ETV Bharat / sports

ఈ ప్లేయర్లకు మళ్లీ నిరాశే.. ఐపీఎల్​లో అదరగొట్టినా.. టీమ్​ఇండియాలో దక్కని ప్లేస్!

author img

By

Published : Jul 17, 2023, 8:37 PM IST

Asian Games 2023 Cricket : సెప్టెంబరులో ప్రారంభమయ్యే ఆసియా క్రీడలకు భారత క్రికెట్ జట్టును బీసీసీఐ ఇటీవలె ప్రకటించింది. అయితే ఐపీఎల్​లో ఫర్వాలేదనిపించే ప్రదర్శన చేసినప్పటికీ.. ఆసియా క్రీడలకు ఎంపిక కాని ప్లేయర్లు ఎవరో చూద్దాం.

Asian Games 2023 Cricket
టీమ్ఇండియాకు ఎంపికవ్వని ప్లేయర్లు

Asian Games 2023 Cricket : సెప్టెంబరు 23 నుంచి అక్టోబరు 8 వరకు చైనాలోని హాంగ్జౌలో జరిగే ఆసియా క్రీడల కోసం భారత పురుషుల క్రికెట్​ జట్టును ఇటీవల ప్రకటించింది బీసీసీఐ. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున అదరగొట్టిన యువ ఆటగాడు రుతురాజ్‌ గైక్వాడ్‌ను భారత కెప్టెన్‌గా ఎంపిక చేసింది. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తరఫున అదరగొట్టిన రింకూ సింగ్‌ తొలిసారి భారత జట్టుకు ఎంపికయ్యాడు. ఈసారి జితేశ్‌ శర్మ, షాబాజ్ అహ్మద్​, శివమ్ మావి లాంటి యువ ఆటగాళ్లకు అవకాశం దక్కింది. అయితే 2023 ఐపీఎల్ సీజన్​లో రాణించిన మరి కొందరు యువఆటగాళ్లకు బీసీసీఐ మొండి చేయి చూపింది. మరి అవకాశం దక్కని వారేవరో చూసేద్దాం.

వరుణ్ చక్రవర్తి..
ఐపీఎల్​లో కోల్​కతా టీమ్​ తరఫున ఆడాడు ఈ యువ ప్లేయర్​. 2023 ఐపీఎల్ సీజన్​లో వరుణ్ బాగానే రాణించాడు. గతంలో కూడా టీమ్ఇండియాకు ఆడిన కారణంగా ఈ సారి జట్టులో వరుణ్​కు చోటు పక్కా అని అనుకున్నారు. కానీ అనుహ్యంగా ఆసియా క్రీడలకు బీసీసీఐ సెలక్ట్ చేసిన జాబితాలో వరుణ్ పేరు లేదు.

రియాన్ పరాగ్​..
ఈ యువ ఆటగాడు ఎప్పటినుంచో టీమ్ఇండియా పిలుపుకోసం ఎదురుచూస్తున్నాడు. 2019లో ఐపీఎల్​లో అరంగేట్రం చేసినప్పటి నుంచి రాజస్థాన్ రాయల్స్ జట్టులో ఆడాడు. ఈ సీజన్​లో పరాగ్ బ్యాటింగ్​తో అంతలా ఆకట్టుకోలేకపోయాడు. అయితే ఇండియా-A తరఫున పరాగ్​కు ఫర్వాలేదనిపిస్తున్నాడు. అసోం తరఫున రంజీ మ్యాచుల్లో కూడా అదరగొడుతున్నా.. సెలెక్టర్లు రియాన్​ వైపు మొగ్గు చూపలేదు.

హర్షిత్ రానా..
2023 ఐపీఎల్ సీజన్​లో ఆకట్టుకున్న మరో యువ ఆటగాడు, కోల్​కతా ప్లేయర్ హర్షిత్ రానా. ఈ యువ ఆల్​రౌండర్​​.. జట్టులో స్థానం ఆశించాడు. కానీ హర్షిత్ రానాకు కూడా.. ఆసియా క్రీడలకు ఎంపిక చేసిన జట్టులో ప్లేస్​ దక్కలేదు. ప్రస్తుతం ఇండియా-A జట్టు తరఫున హర్షిత్ రానా అదరగొడుతున్నాడు.

ఆసియా క్రీడలకు ఎంపికైన భారత జట్టు:
Asian Games 2023 Team India Squad : రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, రాహుల్ త్రిపాఠి, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేశ్ శర్మ (వికెట్‌ కీపర్‌), వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్, శివమ్ మావి, శివమ్ దూబే, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్‌).

స్టాండ్‌బై ఆటగాళ్లు: యశ్ ఠాకూర్, సాయి కిషోర్, వెంకటేష్ అయ్యర్, దీపక్ హుడా, సాయి సుదర్శన్.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.