ETV Bharat / sports

ఆఖరి మ్యాచ్​లో శ్రీలంక విజయం.. సిరీస్ కంగారూలదే​ - ఆస్ట్రేలియా శ్రీలంక సిరీస్

AUS vs SL T20: శ్రీలంకతో ఐదు టీ20ల సిరీస్​ను ఆస్ట్రేలియా సొంతం చేసుకుంది. వరుసగా నాలుగు మ్యాచుల్లో ఆసీస్​ గెలుపొందగా.. చివరి మ్యాచ్​లో విజయం సాధించింది పర్యటనను ముగించింది శ్రీలంక.

aus vs sl
ఆస్ట్రేలియా
author img

By

Published : Feb 20, 2022, 5:28 PM IST

AUS vs SL T20: సొంతగడ్డపై శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్​లో కంగారూలు పూర్తి ఆధిపత్యం చెలాయించారు. ఐదు టీ20 మ్యాచుల్లో వరుసగా నాలుగు మ్యాచుల్లో ఆసీస్​ జట్టు విజయం సాధించింది. మరోవైపు వరుస పరాజయాలను మూటగట్టుకున్న శ్రీలంక ఆఖరి మ్యాచ్​లో గెలుపొంది వైట్​వాష్​ నుంచి తప్పించుకుంది. రెండో టీ20 మినహా సిరీస్​ మొత్తంలో దసున్​ శనకా సేన కంగారూలకు గట్టి పోటీ ఇవ్వలేకపోయింది. ఆస్ట్రేలియా ఆటగాడు గ్లెన్​మాక్స్​వెల్​ 'ప్లేయర్​ ఆఫ్​ ది సిరీస్​' అవార్డును అందుకున్నాడు.

సిడ్నీ వేదికగా ఈనెల 11న జరిగిన తొలి మ్యాచ్​లో టాస్​ గెలిచి బౌలింగ్​ ఎంచుకున్న శ్రీలంక 20 ఓవర్లు ముగిసే నాటికి కంగారూలను 149 పరుగులకు కట్టడి చేసింది. డీఎల్​ఎస్​ పద్ధతి ప్రకారం 19 ఓవర్లలో శ్రీలంక చేయాల్సినవి 143 పరుగులు కాగా 122 పరుగులకే ఆసీస్​ వారికి కట్టడి చేసి తొలి మ్యాచ్​ బోణి కొట్టేసింది. ఆ తర్వాత 13న జరిగిన రెండో టీ20 ఉత్కంఠభరితంగా సాగింది. శ్రీలంక చేసిన స్కోరును ఆసీస్​ సమం చేసింది. ఈ క్రమంలో నిర్వహించిన సూపర్​ ఓవర్​లో ఆస్ట్రేలియా పుంజుకుని విజయం సాధించింది.

సిరీస్​ గెలవాలన్న కసితో ఉన్న ఆస్ట్రేలియా మూడో టీ20లో శ్రీలంకను చిత్తు చేసింది. దసున్​ సేన నిర్దేశించిన 121 లక్ష్యాన్ని కేవలం 16.5 ఓవర్లలో ఛేదించి సిరీస్​ కైవసం చేసుకుంది. నాలుగో టీ20లో కూడా ఇదే పరిస్థితి. ఆసీస్​కు శ్రీలంక ఏ మాత్రం పోటీని ఇవ్వలేపోయింది. 139 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 18.1 ఓవర్లలో ఛేదించింది. అయితే ఆఖరి మ్యాచ్​లోనైనా గెలవాలనే పట్టుదలతో ఉన్న శ్రీలంక కంగారులు నిర్దేశించిన 155 పరుగుల లక్ష్యాన్ని ఐదు వికెట్లు మిగిలి ఉండగా ఛేదించింది. కుశాల్​ మెండీస్ (69*), దాసున్​ శనకా (35) రాణించారు. ఈ గెలుపుతో వైట్​వాష్​ నుంచి తప్పించుకుంది లంక జట్టు.

ఈ సిరీస్​లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు మ్యాక్స్​వెల్​, మెక్​డెర్మొట్​, జాష్​ ఇంగ్లిస్​ నిలకడగా రాణించారు.

ఇదీ చూడండి: Rahane Pujara: దేశవాళీలో అదరగొడితేనే మళ్లీ టీమ్​ఇండియాలోకి​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.