ETV Bharat / sports

Asia Emerging Cup 2023 : సెమీస్​లో బంగ్లాను చిత్తు చేసిన భారత్.. ఫైనల్స్​లో పాక్​తో 'ఢీ' - ఎమర్జింగ్ ఆసియా కప్‌ 2023 భారత్ పాక్ మ్యాట్

Asia Emerging Cup 2023 : ఎమర్జింగ్ ఆసియా కప్‌ వన్డే టోర్నమెంట్‌ సెమీస్​లో భారత్​ ఏ.. బంగ్లాదేశ్​ను చిత్తు చేసి ఫైనల్​కు దూసుకెళ్లింది. తుది పోరులో భారత్​ ఏ, పాకిస్థాన్​ ఏ తో తలపడనుంది.

Asia Emerging Cup 2023
భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ 2023
author img

By

Published : Jul 21, 2023, 8:51 PM IST

Updated : Jul 21, 2023, 10:22 PM IST

Asia Emerging Cup 2023 : ఎమర్జింగ్ ఆసియా కప్‌ వన్డే టోర్నమెంట్‌ సెమీస్​లో భారత్​ ఏ.. బంగ్లాదేశ్ ఏను చిత్తుచేసింది. ఆశల్లేని స్థితిలో అద్భుతంగా పుంజుకొని 51 పరుగుల తేడాలో విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ ఫైనల్స్​లో అడుగుపెట్టింది. తుది పోరులో పాకిస్థాన్​తో మరోసారి భారత్ ఏ తలపడనుంది. తన ఒంటరి పోరాటంతో భారత్​కు ఆ మాత్రం గౌరవప్రదమైన స్కోరు అందించిన కెప్టెన్ యశ్ ధుల్​కు మ్యాన్​ ఆఫ్​ ది మ్యాచ్​ అవార్డు లభించింది.

70/0 నుంచి 160 ఆలౌట్...
బంగ్లాదేశ్ - ఏ జట్టు కష్టతరం కాని 212 పరుగుల లక్ష్య ఛేదనను ఘనంగానే ఆరంభించింది. పవర్​ ప్లేలో బంగ్లా ఓపెనర్లు ఎదురుదాడికి దిగి రన్​రేట్​ ఆరుకు తగ్గకుండా ఆడారు. పది ఓవర్ల ముగిసే సరికి ఆ జట్టు స్కోరు.. 60/0. ఇక భారత్ ఓటమి ఖాయమని అంతా భావించారు. కానీ అప్పుడే టీమ్ఇండియా ఆట మొదలైంది. బౌలర్ మానవ్ సుతార్ బంగ్లా ఓపెనర్ నయీమ్​ను అద్భుత బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు. తర్వాత నిషాంత్‌ సింధు.. మరో ఓపెనర్ హసన్​ను వెనక్కిపంపాడు.
ఆ తర్వాత భారత బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ.. ఆటపై పట్టు సాధించారు. బంగ్లా స్కోరు 100కు చేరేసరికి మూడు వికెట్లు నష్టపోయింది. ఇక చివర్లో ప్రత్యర్థి ఇన్నింగ్స్​ను పేక మేడలా కూల్చారు. చివరి 30 పరుగుల వ్యవధిలో బంగ్లాదేశ్ చివరి 5 వికెట్లను కోల్పోయింది. భారత బౌలర్లలో నిషాంత్‌ సింధు 5 వికెట్లతో మెరిశాడు. మనవ్ సుతార్ మూడు వికెట్లు, ధొడియా, అభిషేక్ తలో వికెట్ పడగొట్టారు.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగిన భారత్​కు ఇన్నింగ్స్​​ ఏడో ఓవర్లోనే దెబ్బ తగిలింది. గత మ్యాచ్ హీరో సుదర్శన్​ 21 పరుగులకే పెవిలియన్ చేరాడు. వన్​డౌన్​లో వచ్చిన నికన్ జోస్ (17) కూడా నిరాశపర్చాడు. కాగా మరో ఓపెనర్ అభిషేక్ శర్మ (34) క్రీజులో కుదురుకున్నట్లు కనిపించినా... జోస్ ఔటైన తరువాతి ఓవర్లలోనే అతడు కూడా డగౌట్​ చేరాడు. మిడిల్​ ఆర్డర్​లో వచ్చిన నిషాంత్‌ సింధు (5) ఎక్కువ సేపు క్రీజులో నిలదొక్కుకోలేపోయాడు. దీంతో భారత్ వందలోపే నాలుగు వికెట్లు పారేసుకుంది.

ఈ దశలో కెప్టెన్ యశ్ ధుల్ (66) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అనవసర షాట్లు ప్రయత్నించకుండా.. బాధ్యతాయుతంగా నిలకడగా ఆడుతూ.. హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. కానీ అతడికి మరో ఎండ్​లో సహకారం కరవైంది. రియాన్‌ పరాగ్‌ (12), ధ్రువ్‌ జురెల్ (1), హర్షిత్‌ రాణా (9), హంగార్గేకర్‌ (15) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. చివర్లో మనవ్‌ సుతార్‌ (21) కూడా రనౌట్​ అవ్వడం వల్ల భారత్‌ 211 పరుగులకే పరిమితం అయ్యింది.

సంక్షిప్త స్కోర్లు.
భారత్ ఏ - 211 (49.1 ఓవర్లు)
బంగ్లాదేశ్ ఏ - 160 (34.2).

Last Updated : Jul 21, 2023, 10:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.