ఆస్ట్రేలియా క్రికెట్ ఆటగాళ్లకు వింత సంఘటన ఎదురైంది. మ్యాచ్ ఆడటానికి వెళ్లగా.. వారి క్రికెట్ కిట్‌ను కొందరు దొంగలు దొంగిలించారట!. వినడానికి కాస్త హాస్యాస్పదంగా ఉన్నా ఇది నిజమేనట. తమ బ్యాట్, బంతుల్ని కోల్పోయిన జట్టు కీపర్ ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
క్వీన్స్లాండ్ దక్షిణ ఆస్ట్రేలియాలోని ఓ రాష్ట్రం. ఈ స్టేట్‌కు చెందిన ఆటగాళ్లకు టస్మేనియా అనే మరో రాష్ట్ర ఆటగాళ్లకు మధ్య పోరు జరగాల్సి ఉంది. మ్యాచ్ నేపథ్యంలో ఆ ప్రాంతానికి చేరిన క్వీన్స్లాండ్ ఆటగాళ్లు తాము బసచేసే హోటల్ ముందు ఆట సామగ్రి ఉన్న వ్యాన్‌ను నిలిపి ఉంచారు. అంతలోనే కొందరు దొంగలు వ్యాన్ కిటికీలను పగులగొట్టి కొన్ని ఆట వస్తువులతో పరారయ్యారు. మ్యాచ్ ప్రారంభానికి కాస్త ముందు జరిగిన ఈ సంఘటన ఆటగాళ్లను కలవరపెట్టింది.
ఆటగాళ్ల ఫిర్యాదుతో.. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఆ దొంగలను పట్టుకునే పనిలో పడ్డారు పోలీసులు. గతవారం జరగాల్సిన మ్యాచ్ కరోనా కేసుల కారణంగా వాయిదా పడింది. ప్రస్తుతం కూడా అవాంతరాలు ఎదురవటం వల్ల క్రీడాకారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఇదీ చదవండి:అద్భుత విజయం: పంత్.. ధాటిగా ఆడలేకపోయాం: ధోనీ