ETV Bharat / sports

Asia Cup 2023 : భారత్​ -పాక్ ఒక్కసారి కూడా తలపడలేదా.. ఆసియా కప్​ ఆసక్తికర విషయాలు తెలుసా? - ఆసియా కప్​ 2023 వేదిక

Asia Cup 2023 :ఈ ఏడాది ఆసియా కప్​ టోర్నీలకు సర్వం సిద్ధమైంది. శ్రీ లంక, పాకిస్థాన్​ ఆతిథ్యమిస్తున్న ఈ టోర్నీలు ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 17 వరకు జరగనున్నాయి. ఈ క్రమంలో ఆసియా కప్​కు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు మీ కోసం..

Asia Cup 2023
ఆసియా కప్​ 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 23, 2023, 1:16 PM IST

Asia Cup 2023 : ఈ ఏడాది ఆసియా కప్​ టోర్నీలకు సర్వం సిద్ధమైంది. శ్రీలంక, పాకిస్థాన్​ ఆతిథ్యమిస్తున్న ఈ టోర్నీలు ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 17 వరకు జరగనున్నాయి. 2018 తర్వాత ఇప్పుడు 50 ఓవర్ల ఫార్మాట్‌లో ఆసియా కప్ జరగనుంది. ఈ క్రమంలో నేపాల్ తొలిసారిగా ఈ టోర్నీలో ఆడుతుండగా.. భారత్, బంగ్లాదేశ్, పాకిస్థాన్, ఆఫ్ఘానిస్తాన్‌, శ్రీలంక, నేపాల్ ఇలా ఈ ఏడాది టైటిల్ కోసం ఆరు జట్లు తలపడనున్నాయి. హైబ్రిడ్ మోడల్‌లో జరగనున్న ఈ టోర్నీలో మొత్తం 13 మ్యాచ్‌లు ఉండగా.. పాక్‌లో 4, శ్రీలంకలో 9 జరగనున్నాయి. ఈ క్రమంలో ఆసియా కప్​కు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు మీ కోసం..

  1. ఇప్పటి వరకు జరిగిన ఆసియా కప్​ టోర్నీల్లో అత్యధిక టైటిల్స్ గెలుచుకుని భారత్​ అగ్ర స్థానంలో ఉంది. (1984, 1988, 1991,1995, 2010, 2016, 2018 ) ఇక 6 సార్లు అందుకుని ఆ తర్వాతి స్థానంలో శ్రీలంక (1986, 1997, 2004, 2008, 2014, 2022) ఉంది. పాకిస్థాన్​ రెండు సార్లు సొంతం చేసుకుంది. (2000, 2012)
  2. యూఏఈలో 1984లో తొలిసారిగా ఆసియా కప్‌ జరిగింది. ఆ సీజన్‌లో టీమ్​ఇండియా విజేతగా నిలిచింది.
  3. భారత్- పాకిస్థాన్.. ఒక్కసారి కూడా ఆసియా కప్ ఫైనల్స్​లో తలపడలేదు.
  4. ఆసియా కప్ ఫైనల్‌లో భారత్- శ్రీలంక జట్లు 8 సార్లు తలపడ్డాయి.
  5. ఆసియా కప్‌నకు పాకిస్థాన్ ఆతిథ్యమివ్వడం ఇది రెండోసారి. 2008 ఆసియా కప్ పాకిస్థాన్‌లో తొలిసారి జరగ్గా.. మళ్లీ ఇప్పుడు 2023లో రెండో సారి ఈ టోర్నీకి ఆతిథ్యం ఇస్తోంది. అయితే భారత్-పాకిస్థాన్​ మధ్య ఉన్న విబేధాల కారణంగా ఈసారి శ్రీలంకలో కూడా మ్యాచ్‌లు జరుగనున్నాయి.
  6. ఇక ఇప్పటివరకు భారత్ ఒక్కసారి మాత్రమే ఆసియా కప్​కు ఆతిథ్యమిచ్చింది. బంగ్లాదేశ్ ఈ టోర్నీకి అత్యధిక సార్లు ఆతిథ్యం ఇచ్చింది.
  7. ఆసియా కప్ 2023లో ఆడనున్న ఆరు జట్లను 2 వేర్వేరు గ్రూపులుగా విభజించారు. అందులో గ్రూప్-ఏలో భారత్, పాకిస్థాన్, నేపాల్ జట్లు ఉండగా.. శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్‌ జట్లు గ్రూప్-బిలో ఉన్నాయి. ఇక ఈ రెండు గ్రూప్స్​లో అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లు 'సూపర్ ఫోర్'లో తలపడతాయి. ఈ క్రమంలో సూపర్ ఫోర్‌లో ప్రతి జట్టు మిగతా జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడనుంది. అలా సూపర్ ఫోర్‌లో టాప్​ పొజిషన్​లో నిలిచిన రెండు జట్లు ఫైనల్స్​లోకి చేరుకుంటాయి. ఇక ఫైనల్స్​లో గెలిచిన జట్టు ఆసియా కప్ 2023 టైటిల్ అందుకుంటుంది.

Rohit Sharma Asia Cup 2023 : ఈ 'ఐదు' స‌చిన్ రికార్డుల‌ను రోహిత్ బ్రేక్ చేస్తాడా?

Asia Cup 2023 Tilak Varma : 'ఇది నేను అస్సలు ఊహించలేదు.. రోహిత్‌ భాయ్‌ వల్లే ఇదంతా!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.