Asia Games 2023 : ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఆసియా క్రీడలు త్వరలో జరగనున్నాయి. చైనా వేదికగా జరగనున్న ఈ గ్రాండ్ ఈవెంట్ కోసం సన్నాహాలు అప్పుడే మొదలయ్యాయి. ఈ క్రమంలో ఇప్పటికే వివిధ దేశాలకు చెందిన క్రికెట్ బోర్డ్‌లు.. ఆసియా క్రీడలకు ఆడనున్న తమ జట్లను ప్రకటించగా.. పాకిస్థాన్ బోర్డు కూడా తాజాగా 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ప్రకటించింది. తమ జట్టుకు అన్‌క్యాప్డ్ ఆల్‌రౌండర్ ఖాసిం అక్రమ్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసినట్లు వెల్లడించింది.
ఖాసిం అక్రమ్‌తో పాటు మీర్జా తాహిర్ బేగ్, అరాఫత్ మిన్హాస్, రోహైల్ నజీర్, సుఫియాన్ ముఖీమ్, ముహమ్మద్ అఖ్లాక్‌ల ఓమైర్ బిన్ యూసుఫ్, తొలిసారి పాకిస్థాన్ జట్టులో చోటు దక్కింది. అదే విధంగా ఈ జట్టులో ఆసిఫ్ అలీ, హైదర్ అలీ, షానవాజ్ దహానీ,మహ్మద్ హస్నైన్, ఉస్మాన్ ఖాదిర్ వంటి సీనియర్ ఆటగాళ్లు ఉండగా.. అయితే అందరి దృష్టి మాత్రం ఈ యంగ్ ప్లేయర్ ఖాసిం అక్రమ్‌పై పడింది. ఇంతకీ అతను ఎవరంటే?
ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో సెంట్రల్ పంజాబ్ జట్టు తరఫున అక్రమ్ ఆడుతున్న ఈ 20 ఏళ్ల అక్రమ్‌కు దేశీవాళీ క్రికెట్‌లో అద్భుతమైన రికార్డు ఉంది. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో ఇప్పటివరకు ఆడిన 20 మ్యాచుల్లో 27 వికెట్లతో పాటు 960 పరుగులను అక్రమ్ తన ఖాతాలోకి వేసుకున్నాడు. మరోవైపు లిస్ట్-ఏ క్రికెట్‌లో 45 మ్యాచ్‌లు ఆడిన ఈ ఆల్‌రౌండర్.. 35.27 సగటుతో 1305 పరుగులు సాధించాడు. అక్రమ్‌కు అద్భుతమైన కెప్టెన్సీ స్కిల్స్ కూడా ఉన్నాయి.
-
🚨 Qasim Akram to lead Pakistan Shaheens in the 19th Asian Games, set to take place in Hangzhou, China 🏏
— Pakistan Cricket (@TheRealPCB) August 24, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Read more ➡️ https://t.co/dEgBl54Xvx pic.twitter.com/iqYnYm2m7G
">🚨 Qasim Akram to lead Pakistan Shaheens in the 19th Asian Games, set to take place in Hangzhou, China 🏏
— Pakistan Cricket (@TheRealPCB) August 24, 2023
Read more ➡️ https://t.co/dEgBl54Xvx pic.twitter.com/iqYnYm2m7G🚨 Qasim Akram to lead Pakistan Shaheens in the 19th Asian Games, set to take place in Hangzhou, China 🏏
— Pakistan Cricket (@TheRealPCB) August 24, 2023
Read more ➡️ https://t.co/dEgBl54Xvx pic.twitter.com/iqYnYm2m7G
Pakistan Cricketer Qasim Akram Stats : అండర్-19 ప్రపంచకప్-2021-2022లో పాక్ జట్టు కెప్టెన్‌గా కూడా కీలక బాధ్యతలు చేపట్టిన అక్రమ్.. కెప్టెన్‌గానే కాకుండా వ్యక్తిగత ప్రదర్శనతో అభిమానులను ఆకట్టుకున్నాడు. అంతే కాకుండా ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ 2023 విజేతగా పాక్ నిలవడంలోనూ అక్రమ్ కీలక పాత్ర పోషించాడు. ఇటీవలే శ్రీలంక, ఆస్ట్రేలియా పర్యటనలో పాకిస్థాన్-ఏ జట్టు తరఫున ఆడిన అక్రమ్.. మైదానంలో తనదైన శైలిలో రాణించి చరిత్రకెక్కాడు. ఈ నేపథ్యంలోనే ఆసియా క్రీడల్లో పాల్గొననున్న జట్టుకు అతడ్ని కెప్టెన్‌గా ఎన్నుకుంది పాక్ బోర్డు.
Asia Games Pakistan Team : పాకిస్థాన్ తుది జట్టు: ఖాసిమ్ అక్రమ్ (కెప్టెన్), అమీర్ జమాల్, అరాఫత్ మిన్హాస్, అర్షద్ ఇక్బాల్, ఆసిఫ్ అలీ, హైదర్ అలీ, ఖుష్దిల్ షా, మహ్మద్ హస్నైన్, ముహమ్మద్ అఖ్లాక్ (వికెట్ కీపర్), మీర్జా తాహిర్ బేగ్, రోహైల్ నజీర్, ఒమైర్ బిన్ యూసుఫ్ (వైస్ కెప్టెన్), షానవాజ్ దహానీ, సుఫియాన్ ముఖీమ్, ఉస్మాన్ ఖదీర్.
నాన్-ట్రావెలింగ్ రిజర్వ్: మెహ్రాన్ ముంతాజ్, మొహమ్మద్ ఇమ్రాన్ జూనియర్, ముహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్ నియాజీ, అబ్దుల్ వాహిద్ బంగల్జాయ్, ముబాసిర్ ఖాన్.