ఆస్ట్రేలియా లెజండరీ క్రికెటర్, కామెంటేటర్ రికీ పాంటింగ్ అస్వస్థతకు గురయ్యాడు. క్రికెట్ కామెంటరీ చేస్తుండగా ఉన్నట్టుండి ఆయన అనారోగ్య బారిన పడ్డారు. దీంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. పాంటింగ్‌కు ఛాతిలో నొప్పి రావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. అయితే ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి స్పష్టమైన సమాచారం లేదు.
పెర్త్ వేదికగా ఆస్ట్రేలియా, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న టెస్టు మ్యాచ్ మూడో రోజు ఆటకు ఛానెల్ 7 తరఫున పాంటింగ్ కామెంటటేర్‌గా ఉన్నాడు. ఈ మ్యాచ్‌కు 40 నిమిషాల పాటు వ్యాఖ్యాతగా వ్యవహరించిన 47 ఏళ్ల పాంటింగ్.. లంచ్ విరామం సమయంలో కామెంట్రీ బాక్స్ నుంచి వేగంగా బయటకు వెళ్లారని ఆస్ట్రేలియా మీడియా కథనాలు వెల్లడించాయి. పాంటింగ్ వెంట ఆయన స్నేహితుడు, ఆస్ట్రేలియా మాజీ కోచ్ జస్టిన్ లాంగర్ కూడా ఉన్నారు. ఛాతిలో నొప్పితో అసౌకర్యంగా ఉండటంతో ముందుజాగ్రత్త చర్యగా ఆసుప్రతిలో చేరినట్లు సదరు కథనాలు పేర్కొన్నాయి.
1999 నుంచి 2007 వరకు ప్రపంచకప్‌లో వరుస విజయాలు సాధించిన ఆస్ట్రేలియా జట్టులో పాంటింగ్ భాగస్వామిగా ఉన్నాడు. 2006, 2009లో పాంటింగ్ నేతృత్వంలో ఆసీస్ వరుసగా రెండు సార్లు ఛాంపియన్ ట్రోఫీ సాధించింది. ప్రస్తుతం అతడు భారత టీ20 మెగా లీగ్‌లో దిల్లీ జట్టుకు హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు.
ఇదీ చూడండి: IPL: రిటైర్మెంట్ ప్రకటించిన బ్రావో.. ఇకపై బౌలింగ్ కోచ్‌గా