ETV Bharat / sports

టీకా వేసుకుంటేనే టీమ్​ఇండియా మ్యాచ్​లకు ఎంట్రీ

న్యూజిలాండ్​తో టీ20 సిరీస్​కు(IND vs NZ t20 series) సన్నద్ధమవుతోంది టీమ్​ఇండియా. తొలి మ్యాచ్​ జైపుర్​ వేదికగా జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ కీలక ప్రకటన చేసింది. కొవిడ్ టీకా తీసుకున్నవారినే మైదానంలోకి అనుమతించనున్నట్లు పేర్కొంది.

india fans
భారత జట్టు అభిమానులు
author img

By

Published : Nov 10, 2021, 8:29 PM IST

టీమ్​ఇండియా(IND vs NZ T20 series).. న్యూజిలాండ్​తో టీ20 సిరీస్​కు సిద్ధమవుతోంది. ఈ మేరకు జట్టును ఇటీవలే ప్రకటించింది బీసీసీఐ. అయితే.. నవంబర్ 17న జైపుర్ వేదికగా(India vs NZ Jaipur match) తొలి టీ20 మ్యాచ్​ జరగనున్న నేపథ్యంలో రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ కీలక ప్రకటన చేసింది. కనీసం కొవిడ్ టీకా తొలి డోసు తీసుకున్నవారినే మైదానంలోకి అనుమతించనున్నట్లు పేర్కొంది.

ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో సమావేశమై కీలక నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర క్రికెట్ నిర్వహణ కమిటీ తెలిపింది. దాదాపు 8 ఏళ్ల తర్వాత జైపుర్ మైదానంలో అంతర్జాతీయ మ్యాచ్ జరుగుతున్నట్లు పేర్కొంది. టిక్కెట్టు ధర రూ. 1000 నుంచి రూ. 15,000 వరకు ఉంటుందని స్పష్టం చేసింది.

"మైదానంలోకి అభిమానులను అనుమతించే విషయంపై రాష్ట్ర హోంశాఖతో చర్చించాం. రాష్ట్ర ప్రభుత్వం విధించిన కొవిడ్​ నిబంధనల దృష్ట్యా.. కనీసం ఒక్కడోసు టీకా తీసుకున్నవారినే మైదానంలోకి అనుమతించనున్నాం. మాస్కులు, శానిటేషన్, థర్మల్​ స్క్రీనింగ్ తప్పనిసరి చేశాం" అని రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ మహేంద్ర శర్మ తెలిపారు.

భారత్, కివీస్​ మధ్య టీ20 సిరీస్ నవంబర్ 17-21 మధ్య జరగనుంది. తొలి మ్యాచ్ జైపూర్(నవంబర్ 17), రెండో మ్యాచ్ రాంచీ(నవంబర్ 19), మూడో మ్యాచ్ కోల్​కతా(నవంబర్ 21) వేదికగా జరగనున్నాయి. అనంతరం భారత్​తో టెస్టు మ్యాచ్​లు ఆడనుంది కివీస్. నవంబర్ 25-29 మధ్య కాన్పుర్​లో తొలి టెస్టు, డిసెంబర్ 3-7 మధ్య ముంబయి వేదికగా రెండో టెస్టు జరగనుంది.

ఇదీ చదవండి:

IND vs NZ series: 'టీమ్​ఇండియా జెర్సీ ధరించాలనే కల నెరవేరింది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.