Tim Paine replacement: టిమ్ పైన్ లేకపోయినా ఆస్ట్రేలియా టీంకు పెద్ద నష్టమేమీ లేదని భారత మహిళల క్రికెట్ టీం మాజీ కోచ్ డబ్ల్యూవీ రామన్ అన్నారు. పైన్ గొప్ప కీపర్ ఏం కాదని చెప్పారు. ఆస్ట్రేలియా టీంకు మంచి భవిష్యత్ ఉందని అన్నారు. యాషెస్ సిరీస్‌కు ఆస్ట్రేలియా వికెట్ కీపర్‌గా టిమ్ పైన్ స్థానంలో అలెక్స్ క్యారేను ఎంపిక చేసిన నేపథ్యంలో రామన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
టిమ్ పైన్ గతనెల అసభ్యకర సందేశాలు పంపిన వివాదంలో చిక్కుకొని కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. అయితే, ఆటగాడిగా కొనసాగుతానని చెప్పిన అతడు కొద్ది రోజుల క్రితం విశ్రాంతి తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. దీంతో పరిమిత ఓవర్ల క్రికెట్‌లో వికెట్ కీపర్‌గా రాణిస్తున్న క్యారేను క్రికెట్ ఆస్ట్రేలియా గురువారం యాషెస్ సిరీస్‌కు ఎంపిక చేసింది. తొలి రెండు టెస్టులకు ఎంపిక చేసిన 15 మంది ఆటగాళ్ల జాబితాలో అతడి పేరును ప్రకటించింది. మరోవైపు టిమ్ పైన్ కెప్టెన్‌గా తప్పుకోవడం వల్ల ప్యాట్ కమిన్స్‌ను నూతన సారథిగా ఎంపిక చేసింది. అతడికి స్టీవ్ స్మిత్ వైస్ కెప్టెన్‌గా సేవలందిస్తాడు.
ఇదీ చదవండి: KKR retention 2022: 'కేకేఆర్ వల్లే టీమ్ఇండియాలో అవకాశం!'