ETV Bharat / sports

ఆదివారం భారత్, పాక్ మ్యాచ్.. వారంలో రెండోసారి చిరకాల ప్రత్యర్థుల పోరు - india pakistan match

India Pakistan match Asia cup : వారం రోజుల వ్యవధిలో భారత్, పాకిస్థాన్ మధ్య మళ్లీ మ్యాచ్ జరగబోతోంది. ఆసియా కప్ గ్రూప్ ఏ చివరి మ్యాచ్​లో హాంకాంగ్​పై రికార్డు విజయం సాధించిన పాక్.. సూపర్ 4కు అర్హత సాధించింది. ఈ దశలో భారత్, పాక్ తలపడనున్నాయి.

INDIA PAKISTAN MATCH
INDIA PAKISTAN MATCH
author img

By

Published : Sep 3, 2022, 7:46 AM IST

Asia cup cricket : ఆసియా కప్‌లో మళ్లీ చిరకాల ప్రత్యర్థుల పోరు చూడబోతున్నాం. సరిగ్గా వారం రోజులకే మళ్లీ భారత్, పాకిస్థాన్‌ తలపడబోతున్నాయి. గ్రూప్‌-ఎలో తన తొలి మ్యాచ్‌లో భారత్‌ చేతిలో ఓటమి పాలైన పాకిస్థాన్‌.. చివరి మ్యాచ్‌లో హాంకాంగ్‌పై జూలు విదిల్చింది. మొదట 2 వికెట్లకు 193 పరుగుల భారీ స్కోరు సాధించిన ఆ జట్టు.. ప్రత్యర్థిని 38 పరుగులకే కుప్పకూల్చి, ఏకంగా 155 పరుగుల విజయంతో సూపర్‌-4కు అర్హత సాధించింది. ఈ దశలోనూ భారత్, పాక్‌ తమ తొలి మ్యాచ్‌లో ముఖాముఖి తలపడనున్నాయి. గ్రూప్‌ దశలో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన భారత్‌ ఇప్పటికే సూపర్‌-4 చేరిన సంగతి తెలిసిందే.

India Pakistan Match: భారత్‌తో మ్యాచ్‌లో సగం ఇన్నింగ్స్‌ వరకు హాంకాంగ్‌ బౌలర్లు ఎంత బాగా బౌలింగ్‌ చేశారో తెలిసిందే. సూర్యకుమార్‌ మెరుపుల పుణ్యమా అని భారత్‌ భారీ స్కోరు (192) చేయగలిగింది. తర్వాత హాంకాంగ్‌ బ్యాటుతోనూ మంచి పోటీయే ఇచ్చింది. 152 పరుగులు చేసింది. ఇక శుక్రవారం టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన పాక్‌.. 10 ఓవర్లకు బాబర్‌ అజామ్‌ (9) వికెట్‌ కోల్పోయి 61 పరుగులే చేసింది. ఈ నేపథ్యంలో పాక్‌కు షాకిచ్చి హాంకాంగ్‌ ముందంజ వేస్తుందా అన్న సందేహాలు కలిగాయి. కానీ బ్యాటింగ్‌ కష్టంగా మారిన పిచ్‌పై అప్పటిదాకా నెమ్మదిగా ఆడిన రిజ్వాన్‌ (78 నాటౌట్‌; 57 బంతుల్లో 6×4, 1×6), ఫకార్‌ జమాన్‌ (53; 41 బంతుల్లో 3×4, 2×6) ఇన్నింగ్స్‌ రెండో అర్ధంలో చెలరేగారు. ఆఖర్లో ఖుష్‌దిల్‌ షా (35 నాటౌట్‌; 15 బంతుల్లో 5×6) కూడా రెచ్చిపోవడంతో పాక్‌ భారీ స్కోరు సాధించింది. అనంతరం పాక్‌ బౌలర్ల ధాటికి హాంకాంగ్‌ అల్లాడిపోయింది. యువ పేసర్‌ నసీమ్‌ షా (2/7) ఇన్నింగ్స్‌ మూడో ఓవర్లో హాంకాంగ్‌ కెప్టెన్‌ నిజాకత్‌ (8)తో పాటు బాబర్‌ హయత్‌ (0)ను ఔట్‌ చేసి పతనానికి తెరతీస్తే.. ఆ తర్వాత స్పిన్నర్లు షాదాబ్‌ ఖాన్‌ (4/8), మహ్మద్‌ నవాజ్‌ (3/5) హాంకాంగ్‌ను చుట్టేశారు. వీళ్లిద్దరూ కేవలం 4.4 ఓవర్ల వ్యవధిలో 7 వికెట్లు పడగొట్టడం విశేషం. హాంకాంగ్‌ ఆటగాళ్లలో ఒక్కరూ రెండంకెల స్కోరు చేయలేదు. ఆ జట్టు కేవలం 10.4 ఓవర్లలోనే ఆలౌటైంది. హాంకాంగ్‌తో మ్యాచ్‌ల్లో భారత్, పాక్‌ ఇన్నింగ్స్‌లు దాదాపు ఒకే రకంగా సాగాయి. 10 ఓవర్లకు 70/1తో ఇబ్బందుల్లో ఉన్న భారత్‌.. ఇన్నింగ్స్‌ రెండో అర్ధంలో చెలరేగి 2 వికెట్లకు 192 పరుగులు చేసింది. ఇక పాక్‌ 10 ఓవర్లకు 61/1 నుంచి 193/2తో ఇన్నింగ్స్‌ను ముగించింది. కానీ భారత్‌పై 5 వికెట్లే కోల్పోయి 152 పరుగులు చేయగలిగిన హాంకాంగ్‌.. పాక్‌ బౌలర్ల ధాటికి కేవలం 38 పరుగులకే కుప్పకూలింది. చిరకాల ప్రత్యర్థితో తర్వాతి పోరుకు ముందు ఇది రోహిత్‌ సేనకు హెచ్చరికే.

సూపర్‌-4 షెడ్యూల్‌
ఆసియా కప్‌లో గ్రూప్‌-ఎ నుంచి భారత్, పాక్‌.. గ్రూప్‌-బి నుంచి అఫ్గానిస్థాన్, శ్రీలంక సూపర్‌-4 దశకు అర్హత సాధించాయి. ఈ దశలో ప్రతి జట్టూ మిగతా మూడు జట్లతో ఒక్కో మ్యాచ్‌ ఆడుతుంది. టాప్‌-2 జట్లు ఫైనల్లో తలపడతాయి.

సెప్టెంబరు 3 శ్రీలంక × అఫ్గానిస్థాన్‌
సెప్టెంబరు 4భారత్‌ × పాకిస్థాన్‌
సెప్టెంబరు 6భారత్‌ × శ్రీలంక
సెప్టెంబరు 7పాకిస్థాన్‌ × అఫ్గానిస్థాన్‌
సెప్టెంబరు 8భారత్‌ × అఫ్గానిస్థాన్‌
సెప్టెంబరు 9పాకిస్థాన్‌ × శ్రీలంక
సెప్టెంబరు 11ఫైనల్‌
  • అన్ని మ్యాచ్‌లో భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30కి ఆరంభమవుతాయి.

పాకిస్థాన్‌ ఇన్నింగ్స్‌: రిజ్వాన్‌ నాటౌట్‌ 78; అజామ్‌ (సి) అండ్‌ (బి) ఎహ్‌సాన్‌ 9; ఫకార్‌ జమాన్‌ (సి) అజాజ్‌ (బి) ఎహ్‌సాన్‌ 53; కుష్‌దిల్‌ షా నాటౌట్‌ 35; ఎక్స్‌ట్రాలు 18 మొత్తం: (20 ఓవర్లలో 2 వికెట్లకు) 193; వికెట్ల పతనం: 1-13, 2-129; బౌలింగ్‌: హరూన్‌ 2-0-14-0; ఆయూష్‌ శుక్లా 3-0-33-0; ఎహ్‌సాన్‌ ఖాన్‌ 4-0-28-2; అజాజ్‌ ఖాన్‌ 3-0-44-0; యాసిమ్‌ 4-0-36-0; గజన్‌ఫర్‌ 4-0-38-0

హాంకాంగ్‌ ఇన్నింగ్స్‌: నిజాకత్‌ ఖాన్‌ (సి) అసిఫ్‌ (బి) నసీమ్‌ 8; ముర్తజా (సి) కుష్‌దిల్‌షా (బి) దహాని 2; బాబర్‌ హయత్‌ (బి) నసీమ్‌ 0; కించిత్‌ షా ఎల్బీ (బి) నవాజ్‌ 6; అజాజ్‌ఖాన్‌ (బి) షాదాబ్‌ 1; స్కాట్‌ (బి) నవాజ్‌ 4; జీషన్‌ అలీ (సి) ఇఫ్తికార్‌ (బి) నవాజ్‌ 3; హరూన్‌ (బి) షాదాబ్‌ 3; ఎహ్‌సాన్‌ నాటౌట్‌ 0; ఆయుష్‌ (బి) షాదాబ్‌ 1; గజన్‌ఫర్‌ ఎల్బీ (బి) షాదాబ్‌ 0; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం: (10.4 ఓవర్లలో ఆలౌట్‌) 38; వికెట్ల పతనం: 1-16, 2-16, 3-19, 4-25, 5-30, 6-31, 7-36, 8-36, 9-38; బౌలింగ్‌: నసీమ్‌ షా 2-0-7-2; దహాని 2-1-7-1; ఇఫ్తికార్‌ 1-0-3-0; హారిస్‌ రవూఫ్‌ 1-0-6-0; షాదాబ్‌ఖాన్‌ 2.4-0-8-4; మహ్మద్‌ నవాజ్‌ 2-0-5-3

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.