ్​ గురించి మరిన్ని విశేషాలు మీ కోసం..

SA Vs Aus 1st ODI
SA Vs Aus 1st ODI
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 8, 2023, 9:24 AM IST

Australia Vs South Africa : దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్‌లో ఆస్ట్రేలియా జట్టు శుభారంభం చేసింది. బ్లూమ్‌ఫోంటైన్ వేదికగా ప్రోటీస్‌తో జరిగిన తొలి వన్డేలో 3 వికెట్ల తేడాతో ఆసీస్‌ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్​కు దిగిన దక్షిణాఫ్రికా.. 49 ఓవర్లలో 222 పరుగులు చేసి ఆలౌటైంది. ఇక సౌతాఫ్రికా బ్యాటర్లలో కెప్టెన్‌ టెంబా బావుమా 114 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. ఇక అతడితో పాటు మార్కో జానెసన్‌ క్రీజులో రాణించాడు. మరోవైపు ఆసీస్‌ బౌలర్లలో హేజిల్​ వుడ్ మూడు వికెట్లు పడగొట్టగా..స్టోయినిస్‌ రెండు, అబాట్‌, అగర్‌, జంపా, గ్రీన్‌ తలో వికెట్​ను సాధించారు.

223 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్‌ సేన.. 74 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. దీంతో ఆ జట్టు పరిస్థితి దారుణంగా మారింది. సరిగ్గా అదే సమయానికి క్రీజులోకి కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా దిగిన మార్నస్‌ లూబుషేన్‌.. మైదానంలో చెలరేగిపోయాడు. కీలక ఇన్నింగ్స్‌ ఆడి జట్టును విజయపథంలోకి నడిపించాడు.

  • Remarkable scenes for our Aussie men in Bloemfontein!

    After replacing Cam Green as a concussion substitute, Marnus Labuschagne linked up with No.9 Ashton Agar for a match-winning 113-run partnership 🙌 pic.twitter.com/a0BizS18Qu

    — Cricket Australia (@CricketAus) September 7, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

SA Vs Aus 1st ODI : అయితే తొలుత తుది జట్టులో లబుషేన్‌కు చోటు దక్కలేదు. కానీ కామెరూన్‌ గ్రీన్‌ తలకు గాయం కావడం వల్ల కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా ఆడే అవకాశాన్ని మార్నస్‌కు ఇచ్చారు. ఇక తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న లబుషేన్‌..93 బంతుల్లో 80 పరుగులు తీసి జట్టుకు అండగా నిలిచాడు. ఇక అతడికి తోడైనా అస్టన్‌ అగర్‌ 44 పరుగులు చేసి అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. కీలక ఇన్నింగ్స్​ ఆడి అదరగొట్టిన లబుషేన్‌ను 'మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' అవార్డు వరించింది.

మరోవైపు ప్రోటీస్‌ బౌలర్లలో రబాడ, గెరాల్డ్ కోయెట్జీ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. ఎంగిడి, జానెసన్‌, మహారాజ్‌ తలో వికెట్‌ సాధించారు. ఇరు జట్ల మధ్య రెండో వన్డే సెప్టెంబర్‌ 9న ఇదే వేదికగా జరగనుంది.

వరల్డ్​ కప్​ కోసం ఆసిస్​ సన్నాహాలు..
World Cup 2023 Australia Squad : 2023 ప్రపంచకప్​నకు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు 15 మందితో కూడిన జట్టును బుధవారం ఫైనలైజ్​ చేసింది. ఈ మెగాటోర్నీ కోసం ఆసిస్.. గతనెల 18 మందితో కూడిన జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ సంఖ్యను 15కు కుదించింది. తాజాగా ప్రకటించిన జట్టులో.. ఆల్​ రౌండర్ అరోన్ హర్డీ, పేస్ బౌలర్ నాథన్ ఎల్లీస్, యువ స్పిన్నర్ తన్వీర్​ ఈ ముగ్గురు ఆటగాళ్లకు ఆసిస్ మేనేజ్​మెంట్ ఉద్వాసన పలికింది.

దక్షిణాఫ్రికాలో టీమ్ఇండియా​ పర్యటన.. షెడ్యూల్‌ విడుదల చేసిన బీసీసీఐ

World Cup 2023 Australia Squad : వరల్డ్​కప్​నకు జట్టును ప్రకటించిన ఆసిస్ బోర్డు.. 15 మందితో టైటిల్​కు గురి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.