Asia Cup 2023 Covid : క్రికెట్ అభిమానులను అలరించడానికి మరో నాలుగు రోజుల్లో 2023 ఆసియ కప్ టోర్నమెంట్ మొదలవ్వనుంది. భారత్, పాకిస్థాన్ సహా ఆరు జట్లు ఈ పోటీల్లో పాల్గొననున్నాయి. ఇక టోర్నీలో పాల్గొనే ఆయా జట్లు.. టైటిల్ గెలిచేందుకు ఇప్పటికే ప్రణాళికలు రచిస్తున్నాయి. అయితే అంతా సజావుగా సాగుతున్న వేళ.. ఓ సమస్య కలవరపెడుతోంది. అదేంటంటే..
ఆసియా కప్ ముంగిట టోర్నీలో పాల్గొనే శ్రీలంక ప్లేయర్లకు కొవిడ్ సోకింది. లంక స్టార్ బ్యాటర్ కుశాల్ పెరీరా, పేసర్ అవిష్క ఫెర్నాండోకు(Sri Lanka Players Covid) కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. ప్రస్తుతం వీరిని ఐసోలేషన్‌లో ఉంచారు. రీసెంట్గా జరిగిన శ్రీలంక ప్రీమియర్ లీగ్‌లో కరోనా వ్యాప్తి చెందినట్లు తెలుస్తోంది. దీంతో సదరు క్రికెట్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.
అయితే ప్రస్తుతం కొవిడ్ ప్రభావం అంతగా ఏమీ లేకపోయినప్పటికీ.. వైరస్ సోకిన ఆటగాళ్లు కొన్ని మ్యాచ్‌లకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో ఆ జట్టుకు తీవ్ర నష్టం జరిగే అవకాశం లేకపోలేదు. టోర్నీ ప్రారంభమయ్యేలోపు.. ఆ ఆటగాళ్లు కోలుకొని నెగిటివ్ నిర్ధరణ అయితేనే వారు మళ్లీ గ్రౌండ్లో కనబడే ఛాన్స్ ఉంది. కాగా టోర్నీలో భారత్ మ్యాచ్‌లన్నీ శ్రీలంకలోనే జరగనున్నాయి. దీంతో టోర్నీ మొదలయ్యాక ఇతర ఆటగాళ్లకు వైరస్ సోకకుండా జాగ్రత్తలు తీసుకొని.. నిర్వాహకులు మైదానాలు, డగౌట్లు, డ్రెస్సింగ్ రూమ్‌లు కచ్చితంగా శానిటైజేషన్ చేయాల్సిన అవసరం ఉంది.
అయితే యావత్ ప్రపంచాన్ని భయపెట్టిన కొవిడ్.. క్రీడారంగంపై కూడా తీవ్ర ప్రభావం చూపింది. గతంలో కొవిడ్ వల్ల అనేక అంతర్జాతీయ మ్యాచ్‌లు రద్దయ్యాయి. వైరస్ వ్యాప్తి వల్ల.. 2020లో ఐపీఎల్ మధ్యలోనే ఆపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ సీజన్ టోర్నీని మళ్లీ ఆక్టోబర్-నవంబర్‌లో నిర్వహించారు.
Asia Cup 2023 Schedule : తర్వాత పరిస్థితి కొంచెం చక్కబడ్డాక, స్టేడియంలో ప్రేక్షకులు లేకుండానే.. ఐపీఎల్, ద్వైపాక్షిక సిరీస్‌లు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. బయో బబుల్‌ను సృష్టించి మరీ క్రికెటర్లను ప్రత్యేకంగా ఉంచిన సందర్భాలూ ఉన్నాయి. ప్రతి ఆటగాడికి కరోనా టెస్ట్‌లు చేయించి.. నెగిటివ్‌గా నిర్ధరణ అయిన తరువాతే వారిని మ్యాచ్‌ల్లో ఆడించారు. ఇక తాజాగా శ్రీలంక ప్లేయర్లకు కొవిడ్ సోకడం వల్ల.. పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 17 వరకు ఈ టోర్నమెంట్ జరగనుంది.
-
Buckle up, cricket fans! With just four days left, the much-awaited Men's ODI Asia Cup 2023 is about to take the cricketing world by storm. Expect fierce rivalries, breathtaking strokes, and edge-of-the-seat action as teams fight for supremacy. 🤩#ACC #AsiaCup2023 pic.twitter.com/i6OqlIsFic
— AsianCricketCouncil (@ACCMedia1) August 26, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Buckle up, cricket fans! With just four days left, the much-awaited Men's ODI Asia Cup 2023 is about to take the cricketing world by storm. Expect fierce rivalries, breathtaking strokes, and edge-of-the-seat action as teams fight for supremacy. 🤩#ACC #AsiaCup2023 pic.twitter.com/i6OqlIsFic
— AsianCricketCouncil (@ACCMedia1) August 26, 2023Buckle up, cricket fans! With just four days left, the much-awaited Men's ODI Asia Cup 2023 is about to take the cricketing world by storm. Expect fierce rivalries, breathtaking strokes, and edge-of-the-seat action as teams fight for supremacy. 🤩#ACC #AsiaCup2023 pic.twitter.com/i6OqlIsFic
— AsianCricketCouncil (@ACCMedia1) August 26, 2023
Rohit Sharma Asia Cup 2023 : ఈ 'ఐదు' సచిన్ రికార్డులను రోహిత్ బ్రేక్ చేస్తాడా?