ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ మధ్య జరిగే యాషెస్ టెస్టు(2021-22) సిరీస్.. ఈ ఏడాది డిసెంబరు 9 నుంచి ప్రారంభమయ్యే అవకాశముంది. సాధారణంగా సిడ్నీ వేదికగా జరిగే ఈ సిరీస్ ఫైనల్(ఐదో టెస్టు) ఈ సారి పెర్త్‌లో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది జనవరి 14 నుంచి ఈ మ్యాచ్ ప్రారంభమవచ్చు. ఒకవేళ ఇలా జరిగితే 26 ఏళ్ల యాషెస్ చరిత్రలో ఐదో మ్యాచ్ వేదిక మారడం ఇదే తొలిసారి అవుతుంది.
ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా మధ్య ప్రతి రెండేళ్లకొకసారి జరిగే సిరీస్‌ను యాషెస్‌గా అభివర్ణిస్తారు. దీనికి క్రికెట్ చరిత్రలో ఎంతో ప్రాధాన్యం ఉంది. దేశ ప్రతిష్ఠగా భావించే ఈ సిరీస్‌లో ఇరుజట్లు ఐదు టెస్టులు ఆడతాయి. ఈ సీజన్లో తొలి మ్యాచ్(గబ్బా), రెండోది(అడిలైడ్), మూడు(మెల్బోర్న్), నాలుగు(సిడ్నీ)లో జరగనున్నాయి.
ఈ ఏడాది నవంబరులో ఆస్ట్రేలియా అప్ఘానిస్థాన్‌తో సొంతగడ్డపై సిరీస్ ఆడనుంది. కాబట్టి యాషెస్‌కు ముందు ఈ సిరీస్ వారికి వార్మప్‌గా ఉపయోగపడుతుంది. 2019 యాషెస్ 2-2 తేడాతో డ్రాగా ముగిసింది. గత 47 ఏళ్లలో యాషెస్ డ్రా కావడం అదే తొలిసారి.
ఇదీ చూడండి: 'ధ్యాస మళ్లించడంలో టీమ్ఇండియా దిట్ట'