ETV Bharat / sports

విరాట్​ సెంచరీతో అనుష్క ఫుల్ ఖుష్.. ఇన్​స్టాలో లవ్​ నోట్​

ఆసియా‌కప్‌లో అఫ్గానిస్థాన్​తో జరిగిన ఆఖరి మ్యాచ్‌లో భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తన 71వ అంతర్జాతీయ సెంచరీ సాధించాడు. ఆ సమయంలో భావోద్వేగపూరితంగా కనిపించిన అతనికి తన భార్య అనుష్క లవ్​నోట్​ మరింత ఆనందాన్నిచ్చింది.

Anushka Sharma reacted as Virat Kohli completes 71st century in int'l cricket
KOHLI
author img

By

Published : Sep 9, 2022, 1:14 PM IST

Anushka Sharma instagram post : ఆసియా‌కప్‌లో టీమ్​ఇండియా అఫ్గానిస్థాన్​తో జరిగిన ఆఖరి మ్యాచ్‌లో భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తన 71వ అంతర్జాతీయ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. అఫ్గానిస్థాన్​పై వీరవిహారం చేసిన కోహ్లీ 53 బంతుల్లోనే 100 మార్కును అందుకున్నాడు. మొత్తంగా 61 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్సర్లతో 122 పరుగులతో అజేయంగా నిలిచాడు. సెంచరీ అనంతరం అతడి చిరునవ్వుకు ఫిదా కాని భారత అభిమాని ఉండడంటే అతిశయోక్తి కాదు.

ఇక ప్రేక్షకులకు అభివాదం చేసిన అనంతరం కోహ్లీ తన మెడలో ధరించిన చైన్‌ను, అలాగే తన వివాహ ఉంగరాన్ని ముద్దాడాడు. ఆ సమయంలో భావోద్వేగపూరితంగా కనిపించాడు. ఈ ఇన్నింగ్స్ అనంతరం.. సంజయ్ మంజ్రేకర్‌ కోహ్లీని పలు ప్రశ్నలు అడగ్గా అతడు చెప్పిన సమాధానాలు వింటే అతను ఎంత ఒత్తిడి ఎదుర్కొన్నాడో తెలుస్తోంది.

"గత రెండున్నరేళ్లలో ఎన్నెన్నో అనుభవాలు నాకు ఎన్నో నేర్పించాయి. మరో నెలలో నాకు 34 ఏళ్లు నిండుతాయి. ఎప్పుడూ ఆవేశంగా సెంచరీ సెలబ్రేషన్స్ చేసుకునే నేను ఇప్పుడూ అలా వ్యవహరించకూడదని నిర్ణయించుకున్నాను. సెంచరీ అనంతరం కాసేపు నేనూ షాకయ్యాను..ఈ ఇన్నింగ్స్ పలు విషయాల సమాహారం. ఇందులో మా జట్టు నాకు అండగా ఉంది." అని కోహ్లీ చెప్పాడు.

"సెంచరీ తర్వాత నా చైన్, ఉంగరాన్ని ముద్దుపెట్టుకున్నాను. నేను ఇప్పుడు ఇలా మీ ముందు మళ్లీ నిల్చున్నానంటే దాని వెనకాల ఓ వ్యక్తి ఉంది. తనే నా వైఫ్ అనుష్క. ఎన్నోసార్లు నాకు అండగా నిలిచి ఉంది. ఈ సెంచరీని ఆమెకు, నా కూతురు వామికకు అంకితమిస్తున్నాను. ఎల్లప్పుడు నా పక్కనే ఉండి నేను నిరాశ చెందకుండా ఉండేందుకు నిరంతరం నాలో ప్రోత్సహం నింపింది అనుష్క. ఆరు వారాల సెలవు తర్వాత నేను రిఫ్రెష్ అయ్యాను. ఈ విరామం నన్ను మళ్లీ ఆటను ఆస్వాదించడానికి ఉపయోగపడింది."అని కోహ్లీ తెలిపాడు.

అనుష్క ఆనందం అంతా ఇంతా కాదు మరి..
విరాట్​కు రెట్టింపు ఆనందాన్ని ఇచ్చింది అనుష్క శర్మ పోస్ట్​. విరాట్​ కోహ్లీ ఫొటోను ఇన్​స్టాలో షేర్​ చేసిన అనుష్క శర్మ.. "నేను ఎల్లప్పుడూ నీతోనే ఉంటాను" అని లవ్​ సింబల్​తో క్యాప్షన్​ పెట్టింది.

ఇదీ చదవండి: మూడేళ్ల నిరీక్షణకు తెర.. విరాట్‌ కెరీర్‌లో 71వ శతకం.. ఫ్యాన్స్ సెలబ్రేషన్స్​

నీరజ్‌ చోప్రా నయా చరిత్ర.. డైమండ్‌ లీగ్‌ ట్రోఫీ కైవసం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.