Asian Batters Highest Individual Scores In WC : భారత్‌లో క్రికెట్‌కు ఉండే క్రేజ్ వేరు. ద్వైపాక్షిక సిరీస్‌ల నుంచి ప్రపంచకప్ దాకా అన్ని మ్యాచ్‌లను మిస్ అవ్వకుండా ఫాలో అయిపోతుంటారు క్రికెట్ ఫ్యాన్స్. మరో ఏడు వారాల్లో ప్రారంభమయ్యే ప్రపంచకప్ కోసం యావత్ క్రీడాలోకం ఎదురుచూస్తోంది. అయితే ఆస్ట్రేలియా, వెస్టిండీస్, ఇంగ్లాండ్ జట్లతో పాటు.. ఆసియా ఖండపు దేశాలు భారత్, పాకిస్థాన్, శ్రీలంక కూడా విశ్వవిజేతలుగా నిలిచాయి. ఆయితే ఈ మెగా టోర్నీలో ఆసియా ఖండపు దేశాల బ్యాటర్లు సాధించిన టాప్-5 అత్యధిక వ్యక్తిగత స్కోర్లపై ఓ లుక్కేద్దాం..
Sourav Ganguly Highest World Cup Score : బంగాల్ టైగర్‌గా పిలిచే సౌరవ్ గంగూలీ.. వన్డే వరల్డ్ కప్ టోర్నీలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించాడు. 1999 ప్రపంచకప్‌లో శ్రీలంకతో జరిగిన గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. ఆ మ్యాచ్‌లో 158 బంతులు ఎదుర్కొన్న గంగూలీ.. 17 ఫోర్లు, 7 సిక్సులు సహా 183 పరుగులు చేశాడు. అప్పటికి ఈ ఇన్నింగ్సే.. ప్రపంచకప్‌లో ఓ భారత ఆటగాడు సాధించిన అత్యధిక వ్యక్తిగత స్కోర్. ఇదే మ్యాచ్‌లో రాహుల్ ద్రవిడ్ సైతం 145 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా 157 పరుగులతో ఘన విజయం సాధించింది.
Kapil Dev Highest World Cup Score : ఇండియన్ లెజెండరీ ఆల్‌రౌండర్ కపిల్ దేవ్.. ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. భారత్ సాధించిన తొలి వరల్డ్‌కప్‌లోనే కపిల్ ఈ ఘనత సాధించాడు. 1983 టోర్నీలో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో.. భారత్ 17/5 తో పీకల్లోతు కష్టాల్లో ఉండగా కపిల్ జట్టును ఆదుకున్నాడు. 175 పరుగుల భారీ ఇన్సింగ్స్‌తో జట్టుకు పోరాడగలిగే (266 పరుగులు) స్కోర్ అందించాడు. ఈ మ్యాచ్‌లో 16 ఫోర్లు, 6 సిక్సులు బాది జింబాబ్వే బౌలర్ల భరతం పట్టాడు. ఇక ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా 31 రన్స్ తేడాతో విజయం సాధించింది.
Sehwag Highest World Cup Score : టీమ్ఇండియా డేరింగ్ అండ్ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్.. ప్రపంచకప్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన లిస్ట్‌లో మూడో స్థానంలో ఉన్నాడు. 2011 టోర్నమెంట్ తొలి మ్యాచ్‌లోనే బంగ్లాదేశ్‌పై 175 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో 14 ఫోర్లు, 5 సిక్సులు బాదాడు. ఈ మ్యాచ్‌లో కింగ్ కోహ్లీ కూడా శతకంతో బంగ్లా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఫలితంగా ఈ మ్యాచ్‌లో భారత్.. 87 పరుగులతో గెలిచి టోర్నీలో బోణీ కొట్టింది.
Tillakaratne Dilshan Highest World Cup Score : శ్రీలంక స్టార్ ప్లేయర్ దిల్షాన్ ఈ జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు. అతడు 2015 వరల్డ్‌కప్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 146 బంతుల్లో 161 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఆ ఇన్సింగ్స్ లో మొత్తం 22 బౌండరీలు బాదాడు.
Imran Nazir Highest World Cup Score : పాకిస్థాన్‌కు చెందిన ఇమ్రాన్ నజీర్ 2007 వరల్డ్‌కప్ టోర్నీలో జింబాబ్వేపై 121 బంతుల్లోనే 160 పరుగులు బాదాడు. ఇమ్రాన్ ఇన్సింగ్స్‌తో భారీ స్కోరు సాధించిన పాకిస్థాన్ అలవోకగా మ్యాచ్‌లో గెలుపొందింది.