AUS Vs PAK Test Series Results : పాకిస్థాన్‌ను వైట్‌వాష్ చేసింది ఆస్ట్రేలియా. మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేసింది. సిడ్నీ వేదికగా జరిగిన చివరి టెస్టులో 8 వికెట్ల తేడాతో ఆసీస్ ఘన విజయం సాధించింది. తన కెరీర్‌లో చివరి టెస్ట్ మ్యాచ్ ఆడిన ఆసీస్ ప్లేయర్ డేవిడ్ వార్నర్ హాఫ్ (57) సెంచరీతో రాణించాడు. రెండో ఇన్నింగ్స్‌లో 130 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన కంగారూ జట్టు కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి టార్గెట్‌ను ఛేదించింది. లబుషేన్ (62) పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. అంతకుముందు 68/7 ఓవర్ నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆట ప్రారంభించింది పాకిస్థాన్. కానీ 115 పరుగులకే కుప్పకూలింది. కంగారూ బౌలర్లలో హేజిల్‌వుడ్ (4), లయోన్ (3), స్టార్క్ (1), కమిన్స్ (1), హెడ్ (1) వికెట్లు తీశారు. ఫలితంగా తొలి ఇన్నింగ్స్‌లో వచ్చిన 14 పరుగుల ఆధిక్యం కలుపుకుని ఆసీస్‌కు 130 లక్ష్యాన్ని నిర్దేశించింది పాక్.
-
A 3-0 series win for @CricketAus 👏#AUSvPAK pic.twitter.com/tPKLkQpUsm
— Sydney Cricket Ground (@scg) January 6, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
">A 3-0 series win for @CricketAus 👏#AUSvPAK pic.twitter.com/tPKLkQpUsm
— Sydney Cricket Ground (@scg) January 6, 2024A 3-0 series win for @CricketAus 👏#AUSvPAK pic.twitter.com/tPKLkQpUsm
— Sydney Cricket Ground (@scg) January 6, 2024
మూడో టెస్ట్ సాగిందిలా
- పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్ : 313-10 (77.1 ఓవర్లు)
- ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ : 299-10 (109.4 ఓవర్లు)
- పాకిస్థాన్ రెండో ఇన్నింగ్స్ : 115-10 (43.1 ఓవర్లు)
- ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ : 130-2 (25.5 ఓవర్లు)
టెస్టులకు డేవిడ్ వార్నర్ వీడ్కోలు
David Warner Last Test Match : తన కెరీర్‌లో చివరి టెస్ట్ ఆడిన డేవిడ్ వార్నర్‌కు నాలుగవ రోజు వార్నర్ ఔటైన తర్వాత ప్లేయర్లు, ప్రేక్షకులు ఘనంగా వీడ్కోలు పలికారు. అనంతరం తన హెల్మెట్‌ను, గ్లౌవ్స్‌ను ఓ చిన్నారి అభిమానికి గిఫ్ట్‌గా ఇచ్చాడు వార్నర్. మైదానంలో ఉన్న తన కూతుళ్లకు హత్తుకున్నాడు భాగోద్వేగానికి గురయ్యాడు. కన్నీళ్లను తుడుచుకుంటూ అభిమానులకు అభివాదం చేశాడు.
-
A 3-0 series win for @CricketAus 👏#AUSvPAK pic.twitter.com/tPKLkQpUsm
— Sydney Cricket Ground (@scg) January 6, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
">A 3-0 series win for @CricketAus 👏#AUSvPAK pic.twitter.com/tPKLkQpUsm
— Sydney Cricket Ground (@scg) January 6, 2024A 3-0 series win for @CricketAus 👏#AUSvPAK pic.twitter.com/tPKLkQpUsm
— Sydney Cricket Ground (@scg) January 6, 2024
ఐదో బ్యాటర్‌గా వార్నర్
టెస్టు కెరీర్‌లో అత్యధిక పరుగులు చేసిన ఐదో ఆస్ట్రేలియా బ్యాటర్‌గా వార్నర్ నిలిచాడు. 2011 డిసెంబర్లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌తో టెస్టుల్లోకి అరంగేట్రం చేసిన డేవిడ్ వార్నర్ ఇప్పటివరకు 112 మ్యాచ్‌లు ఆడాడు. దాదాపు 13 ఏళ్ల టెస్ట్ కెరీర్‌లో 205 ఇన్నింగ్స్‌ల్లో 44.59 సగటు, 70.19 స్ట్రైక్ రేట్‌తో 8,786 పరుగులు చేశాడు. ఇందులో 26 సెంచరీలు, 37 అర్ధ సెంచరీలు ఉన్నాయి. పాకిస్థాన్‌పై 335* అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేశాడు వార్నర్.