ETV Bharat / sports

Asia Cup 2023 IND VS SL : లంక స్పిన్ దెబ్బకు టీమ్​ఇండియా విలవిల .. లక్ష్యం ఎంతంటే? - లంక బౌలర్ల దెబ్బకు టీమ్​ఇండియా విలవిల

Asia Cup 2023 IND VS SL : శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్​లో టీమ్​ఇండియా ఇన్నింగ్స్​ ముగించింది. లంక బౌలర్లతో చేతిలో భారత బ్యాటర్లు చతికిలపడ్డారు. శ్రీలంక లక్ష్యం ఎంతంటే?

Asia Cup 2023 IND VS SL : లంక స్పిన్ దెబ్బకు టీమ్​ఇండియా విలవిల ..  లక్ష్యం ఎంతంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 12, 2023, 7:31 PM IST

Updated : Sep 12, 2023, 9:39 PM IST

Asia Cup 2023 IND VS SL : ఆసియా కప్‌ 2023లో శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్​లో టీమ్​ఇండియా తన ఇన్నింగ్స్​ను ముగించింది. పాకిస్థాన్​పై చూపించినంత ఊపును ఈ మ్యాచ్​లో కొనసాగించలేకపోయారు టీమ్​ఇండియా బ్యాటర్లు. లంక బౌలర్ల చేతిలో చతికిలపడ్డారు. దునిత్ వెల్లలాగే (5/40) వికెట్లు, చారిత్ అసలంక (4/14) వికెట్లతో టీమ్​ఇండియాను బ్యాటర్లను చిత్తుచేశారు.

ఓపెనర్ రోహిత్ శర్(53) ఒక్కడే దూకుడు ప్రదర్శించాడు. ఈ క్రమంలోనే వరుసగా మూడో హాఫ్ సెంచరీ బాదిన అతడు.. ఈ మ్యాచ్​తో వన్డేల్లో 10 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఇక 25 బంతుల్లో 2 ఫోర్లతో 19 పరుగులు చేసిన మరో ఓపెనర్​ శభమన్​ గిల్​ను.. దునిత్ వెల్లలాగే క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత 12 బంతుల్లో 3 పరుగులే చేసిన విరాట్ కోహ్లీని కూడా దునితే పెవిలియన్ పంపాడు. దీంతో 91 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లోకి వెళ్లిపోయింది టీమ్​ఇండియా.

ఆ తర్వాత ఇషాన్ కిషన్​(33), కేఎల్ రాహుల్​(39) స్కోరు బోర్డును కాస్త ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే 44 బంతుల్లో 2 ఫోర్లతో 39 పరుగులు చేసిన కేఎల్​ రాహుల్.. దునిత్ బౌలింగ్‌లో అతడికే క్యాచ్​ ఇచ్చి ఔటయ్యాడు. 61 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 33 పరుగులు చేసిన ఇషాన్ కిషన్.. అసలంక బౌలింగ్‌లో దునిత్​కే క్యాచ్ ఇచ్చి పెవిలియన్​ చేరాడు.

ఆ తర్వాత హార్దిక్​ పాండ్య.. 18 బంతుల్లో 5 పరుగులు.. జడేజా 19 బంతుల్లో 4 పరుగులే చేసి విఫలమయ్యారు. అలా 178 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లోకి వెళ్లిపోయింది టీమ్​ఇండియా. దీంతో ఇక టీమ్​ఇండియా 200 స్కోర్​ చేయడం కూడా కష్టమే అన్న దశలో వర్షం మ్యాచ్​ను ఆటంకాన్ని కలిగించింది.

ఆ తర్వాత కాసేపటికి ప్రారంభమైన మ్యాచ్​లో అక్సర్ పటేల్​(26) స్కోర్​ను 200 ప్లస్​ చేసి జట్టును కాస్త ఆదుకున్నాడు. 36 బంతుల్లో ఓ ఫోర్‌తో 26 పరుగులు చేసి తీక్షణ బౌలింగ్‌లో క్యాచ్ ఇచ్చి ఔట్​ అయ్యాడు. చివరికి 19 బంతుల్లో 5 పరుగులు చేసిన మహ్మద్ సిరాజ్ నాటౌట్‌గా మిగిలాడు. అలా చివరి వికెట్‌కు అక్షర్ పటేల్, సిరాజ్ కలిసి 27 పరుగులు నమోదు చేశాడు. మొత్తంగా 49.1 ఓవర్లలో టీమ్​ఇండియా 213 పరుగులు చేసింది.

Asia Cup 2023 IND VS SL : లంకతో మ్యాచ్​.. రోహిత్ శర్మ అరుదైన ఫీట్

Asia Cup 2023 IND VS SL : కోహ్లీ - రోహిత్ వరల్డ్ రికార్డ్​.. సూపర్ హిట్​ జోడీగా ఘనత

Last Updated : Sep 12, 2023, 9:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.