england vs australia fifth test live updates : యాషెస్ సిరీస్‌లో భాగంగా జరుగుతున్న ఆఖరిదైన ఐదో టెస్టు మరో కీలక మలుపు తీసుకుంది. విజయం ఇంగ్లాండ్‌ను కాకుండా ఆస్ట్రేలియా ఖాతాలో పడేలో కనిపిస్తోంది. 384 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలో దిగిన ఆసీస్.. ఆదివారం వర్షం కారణంగా నాలుగో రోజు ఆట పూర్తయ్యే సమయానికి ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 135 పరుగులను తన ఖాతాలో వేసుకుంది.
ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (99 బంతుల్లో 58 బ్యాటింగ్; 9×4), ఉస్మాన్ ఖవాజా (130 బంతుల్లో 69 బ్యాటింగ్; 8×4) పట్టుదలతో క్రీజులో కొనసాగుతూ ఆడుతున్నారు. ఆస్ట్రేలియా విజయం సాధించాలంటే.. చివరి రోజు ఇంకా 249 పరుగులు చేయాల్సిన అవసరం ఉంది. ఇంగ్లాండ్ గెలవాలంటే 10 వికెట్లు తీయాలి.
ఆదివారం ఓవర్‌నైట్ స్కోరు 389/9తో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది ఇంగ్లాండ్ జట్టు. మరో ఆరు పరుగులు చేసి 395 పరుగులకు ఆలౌట్‌గా నిలిచింది. అనంతరం భారీ లక్ష్య ఛేదనను ప్రారంభించింది. అయితే వర్షం కారణంగా ఆ జట్టు 38 ఓవర్లు మాత్రమే బ్యాటింగ్ చేయగలిగింది. ఆస్ట్రేలియా జట్టు వికెట్లను త్వరత్వరగా పడగొట్టి.. విజయాన్ని అందుకోవాలనుకున్న ఇంగ్లాండ్ జట్టుకు.. వార్నర్, ఖవాజా గట్టిగా ఎదుర్కొన్నారు. ఎక్కడా తడబడకుండా ఆచితూచి ఆడుతూ... ప్రత్యర్థి బౌలర్లకు ఎటువంటి అవకాశం ఇవ్వకుండా ఆడారు. ఈ క్రమంలోనే ఈ ఇద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేశరు. ఇకపోతే సోమవారం ఐదో రోజు కూడా మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే సూచనలు ఉన్నాయి. కాబట్టి మ్యాచ్‌కు ఎలాంటి ముగింపు లభిస్తుందో, విజయం ఎవరిని వరిస్తుందోనని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
2017-18 సిరీస్ తర్వాత తొలిసారి.. యాషెస్ సిరీస్ 2017-18 సిరీస్ తర్వాత మొదటిసారి సెంచరీ భాగస్వామ్యం నమోదైంది. ఆ సీజన్‌లో వార్నర్-కెమరూన్ బాన్‌క్రాఫ్ట్ మొదటి వికెట్‌కు 122 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. మళ్లీ ఇప్పుడు జరుగుతున్న మ్యాచ్‌లో వార్నర్-ఖ్వాజా పెయిర్ అజేయమైన 135 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది.
Warner ashes series 2023 : ఇప్పటివరకు 25 సార్లు.. ఆస్ట్రేలియా సీనియర్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఓ మార్క్‌ను అందుకున్నాడు. టెస్టుల్లో అత్యధిక సార్లు (25) 100 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాలు నెలకొల్పిన ఆటగాడిగా నిలిచాడు. అలాగే యాషెస్‌లో వార్నర్ ఇప్పటివరకు 8 సెంచరీ పార్ట్‌నర్‌షిప్స్‌లో భాగమయ్యాడు. ఉస్మాన్ ఖ్వాజాతో కలిసి అజేయ సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేయడం వల్ల వార్నర్ ఈ ఫీట్‌ను అందుకున్నాడు.
ఇదీ చూడండి :
Stuart Broad Records : ఒకే ఓవర్లో 36 పరుగుల సమర్పించి.. టెస్టుల్లో టాప్ బౌలర్‌గా ఎదిగి..
Stuart Broad On Yuvraj Singh : యువరాజ్ వల్లే సక్సెస్ అయ్యా.. ఆ రోజు ఎప్పటికీ మర్చిపోలేను : బ్రాడ్