ETV Bharat / sports

టీమ్​ ఇండియా ప్లేయర్​కు ఆ నటి ప్రేమ సందేశం - అతియా శెట్టి ఫాదర్

Kl rahul Athiya Shetty : మొహాలీ వేదికగా జరిగిన భారత్-ఆసీస్ మ్యాచ్​లో టీమ్ ఇండియా ప్రయత్నం ఫలించలేదు. మంచి ప్రదర్శనే చేసినా.. కొన్ని తప్పిదాల వల్ల విజయం సాధించలేదు. అయితే ఈ మ్యాచ్​తో టీమ్​ ఇండియాకు కలిసి రాకపోయినా.. ఓ ప్లేయర్​కు మాత్రం కలిసొచ్చింది. అతడిపై ప్రేమజల్లు కురిపించింది ఆ నటి. ఆ కథేమిటో మీరే చూడండి..

Athiya Shetty love emoji for KL Rahul
Athiya Shetty love emoji for KL Rahul half century post goes viral
author img

By

Published : Sep 21, 2022, 10:32 AM IST

Kl rahul Athiya Shetty : వరల్డ్ కప్​ ముందు మూడు మ్యాచ్​ల సిరీస్​లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య మొదటి టీ20 మ్యాచ్ మంగళవారం జరిగింది. భారత్​ మొదట్లో తడబడినా.. ఆఖరి ఓవర్లలో విరుచుకుపడింది. ఆసీస్​కు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. చివరకు సొంత తప్పిదాలతో అనూహ్యంగా ఓటమిపాలైంది. అయితే ఈ మ్యాచ్​ టీమ్​ ఇండియాకు కలిసి రాకున్నా.. ఒకరికి మాత్రం బాగా కలిసొచ్చింది. తన ప్రేయని మదినే కాదు.. ఆ ప్రదర్శన క్రికెట్​ అభిమానుల మనస్సునూ గెలిచింది. ఇంతకీ ఆటగాడు ఎవరంటారా? అతడే.. టీమ్ ఇండియా ఓపెనర్.. కేఎల్​ రాహుల్​. అతడు ఈ మ్యాచ్​లో చేసిన ప్రదర్శనకు తన ప్రేయసి ఫిదా అయింది. అంతటితో ఆగకుండా అతడ్ని లవ్​ ఎమోజీతో అభినందించింది.

Athiya Shetty love emoji for KL Rahul half century post goes viral
అతియా శెట్టి పెట్టిన స్టోరీ

మొహాలి వేదికగా జరిగిన భారత్​-ఆసీస్ మొదటి మ్యాచ్​లో ఓపెనింగ్ బ్యాటర్​గా దిగాడు కేఎల్​ రాహుల్​. 35 బంతుల్లో 55 పరుగులు చేసి జట్టుకు మంచి ప్రారంభాన్ని అందించాడు. అందులో నాలుగు పోర్లు, మూడు అద్భుతమైన సిక్స్​లు కొట్టాడు. కేఎల్​ రాహుల్ హాఫ్​ సెంచరీపై తన ప్రేయసి అతియా శెట్టి స్పందించింది. రాహుల్​ హాఫ్ సెంచరీ చేసిన తర్వాత బ్యాట్​ పైకెత్తిన ఫొటోని తన ఇన్​స్టాగ్రామ్​ స్టోరీలో పెట్టుకుంది. దానికి ఒక లవ్​ ఎమోజీని జత చేసి తన ప్రేమను తెలియజేసింది. ఈ ఫొటో​ నెట్టింట్లో వైరల్​గా మారింది. అతియా ప్రముఖ బాలీవుడ్ నటుడు సునిల్ శెట్టి కుమార్తె. అయితే చాలా కాలంగా అతియా.. రాహుల్​తో డేటింగ్​లో ఉంది. అతడితో పాటు అతియా పలు మార్లు క్రికెట్​ టూర్లలో కూడా సందడి చేసింది.

ప్రేయసి ప్రేమను అందుకోవడమే కాకుండా రాహుల్ మరో ఘనతను కూడా సాధించాడు. టీ20ల్లో అత్యంత వేగంగా 2000 పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. మంగళవారం మొహాలీ వేదికగా జరిగిన మ్యాచ్​లో 55 పరుగులతో 2000 పరుగుల మార్క్​ను అధిగమించాడు. 2018 నుంచి ఇప్పటి వరకు 58 ఇన్నింగ్స్ ఆడాడు రాహుల్​. అందులో 40 సగటు, 141 స్ట్రైక్​ రేట్​తో 18 హాఫ్​ సెంచరీలు చేశాడు. ఈ ఘనత సాధించిన వారిలో మొదటి స్థానంలో టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్​​ విరాట్​ కోహ్లీ నిలిచాడు. ఆ తర్వాతి స్థానంలో పాకిస్థాన్ ఆటగాడు బాబర్ ఆజామ్ ఉన్నాడు. కోహ్లీ 52 ఇన్నింగ్స్​ల్లో, బాబర్ 56 ఇన్నింగ్స్​ల్లో ఈ రన్ మార్క్​ను అధిగమించారు.

ఇవీ చదవండి: ఈ చిన్నారి ఇప్పుడు హీరోయిన్​.. కీర్తిసురేశ్​కు బెస్ట్​ ఫ్రెండ్​.. ఎవరో తెలుసా?

రామ్​చరణ్​-ఉపాసన ఫేవరెట్ యాక్టర్స్​ ఎవరో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.