ICC Test ranking: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ).. బుధవారం తాజా టెస్టు ర్యాంకింగ్స్ విడుదల చేసింది. భారత్-న్యూజిలాండ్ టెస్టు సిరీస్‌లో ఆకట్టుకునే ప్రదర్శన చేసిన అశ్విన్, మయాంక్ అగర్వాల్, కివీస్ స్పిన్నర్ అజాజ్ పటేల్ మెరుగైన ర్యాంకులు సాధించారు.
రెండో టెస్టులో 150, 62 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన మయాంక్ అగర్వాల్.. 30 స్థానాలు ఎగబాకి 11వ ర్యాంక్‌లో నిలిచాడు. అంతకు ముందు 2019లో కెరీర్లో అత్యుత్తమంగా 10వ స్థానం సంపాదించాడు.
స్పిన్నర్ అశ్విన్.. రెండో టెస్టులో నాలుగు వికెట్లు తీసి బౌలర్లలో రెండో ర్యాంక్‌కు చేరుకున్నాడు. భారత సంతతికి చెందిన అజాజ్ పటేల్.. ప్రస్తుతం కివీస్‌కు ఆడుతున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో మొత్తం 10 వికెట్లు తీసిన ఈ బౌలర్.. టెస్టు చరిత్రలో ఈ ఘనత సాధించిన మూడో బౌలర్‌గా నిలిచాడు. అలానే తాజా ర్యాంకింగ్స్‌లో 23 స్థానాలు మెరుగుపరుచుకుని 38వ ర్యాంక్ సాధించాడు.
మిగతా వారిలో శుభ్‌మన్ గిల్ 45వ ర్యాంక్‌కు, సిరాజ్ 41వ ర్యాంక్‌కు, డారెల్ మిచెల్ 78వ ర్యాంక్‌కు చేరుకున్నారు. ఈ టెస్టులో ఆడని రోహిత్ శర్మ.. 0,36 పరుగులే చేసిన కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఐదు, ఆరు స్థానాల్లోనే కొనసాగుతున్నారు.
ఇదీ చూడండి: టెస్టుల్లో తొలి బంతికే వికెట్.. ఆసీస్ పేసర్ రికార్డు