ETV Bharat / sports

భారత్‌ పాక్‌ పోరుకు రంగం సిద్ధం, అభిమానుల్లో ఉత్కంఠ - ఆసియా కప్​ 2022

ప్రపంచవ్యాప్తంగా క్రికెట్​ అభిమానులు ఎదురుచూసే సమరానికి రంగం సిద్ధమైంది. శనివారం ఆరంభమయ్యే ఆసియా కప్‌ చిరకాల ప్రత్యర్థులైన భారత్​, పాకిస్థాన్​ జట్ల మధ్య పోరుకు వేదిక కానుంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల బలాబలాలను ఓ సారి పరిశీలిద్దాం.

asia cup india pakisthan match
asia cup india pakisthan match
author img

By

Published : Aug 25, 2022, 10:14 AM IST

2010.. మహమ్మద్‌ అమిర్‌ బౌలింగ్‌లో చివరి ఓవర్‌ అయిదో బంతికి హర్భజన్‌ సిక్సర్‌తో టీమ్‌ఇండియా విజయం.
2012.. వన్డేల్లో తన వ్యక్తిగత అత్యధిక స్కోరు (183) అందుకున్న కోహ్లి, 330 పరుగుల ఛేదనలో భారత్‌ గెలుపు.
2014.. అశ్విన్‌ వేసిన చివరి ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లతో పాకిస్థాన్‌ను గెలిపించిన అఫ్రిది.
..ఇలా చెప్పుకుంటూ పోతే ఆసియా కప్‌లో భారత్‌, పాక్‌ మధ్య ఉత్కంఠతో ఊపేసిన మ్యాచ్‌లెన్నో.. అద్భుత పోరాటాలు.. అంతకుమించి భావోద్వేగాలు. ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎదురు చూసే అలాంటి మరో సమరానికి రంగం సిద్ధమైంది. శనివారం ఆరంభమయ్యే ఆసియా కప్‌.. ఈ చిరకాల ప్రత్యర్థుల మధ్య పోరుకు మరోసారి వేదిక కానుంది.

asia cup india pakisthan match
.

భారత్‌, పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ద్వైపాక్షిక సిరీస్‌లు లేకుండా పోయాయి. దీంతో ఐసీసీ టోర్నీల్లోనే ఈ రెండు జట్లు పోటీపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ జట్లు మళ్లీ ఎప్పుడు మైదానంలో సై అంటాయా? అనే ఎదురు చూపులు ఇప్పుడు ఫలించనున్నాయి. ఆసియా కప్‌లో దాయాది పాక్‌తో తలపడేందుకు భారత్‌ సిద్ధమవుతోంది. దుబాయ్‌లో ఆదివారం తన తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థిని టీమ్‌ఇండియా ఢీ కొడుతుంది. ఈ ఏడాది అక్టోబర్‌లో ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్‌ ఆరంభమవనున్న నేపథ్యంలో ఈ ఆసియా కప్‌లో విజయం సాధించి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడం రోహిత్‌ సేనకు అత్యావశ్యకం. ఆ దిశగా పాకిస్థాన్‌ నుంచి టైటిల్‌ కోసం గట్టిపోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. తన తొలి మ్యాచ్‌లోనే ప్రత్యర్థిపై గెలిచి భారత్‌ శుభారంభం చేయాల్సిన అవసరం ఉంది.

అదే వేదిక..
38 ఏళ్ల క్రితం తొలి ఆసియా కప్‌ (1984)లో సునీల్‌ గావస్కర్‌ సారథ్యంలో యూఏఈలోనే విజేతగా నిలిచిన భారత్‌.. ఆ తర్వాత మరో ఆరు సార్లు ట్రోఫీని ముద్దాడింది. శ్రీలంక అయిదు సార్లు నెగ్గగా.. పాకిస్థాన్‌ రెండు సార్లు మాత్రమే టైటిల్‌ సొంతం చేసుకోగలిగింది. చివరగా 2018లో యూఏఈలోనే జరిగిన ఆసియా కప్‌లో టీమ్‌ఇండియానే నెగ్గింది. కరోనా కారణంగా ఇప్పుడు నాలుగేళ్ల విరామం తర్వాత ఈ టోర్నీ జరుగుతోంది. మరోసారి యూఏఈలోనే నిర్వహిస్తున్న టోర్నీలో భారత్‌ ఫేవరేట్‌ అనడంలో సందేహం లేదు. కానీ పాక్‌తో మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిందే. గతేడాది ఇదే వేదికలో టీ20 ప్రపంచకప్‌ తొలి మ్యాచ్‌లోనే పాక్‌ చేతిలో టీమ్‌ఇండియా ఓటమి ఇంకా తాజాగానే ఉంది. ఆ పరాజయం ప్రపంచకప్‌లో భారత అవకాశాలను దెబ్బతీసింది. 10 వికెట్ల తేడాతో ఓటమి పరాభవాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. టీ20 లేదా వన్డే.. ఇలా ఏ ప్రపంచకప్‌లోనైనా పాక్‌ చేతిలో టీమ్‌ఇండియాకు అదే తొలి పరాజయం. ఇప్పుడు ఆసియా కప్‌లోనూ భారత్‌, పాక్‌ తొలి మ్యాచ్‌ దుబాయ్‌లోనే జరుగుతుంది. ఈ సారి విజయంతో నిరుటి ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని రోహిత్‌ సేన పట్టుదలతో ఉంది.

ఒకటి కంటే ఎక్కువ..
టోర్నీలో మొత్తం ఆరు జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్‌- ఎలో భారత్‌, పాకిస్థాన్‌, క్వాలిఫయర్‌.. గ్రూప్‌- బిలో శ్రీలంక, బంగ్లాదేశ్‌, అఫ్గనిస్థాన్‌ ఉన్నాయి. గ్రూప్‌ దశలో ప్రతి జట్టూ మిగతా రెండింటితో ఒక్కో మ్యాచ్‌ ఆడుతుంది. గ్రూప్‌ల్లో అగ్రస్థానంలో నిలిచిన రెండేసి జట్లు సూపర్‌-4కు అర్హత సాధిస్తాయి. అందులో ఒక్కో జట్టూ.. మిగతా మూడింటితో ఒక్కో మ్యాచ్‌ ఆడుతుంది. అందులో తొలి రెండు స్థానాలు సాధించిన జట్లు ఫైనల్లో తలపడతాయి. భారత్‌, పాక్‌ పోరు కోసం ఎదురు చూసే అభిమానులకు ఆసియా కప్‌ మూడింతల ఆనందాన్ని అందించే అవకాశం ఉంది. పరిస్థితులు అనుకూలిస్తే ఈ టోర్నీలో ఈ రెండు జట్లు మూడు సార్లు పోటీపడే ఆస్కారముంది. తొలి మ్యాచ్‌లో ఒకసారి.. సూపర్‌-4కు అర్హత సాధిస్తే అక్కడ మరోసారి.. తుదిపోరు చేరితే ముచ్చటగా మూడోసారి ఈ దాయాది జట్ల మధ్య సమరాన్ని చూడొచ్చు. ఆసియా కప్‌లోనూ పాక్‌పై భారత్‌దే ఆధిపత్యం. ఇప్పటివరకూ ఈ రెండు జట్లు 14 మ్యాచ్‌ల్లో తలపడగా.. టీమ్‌ఇండియా ఎనిమిది సార్లు గెలిచింది. పాక్‌ అయిదు సార్లు పైచేయి సాధించింది. ఓ మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. కానీ ఇప్పటివరకూ ఫైనల్లో ఒక్కసారి కూడా ఈ జట్లు ఎదురు పడకపోవడం విశేషం.

కలిసికట్టుగా ఆడితేనే..
కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌, విరాట్‌ కోహ్లి, దినేశ్‌ కార్తీక్‌, పంత్‌, సూర్యకుమార్‌, హార్దిక్‌, భువనేశ్వర్‌, అశ్విన్‌, దీపక్‌ హుడా, చాహల్‌ లాంటి ఆటగాళ్లతో టీమ్‌ఇండియా కూడా మెరుగ్గానే ఉంది. అయితే దాయాదిని ఓడించడం అంత తేలికేం కాదు. ప్రతికూల పరిస్థితులు, తీవ్ర ఒత్తిడిని అధిగమిస్తేనే జట్టుకు అవకాశాలుంటాయి. ప్రధాన పేసర్‌ బుమ్రా గాయం కారణంగా జట్టుకు దూరమవడం పెద్ద దెబ్బే. షమికి జట్టులో చోటు దక్కలేదు. ఈ నేపథ్యంలో అర్ష్‌దీప్‌, అవేశ్‌ లాంటి యువ పేసర్లతో కూడిన ఫాస్ట్‌బౌలింగ్‌ దళాన్ని నడిపించాల్సిన బాధ్యత భువీపై పడింది. మరోవైపు ప్రధాన కోచ్‌ ద్రవిడ్‌కు కరోనా సోకడంతో అతను జట్టుతో పాటు యూఏఈ వెళ్లలేకపోయాడు.

దీంతో ఇప్పటికే హరారె నుంచి దుబాయ్‌ చేరుకున్న లక్ష్మణ్‌.. పాక్‌తో ప్రతిష్ఠాత్మక మ్యాచ్‌కు జట్టు కోచ్‌గా వ్యవహరించనున్నాడు. ఇటీవల తరచుగా జట్టు కూర్పులో ప్రయోగాలు చేస్తున్న టీమ్‌ఇండియా.. ఆసియా కప్‌లో కలిసికట్టుగా ఆడితేనే పాక్‌ను ఓడించగలదు. జట్టు కూర్పును సరిదిద్దుకుని భారత్‌ బరిలో దిగాలి. ఇక పాక్‌తో మ్యాచ్‌తో 100వ టీ20 మైలురాయి చేరుకోనున్న విరాట్‌ కోహ్లి.. ఈ ప్రత్యేకమైన పోరులో రాణించి తిరిగి ఫామ్‌ అందుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ రెండు జట్ల మధ్య టీ20ల్లో అత్యధిక పరుగులు (7 మ్యాచ్‌ల్లో 311) చేసిన ఆటగాడిగా కొనసాగుతున్న అతను తిరిగి పరుగుల వేటలో సాగేందుకు ఇదే మంచి అవకాశం. చివరగా ప్రత్యర్థిని తేలిగ్గా తీసుకుంటే మాత్రం భారత్‌ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అజాగ్రత్తకు తావు ఇవ్వకుండా మరోసారి పాక్‌పై పైచేయి సాధించాలి.

ప్రత్యర్థి బలంగా..
"గత కొన్నేళ్లుగా పాకిస్థాన్‌ జట్టు క్రమంగా వృద్ధి సాధిస్తోంది. ఆటగాళ్లు నిలకడగా రాణిస్తున్నారు. గతేడాది టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియాపై విజయం వాళ్ల ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఎప్పుడైనా భారత్‌తో పోటీపడేందుకు వాళ్లు సిద్ధంగా ఉన్నారు".. ఇవీ పాక్‌ మాజీ కెప్టెన్‌ వసీం అక్రమ్‌ ఇటీవల చేసిన వ్యాఖ్యలు. అతను చెప్పినట్లుగానే ప్రస్తుతం ఆ జట్టు బలంగానే ఉంది. ముఖ్యంగా టీ20ల్లో గొప్పగా రాణిస్తోంది. మరోవైపు స్వదేశంలో జరగాల్సిన సిరీస్‌లను ఎక్కువగా యూఏఈలోనే ఆడిన ఆ జట్టుకు.. అక్కడి పరిస్థితులపై మంచి అవగాహన ఉంది.

asia cup india pakisthan match
.

గతేడాది టీమ్‌ఇండియాపై విజయానికి అది కూడా ఓ కారణం. ఇక ఆ జట్టు కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌ సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు. ప్రపంచ టీ20 నంబర్‌వన్‌ బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. అతనితో పాటు మహమ్మద్‌ రిజ్వాన్‌, ఫఖర్‌ జమాన్‌తో కూడిన ఆ జట్టు టాప్‌ఆర్డర్‌ పటిష్ఠంగా ఉంది. గతేడాది టీ20 ప్రపంచకప్‌ ఆరంభం నుంచి పొట్టి ఫార్మాట్లో ఆ జట్టు చేసిన పరుగుల్లో ఈ ముగ్గురి వాటా 67.53 శాతంగా ఉంది. ఈ త్రయం జట్టుకు ఎంత కీలకంగా మారిందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. గతేడాది టీ20 ప్రపంచకప్‌ మ్యాచ్‌లో భారత్‌ను తన పేస్‌తో దెబ్బతీసిన షహీన్‌ షా అఫ్రిది గాయంతో దూరమవడం మనకు లాభించే అంశం.

3.. ఈ సారి ఆసియా కప్‌లో భారత్‌, పాక్‌ మూడు మ్యాచ్‌ల్లో తలపడే అవకాశం ఉంది. డబుల్‌ రౌండ్‌ రాబిన్‌ ఫార్మాట్లో జరుగుతున్న ఈ టోర్నీలో మొదట గ్రూప్‌ దశలో పోటీపడతాయి. సూపర్‌-4కు అర్హత సాధిస్తే అక్కడా తలపడతాయి. ఫైనల్‌ చేరితే మరోసారి ఢీ కొడతాయి.

7.. ఆసియా కప్‌లో విజయవంతమైన జట్టుగా కొనసాగుతున్న భారత్‌ గెలిచిన టైటిళ్లు. 1984, 1988, 1990-91, 1995, 2010, 2016, 2018 సీజన్లలో టీమ్‌ఇండియా విజేతగా నిలిచింది. మూడు సార్లు ఫైనల్లో ఓడింది. శ్రీలంక అయిదు, పాకిస్థాన్‌ రెండు సార్లు ట్రోఫీ సొంతం చేసుకున్నాయి.

8.. ఆసియా కప్‌లో చిరకాల ప్రత్యర్థి పాక్‌పై భారత్‌ సాధించిన విజయాలు. ఈ రెండు జట్లు 14 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. పాక్‌ అయిదు సార్లు పైచేయి సాధించింది. ఓ మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. కానీ ఇప్పటివరకూ ఫైనల్లో ఒక్కసారి కూడా ఈ జట్లు ఎదురు పడకపోవడం విశేషం.

14.. ఇప్పటివరకూ జరిగిన ఆసియా కప్‌ టోర్నీలు. 1984లో ఈ టోర్నీ ఆరంభమైంది. శ్రీలంక అన్ని సీజన్లలోనూ బరిలో దిగగా.. భారత్‌ 13 సార్లు ఆసియా కప్‌లో పాల్గొంది.

ఇవీ చదవండి: గిల్‌ 45 స్థానాలు జంప్, టెస్టుల్లో టాప్‌ 10లో రోహిత్​, పంత్​

ద్రవిడ్​ స్థానంలో భారత హెడ్​ కోచ్​గా వీవీఎస్​ లక్ష్మణ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.