Asia Cup 2023 Ind vs Pak : ఆసియా కప్‌లో హై వోల్టేజ్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. దాదాపు నాలుగేళ్ల తర్వాత వన్డేల్లో భారత్.. పాకిస్థాన్‌ను ఢీ కొట్టనుంది. 2019 ప్రపంచకప్‌లో రెండు జట్లు చివరిసారిగా తలపడగా.. ఆ తర్వాత ఇరుజట్ల మధ్య వన్డే మ్యాచ్ ఆడే ఛాన్స్ రాలేదు. అప్పటి నుంచి భారత్-పాక్ నాలుగు సార్లు మాత్రమే టీ20ల్లో ఎదురుపడ్డాయి. ఈ ఫార్మాట్లో కూడా మ్యాచ్ జరిగి దాదాపు పది నెలలు కావస్తోంది. చివరగా 2022 పొట్టి ప్రపంచకప్‌లో ఇండోపాక్ మ్యాచ్ జరిగింది. ఇక చాలా రోజుల తర్వాత సెప్టెంబర్ 2న జరిగే దాయాదుల పోరును వీక్షించేందుకు యావత్ క్రీడాలోకం ఉత్సాహంగా ఉంది. అంతే కాకుండా అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈ మినీ టోర్నీలో ఇరుజట్లు మూడు సార్లు తలపడే అవకాశం ఉంది. దీంతో ఆసియా కప్‌పై ఆసక్తి తీవ్రంగా పెరిగిపోయింది.
Pallekele Stadium Weather : అయితే వరుణుడు.. క్రికెట్ ఫ్యాన్స్ ఉత్సాహంపై నీళ్లు చల్లేందుకు సిద్ధమయ్యాడు. శనివారం కాండీ వేదికగా జరిగే భారత్, పాక్ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. వర్షం పడేందుకు 90 శాతం ఛాన్స్ ఉందనీ.. వాతావరణంలో తేమ 84 శాతం ఉంటుందని శ్రీలంక వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఆసియా కప్‌లో కీలక మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగిస్తుందేమోనని క్రికెట్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.
-
One Sleep Away ⏳
— BCCI (@BCCI) September 1, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Lets Go #TeamIndia 💪🇮🇳#AsiaCup2023 pic.twitter.com/nvneseW91Z
">One Sleep Away ⏳
— BCCI (@BCCI) September 1, 2023
Lets Go #TeamIndia 💪🇮🇳#AsiaCup2023 pic.twitter.com/nvneseW91ZOne Sleep Away ⏳
— BCCI (@BCCI) September 1, 2023
Lets Go #TeamIndia 💪🇮🇳#AsiaCup2023 pic.twitter.com/nvneseW91Z
ఇక భారత్-పాక్ మ్యాచ్‌కు వర్షం అడ్డు రాకుంటే.. విరాట్-రవూఫ్, బుమ్రా-బాబార్ ఆజమ్ మధ్య తగ్గపోరు ఉండటం ఖాయమని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇటు బుమ్రా, షమీ, సిరాజ్‌తో టీమ్ఇండియా పేస్ విభాగం పటిష్ఠంగా ఉంది. అటు షాహీన్ అఫ్రిదీ, నసీమ్ షా, హరిస్ రవూఫ్‌తో పాకిస్థాన్ బౌలింగ్ కూడా దృఢంగా ఉంది.
బ్యాటింగ్ విభాగంలో కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీతో భారత టాపార్డర్ పటిష్ఠంగా కనిపిస్తోంది. KL రాహుల్ అందుబాటులో ఉండని కారణంగా.. వికెట్ కీపింగ్ బాధ్యతలు ఇషాన్ కిషన్ లేదా సంజూ శాంసన్‌కు దక్కవచ్చు. గాయం నుంచి కోలుకున్న శ్రేయస్ అయ్యర్‌కు.. మిడిల్‌ఆర్డర్‌లో చోటు దక్కే అవకాశం ఉంది. ఆల్ రౌండర్లుగా హర్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా బరిలోకి దిగనున్నారు.
మినీ టోర్నమెంట్‌గా భావించే ఆసియా కప్‌లో భారత్-పాక్ జట్లు ఇప్పటివరకు 13 సార్లు తలపడ్డాయి. ఇందులో ఏడుసార్లు భారత్ గెలిస్తే.. ఐదుసార్లు పాక్ నెగ్గింది. 2018 ఆసియా కప్‌లో తలపడ్డ రెండుసార్లూ టీమ్‌ఇండియానే పైచేయి సాధించింది. పాక్‌తో గత అయిదు ఆసియాకప్ మ్యాచ్‌ల్లో భారత్ నాలుగు సార్లు నెగ్గడం విశేషం.