ETV Bharat / sports

పైన్ సెలక్షన్​ను వాళ్లు చూసుకుంటారు: బెయిలీ - టిమ్ పైన్ జార్జ్ బెయిలీ

ప్రతిష్ఠాత్మక యాషెస్‌ సిరీస్‌కు ఆస్ట్రేలియా మాజీ టెస్టు సారథి టిమ్‌ పైన్‌(Tim Paine News)ను తుది జట్టులోకి ఎంపిక చేసే విషయంలో ఓటింగ్‌ పద్ధతి అవలంభిస్తే.. తాను పక్కకు తప్పుకొంటానని ఆ జట్టు చీఫ్‌ సెలెక్టర్‌ జార్జ్‌ బెయిలీ తెలిపాడు. ఆ బాధ్యతలను మరో సెలెక్టర్‌ టోనీ డోడ్‌మెయిడ్‌, ప్రధాన కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌కు అప్పగిస్తానని వెల్లడించాడు.

Tim Paine latest news, Tim Paine  George Bailey,  టీమ్ పైన్ లేటెస్ట్ న్యూస్, టీమ్ పైన్ జార్జ్ బెయిలీ
పైన్
author img

By

Published : Nov 24, 2021, 5:31 AM IST

మరికొద్ది రోజుల్లో ప్రారంభమయ్యే ప్రతిష్ఠాత్మక యాషెస్‌ సిరీస్‌కు ఆస్ట్రేలియా మాజీ టెస్టు సారథి టిమ్‌ పైన్‌(Tim Paine News)ను తుది జట్టులోకి ఎంపిక చేసే విషయంలో ఓటింగ్‌ పద్ధతి అవలంభిస్తే.. తాను పక్కకు తప్పుకొంటానని ఆ జట్టు చీఫ్‌ సెలెక్టర్‌ జార్జ్‌ బెయిలీ తెలిపాడు. 2017లో తన సహచర ఉద్యోగికి పైన్‌ అసభ్యకరమైన సందేశాలు పంపిన నేపథ్యంలో ఇటీవల ఆ జట్టు కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. ఈ క్రమంలోనే యాషెస్‌ సిరీస్‌కు ఎంపిక చేసిన 15 మంది ఆటగాళ్ల జాబితాలో టిమ్‌ పైన్‌ పేరు కూడా ఉంది. అందులో ఇతడొక్కడే వికెట్‌ కీపర్‌ కావడం గమనార్హం. అయితే, డిసెంబర్‌ 8న ప్రారంభమయ్యే తొలి టెస్టుకు అతడిని ఇంకా కచ్చితంగా ఎంపిక చేయలేదని బెయిలీ ఓ కార్యక్రమంలో తెలిపాడు.

"ప్రతిష్ఠాత్మక యాషెస్‌ సిరీస్‌లో తొలి టెస్టుకు సంబంధించి తుది జట్టు(Ashes 2021 Australia Squad)ను ఎంపిక చేసే ప్రక్రియలో జట్టు యాజమాన్యం పైన్‌ను ఆడడానికి అనుమతించని పక్షంలో ఓటింగ్‌ పద్ధతి తీసుకొచ్చే అవకాశం ఉంది. అలాంటప్పుడు నేను పక్కకు తప్పుకొని ఆ బాధ్యతలను మరో సెలెక్టర్‌ టోనీ డోడ్‌మెయిడ్‌, ప్రధాన కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌కు అప్పగిస్తా. వాళ్లిద్దరూ ఆ పని చూసుకుంటారు" అని బెయిలీ చెప్పుకొచ్చాడు.

కాగా, బెయిలీ.. టిమ్‌ పైన్‌కు అత్యంత సన్నిహితుడు కావడమే కాకుండా ఒక వ్యాపారంలో భాగస్వామి కూడా. ఈ నేపథ్యంలోనే పైన్ ఎంపిక ప్రక్రియలో ఓటింగ్‌ పద్ధతి తీసుకొస్తే తాను తప్పుకొంటానని స్పష్టం చేశాడు. అలాగే, పైన్.. అసభ్య సందేశాల వివాదం నేపథ్యంలో తాను కెప్టెన్‌గా వైదొలిగినా ఆటగాడిగా యాషెస్‌ సిరీస్‌లో ఆడతానని ధీమాగా ఉన్నాడు. ఇటీవల ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.